ఏపీలో ప్రముఖ వెబ్సైట్ లు హ్యాకింగ్..


Ens Balu
3
Tadepalle
2021-01-03 09:29:52

ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ న్యూస్ వెబ్ సైట్లు, ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లు హ్యాకింగ్ కి గురవుతున్నాయి. ఎంత గట్టిగా సెక్యూరిటీలు, యాంటీ వైరస్ లు వినియోగిస్తున్నా చాలా న్యూస్ వైబ్ సైట్లు, ముఖ్యమైన కంపెనీలకు చెందిన వెబ్ సైట్లు, ప్రభుత్వ శాఖలోని శాఖలకు చెందిన వెబ్ సైట్లు హాకర్ల బారిన పడకుండా ఎవరూ ఆపలేకపోతున్నారు. కొందరు అదేపనిగా న్యూస్ వెబ్ సైట్లను చెడగొట్టే పనిలో ఉన్నారని సమాచారం. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే హ్యాకింగ్ అయిన న్యూస్ వెబ్ సైట్ లలో కంటెంట్ మాత్రమే పోతుంది. దానికి నిర్వాహకులు ప్రత్యేకంగా సొంత హోస్టింగ్ సర్వర్ లను తీసుకుంటున్నారు. గతంలో గ్రూపు హోస్టింగ్ పద్దతిలో న్యూస్ వెబ్ సైట్లు హోస్టింగ్ జరిగేవి. అలా గ్రూపు వెబ్ సైట్లు హోస్టింగ్ ఇచ్చే సర్వర్లు కూడా డేటా సెక్యూరిటీ విషయంలో ప్రత్యేకంగా డేటాను భద్రం చేయడంలో విఫలం అవుతున్నాయి. కొద్ది మొత్తానికి డేటాను కూడా ఎలా దాచిపెట్టి ఉంచాలా అన్నట్టు మాట్లాడుతున్నారు ప్రైవేటు హోస్టింగ్ సర్వర్ నిర్వాహకులు. దీనితో ఈ సమయంలోనే కొన్ని వెబ్ సైట్లకు వచ్చిన రేటింగ్ ను చెడగొట్టడానికి హ్యాకర్లు వ్యూవర్ షిప్ అధికంగా వున్న న్యూస్ వెబ్ సైట్లపై కన్నేసి వాటిని పక్కదారి పట్టిస్తున్నారు. ఫలితంగా సదరు న్యూస్ వెబ్ సైట్ ను గుగూల్ లో సెర్చ్ చేస్తుంటే వేరొక వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. దానికోసం హ్యాకర్లు న్యూస్ వెబ్ సైట్ కి ట్యాగ్ లైన్లను కోడింగ్ తోనే మార్చేస్తున్నారు. అలాంటి హ్యాకర్ల బారి నుంచి తప్పించుకోవడానికి చిన్న చిన్న న్యూస్ వెబ్ సైట్లకు చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీనితో ఒక వెబ్ సైట్ హ్యాకింగ్ కి గురైతే మరోక వెబ్ సైట్ ను రూపొందించుకంటున్నారు నిర్వాహకులు. మరికొందరు ముందడుగు వేసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఉపయోగం అయితే పెద్దగా ఏమీ కనిపించడం లేదు. న్యూస్ వెబ్ సైట్లను కాపాడుకోవడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. మరికొందరు ఇదే హ్యాకింగ్ ను వ్రుత్తిగా చేసుకొని కొన్ని కేసుల్లో పోలీసులకు, సైబర్ క్రైమ్ విభాగానికి ఊచలు లెక్కిస్తున్నా..బయటకు వచ్చి కూడా మళ్లీ హ్యాకింగ్ లు చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సెక్యూరిటీ సిస్టమ్ ఏర్పాటు చేస్తే న్యూస్ వెబ్ సైట్లకే కాదు, ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లకు కూడా రక్షణ ఉండదనే విషయాన్ని గుర్తించాలి..!