ప్రభుత్వ యూనివర్శిటీల్లో భారీగా పీఆర్వోల కొరత..
Ens Balu
3
Tadepalle
2021-01-05 09:10:19
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ యూనివర్శిటీల్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు(పీఆర్వో)ల కొరత దారుణంగా పట్టిపీడిస్తుంది. ఏ ఒక్క యూనివర్శిటీలో కూడా సక్రమంగా సమాచారం మీడియాకి అందించేందుకు ఒక్క పీఆర్వో కూడా లేదు. చాలా యూనివర్శిటీల్లో జర్నలిజం విభాగంలో చదివే విద్యార్ధులు, విభాగాల అధిపతులు పీఆర్వో బాధ్యతలు తీసుకున్నా ఫలితం ఉండటం లేదు. వాస్తవానికి ప్రభుత్వ యూనివర్శిటీల్లో పరీక్షలు, తరగతులు, పరీక్షల ఫీజులు, ఇతరత్రా అంశాలను ఎప్పటి కప్పుడు విద్యార్ధులందరికీ తెలియజేయాల్సి వుంటుంది. ఆ సమాచారం యూనివర్శిటీ వెబ్ సైట్లలో కూడా సక్రమంగా పెట్టడం లేదు. కొన్ని యూనివర్శిటీల్లో ప్రైవేటు వ్యక్తులను యూనివర్శిటీ అధికారులు వినియోగించుకుంటున్నారు. వారికి ఇంగ్లీషు ప్రెస్ నోట్లు తెలుగులోకి తర్జుమా చేయడం రాక వాటినే మీడియాకి అలా పంపేస్తున్నారు. దీనితో చాలా మీడియా సంస్థల్లో జర్నలిస్టులకు ఇంగ్లీషుపై పట్టు తక్కువగా వుండటంతో ముఖ్యమైన ఇంగ్లీషు ప్రెస్ నోట్లు బుట్టదాఖలవుతున్నాయి. దానికితోడు ఏ యూనివర్శటీలోనూ పీఆర్వోగా పనిచే ప్రైవేటు వ్యక్తులకు న్యూస్ ఫార్మాట్ లో ప్రెస్ నోటు పంపే అవగాహన లేదు. అక్కడ ఏం జరిగిందో తెలియజేసే క్రమం కూడా సక్రమంగా రాకపోవడం శోచనీయం. ప్రభుత్వం యూనివర్శిటీల్లో పీఆర్వోల నియామకానికి చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా ప్రైవేటు యూనివర్శిటీల తరచుగా మీడియా ద్వారా ఇచ్చే సమాచారం విద్యార్ధులు కూడా ప్రైవేటు యూనివర్శిటీల్లో చదువుకునేందుకే మొగ్గు చూపిస్తున్నారు. కొన్ని యూనివర్శిటీల్లో పీఆర్వోలు ఉన్నా వారంతా ప్రధానన మీడియా సంస్థలకు మాత్రమే సమాచారన్ని కొద్దో గొప్పో పంపిస్తున్నారు. అసలు ఒక ప్రభుత్వ యూనివర్శిటీలో ఏం జరుగుతుందో సదరు పీఆర్వోనే విద్యార్ధులకు అధికారిక యూనివర్శిటీ వెబ్ సైట్ ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాల్సి వుంది. కొన్న సమయాల్లో యూనివర్శిటీ వెబ్ సైట్లలో సమాచారం వుంచినా దానిని ఎవరూ చూసే పరిస్థితి ఉండటం లేదు. వివిధ యూనివర్శిటీలో వైస్ చాన్సలర్స్ కి పీఆర్వోలను నియమించుకునే అధికారాలు ఉన్నప్పటికీ వారు వారి పదవి కాపాడుకోవడానికే సమయాయాన్ని వెచ్చిస్తున్నారు తప్పితే విద్యార్ధులకు యూనివర్శిటీకి సంబంధించి అన్ని రకాల సమాచారాన్ని అందించాలనే యోచన చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సమాచారం మీడియాకి తెలుగులో ఇస్తే తప్పా విద్యార్ధులకు త్వరగా చేరే పరిస్థితి లేదు. ఇంగ్లీషులో పత్రికలు, మీడియాల్లో విషయం వచ్చినా యూనివర్శిటీ విద్యార్ధులకు రీచ్ కావడం లేదు. ప్రస్తుత కాలంలో విద్యార్ధులు, అద్యాపకులు, యూనివర్శిటీ సిబ్బంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్న తరుణంలో పీర్వోల అవసరం మరింత అనివార్యం అయ్యింది. సమాచారాన్ని కరెక్టుగా మీడియాకి పంపితే వారంతా పోటీ మీద మొబైల్ న్యూస్ యాప్ లు, న్యూస్ వెబ్ సైట్లు, లోకల్ కేబుల్ టీవీ ఛానళ్లలో స్క్రోలింగ్ ద్వారా సమాచారం విద్యార్ధులకు చేరవేస్తున్నారు. కరోనా లాంటి సమయంలో పీఆర్వోల అవసరం కొట్టొచ్చినట్టు తెలిసినా ప్రభుత్వం పీఆర్వోలను నియమించే ఈ విషయంలో చర్యలు తీసుకోలేదు. ఫలితంగా యూనివర్శిటీల్లో జర్నలిజం విభాగం వాటిని పూర్తిస్థాయిలో మీడియాకి అందించే ఏర్పాటు చేయడంలేదు. యూనివర్శిటీలో విద్యార్ధులకు క్రమం తప్పకుండా సమాచారాన్ని మీడియా ద్వారా అందించేందుకు పీఆర్వోల ద్వారా ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో పలు యూనివర్శిటీల వీసీలను ఈఎన్ఎస్ వివరణ కోరగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని చెప్పారు. కొన్ని సమయాల్లో విద్యార్ధులు ఇబ్బంది పడకుండా ప్రైవేటు వ్యక్తులు, పీజి విద్యార్ధుల సహాయంతో మీడియాకి సమాచారన్ని పంపిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇలాంటి తరుణంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్పా ప్రభుత్వ యూనివర్శిటీల సమాచారం సక్రమంగా మీడియా ద్వారాగానీ, యూనివర్శిటీల వెబ్ సైట్ ద్వారా గానీ అందించే వీలుపడదు..!