అల్లూరి సంచరించిన ప్రాంతాల అభివ్రుద్ధి..
Ens Balu
3
Rampachodavaram
2021-01-04 14:40:11
‘విప్లవజ్యోతి’ అల్లూరి సీతారామరాజు పోరాటం సాగించిన విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలలోని సీతారామరాజు దాడులుచేసిన పోలీస్‌స్టేషన్‌లు, పోరాట ప్రాంతాలు అభివృద్ధిచేయడానికి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో సీతారామరాజు దాడులుచేసిన రంపచోడవరం, అడ్డతీగల, రాజవొమ్మంగిలోని వాస్తవ (పాత) పోలీస్ స్టేషన్‌ల అభివృద్ధికి జిల్లా ఎస్పీ అద్నామ్ నయీం అస్మీ ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికీ అల్లూరి దాడిచేసిన నాటి వాస్తవ అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌ను జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం, పోలీస్‌శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి సర్వం సిద్ధమై నట్లు అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు తెలిపారు. పర్యాటకులు స్వేచ్ఛగా సందర్శించుకొనే విధంగా పాత పోలీస్‌స్టేషన్ చుట్టూ ప్రహరీగోడ నిర్మించి, ముఖ ద్వారం ఏర్పాటుచేసి, ఆ ప్రాంతాన్ని పూలమొక్కలతో ఉద్యాన వనంగా రూపొందించాలని నిర్ణయించనట్లు సిఐ రవికుమార్, ఎస్సై నాగేశ్వరరావులు తెలిపారు. ఈ మేరకు డి.సి.సి.బి. చైర్మన్ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు), రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనక్ష్మిలు పోలీసులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అల్లూరికి సంచరించిన ప్రాంతాలు చిరస్థాయి భావి భారత పౌరులకు పర్యాటక కేంద్రాలుగా కనిపించనున్నాయి.