4.26 ల‌క్ష‌ల భ‌క్తుల‌కు వైకుంఠ ద‌ర్శ‌నం..


Ens Balu
3
Tirumala
2021-01-04 19:39:40

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబరు 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు 10 రోజుల‌ పాటు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ 4.26 ల‌క్ష‌ల మంది భక్తుల‌కు తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన‌ట్టు టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. టిటిడి తొలిసారిగా ప్రారంభించిన 10 రోజుల‌ వైకుంఠ ద్వార దర్శనానికి శాస్త్ర సహేతుకంగా అంగీకరించిన పీఠాధిపతుల‌కు, తిరుమల‌ పెద్దజీయంగార్‌, చిన్నజీయంగార్ల‌కు, ఆగమపండితుల‌కు కృతజ్ఞతాభివందనాలు తెలియ‌జేశారు. ఈ 10 రోజుల‌ పాటు భక్తుల‌కు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేసి అహర్నిశ‌లు శ్రమించిన ప్రతి ఒక్క టిటిడి ఉద్యోగికి పేరుపేరునా అభినందన‌లు చెప్పారు. 10 రోజులు వైకుంఠ ద్వార దర్శన నిర్ణయానికి గొప్ప ప్రాచుర్యాన్ని, సహకారాన్ని అందించిన మీడియా మాధ్యమాల‌న్నింటికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే, టిటిడి భద్రతా సిబ్బందికి, పోలీసుల‌కు, పుష్పాల‌ దాతల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు టిటిడి ఈఓ..