ఏపీలో దేవాలయాల దాడులపై కేంద్రం పరిశీలన..
Ens Balu
2
Tadepalle
2021-01-05 13:10:25
ఆంధ్రప్రదేశ్ లోని హిందు ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులను ఇటు కేంద్ర ప్రభుత్వం,అటు నాగపూర్ లోని ఆర్ ఎస్ ఎస్ కేంద్ర కార్యాలయం సునిశితంగా గమనిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. తాజాగా ఈరోజు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శ్రీలక్షి వరాహ నరసింహ స్వామి వారి ఆలయ ముఖద్వారం పై చేతిని విరగొట్టటం తో ఈ ఆందోళన ఉత్తరాంద్ర నుంచి రాజమండ్రి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి విగ్రహం, విజయవాడలో సీతా దేవి విగ్రహం ధ్వంసం చెయ్యగా తాజాగా సింగరాయకొండ వరకు అంటే కోస్తా జిల్లాల్లో ఉద్రిత్కథ విస్తరించింది. ఈ రోజు బీజేపీ,దాని మిత్ర పక్షం జనసేన తలపెట్టిన ధర్మ యాత్ర ను రామతీర్థం చేరకుండా ముందుగానే 30 సెక్షన్ విధించిన పోలీసులు నివారించే భాగంలో జరిగిన తోపులాట లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కిందపడ్డారు కూడా. ఈ విషయంలో అటు జాతీయ బీజేపీ,అలాగే ఆయన ఆర్ ఎస్ ఎస్ నేపధ్యము కలిగి ఉండటంతో అటు ఆర్ ఎస్ ఎస్ కేంద్ర కార్యాలయం కూడా ఈ పరిస్థితిపై నిశితంగా ఆరాతీస్తున్నాయి అని ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. హిందు దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను నిలవరించక పోవటంలోను,జరిగిన దాడులపై సరైన చర్యలు తీసుకోలేకపోవటం వెనుక జరుగుతున్న పరిణామాలను పూర్తీ వివరాలతో నివేదికను రాష్ట్ర గవర్నర్ నుండి కోరే అవకాశాలున్నట్లు విశ్వనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటివరకు కొంత సమన్వయంతో ఉన్న జాతీయ బీజేపీ శ్రేణులు,ఆర్ ఎస్ ఎస్ కేంద్ర కార్యాలయం కూడా ఈ రోజు సోము వీర్రాజు తోపులాటలో క్రింద పడటాన్ని సీరియస్ గా తీసుకుని నివేదిక వచ్చేవరకు వేచి చూసి అంతరం తీసుకోవలసిన చర్యలు గూర్చి ఒక కొలిక్కి వస్తాయి అని భావిస్తున్నారు. కాగా ఇప్పటివరకు టీడీపీ పై మాత్రమే విమర్శలు కురిపిస్తున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజుని విమర్శిస్తున్న వారు,ఈ రోజు ధర్మయాత్రలో రాష్ట్ర ప్రభుత్వం పై ఆయన చేసిన శపథం తీరు గమనిస్తే బీజేపీ అటు పుష్కరాల సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం 40 ఆలయాలు కూల్చి వేత, ఇప్పటి ప్రభుత్వంలో జరుగుతున్న వరుస దాడులపట్ల సమాంతర దృష్టితో వెళుతున్నారని తేటతెల్లం అయిందని పరిశీలకుల భావన. మాజీ మంత్రి బీజేపీ నాయకుడు కే.శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ను తమ పార్టీ నేతలను రామతీర్థం వెళ్లనివ్వకుండ అడ్డుకున్న ఈ ప్రభుత్వం ఫలితాన్ని అనుభవిస్తుంది అని ఆగ్రహిం వ్యక్తం చేశారు.
ఇది ఇలా వుండగా శ్రీకాళహస్తిలో ఈ ఉదయం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ నేతలని రామతీర్థం అనుమతించకపోతే రాష్ట్రం తగలబడిపోతుందని జరగబోయే పరిణామాలకు సీఎం జగన్ నైతిక బాధ్యత వహించాలని హెచ్చరించారు.రామతీర్థం కొండ మీదికి టీడీపీ, వైసిపిని అనుమతించి మమ్మల్ని అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు వైఎస్సార్సీపీ కండువాలు కప్పుకుని డ్యూటీ చేయండి అన్నారు. పోలీసులకి జీతాలు ఇస్తోంది వైసీపీ ఆఫీసా..లేక రాష్ట్ర ప్రభుత్వమా అని ప్రశ్నించారు.
ఏపీలో మనవహక్కుల ఉల్లంఘనపై పోలీసుల దమన కాండ పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నటు వీస్ట్నువర్ధన రెడ్డి పేర్కొన్నారు.
60ఏళ్ల వయసున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఏపీలో పోలీసుల ప్రభుత్వం ,పోలీసుల వైపల్యం వలనే వరుస సంఘటనలు జరుగుతున్నాయని పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని విష్ణు వర్ధన్ రెడ్డి ఆగ్రహంతో పేర్కొన్నారు.