మున్సిపల్ కార్పోరేషన్ల సమాచారమెక్కడ..


Ens Balu
1
Tadepalle
2021-01-06 13:09:04

ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సపాలిటీల సమాచారం అందించడంలో ఉన్నతాధికారులు విఫలం అవుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రాజెక్టులు, అభివ్రుద్ధి పనులు, కేంద్ర, రాష్ట్ర ప్రాజెక్టుల సమాచారం కార్పోరేషన్లలో కమిషనర్లు ప్రజలకు మీడియా ద్వారా తెలియజేయాలి. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పోరేషన్లలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ల(పీఆర్వో) కొరత భారీగా వుంది. కొన్ని చోట్ల కార్పోరేషన్లలో పనిచేసే జోనల్ కమిషనర్లను పీఆర్వోలుగా వినియోగిస్తున్నారు. దీనితో వారికి సమాచారం మీడియాకి ఎలా ఇవ్వాలో తెలీక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదేసమయంలో వీరు విధినిర్వహణలో భాగంగా ఇచ్చే సమాచారం అటు మీడియాకి ప్రతినిత్యం పెద్ద పెద్ద పరీక్షలు పెడుతున్నాయి. స్మార్ట్ సిటీ పథకంలో చేసే అభివ్రుద్ధిని నిత్యం మీడియాకి తెలియజేయాల్సిన అధికారులు ఆ దిశగా ఎలాంటి సమాచారమూ ఇవ్వడం లేదు. ఒక్క ముఖ్కలో చెప్పాలంటే స్మార్ట్ సిటీ పథకంలో ఎంతమంది పనిచేస్తున్నారు..ఏఏ ప్రాజెక్టులు చేపడుతున్నారనే విషయాన్ని ఏడాది ఒకసారి కమిషనర్ ప్రెస్ మీట్లో తప్పా ఇతర సమయాల్లో మీడియాకి తెలియజేడం లేదు. అదీకాకుండా అధికారులుగా విధులు నిర్వహించేవారికి పీఆర్వో పని చేయడం రాకపోవడంతో.. కార్పోరేషన్లలోని సమాచారం న్యూస్ ఫార్మాట్ లో తెలియజేయడం ఇబ్బంది కరంగా మారుతోంది. కొంత సమాచారం అధికారులు ఇచ్చింది ఇచ్చినట్టుగా ఇచ్చేయడం, అన్నీ పీడీఎఫ్ ఫార్మాట్ లోనూ, కొన్ని విషయాలు పూర్తిస్థాయిలో తెలియజేకపోవడం  వంటి లోపాలు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియడం లేదు. ఎందుకిలా చేస్తున్నారని ఆరా తీస్తే అన్నివిషయాలు మీడియాకి తెలిస్తే..పనికొగట్టుకొని వార్తలు రాస్తారని కావాలనే చాలా కార్పోరేషన్లలో పీఆర్వోలను నియమించలేదనే వాదన కార్పోరేషన్లలలోని అధికారుల నుంచే వస్తుంది. ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ద్వారా కార్పోరేషన్లలో పీఆర్వోలను నియమించుకునే అవకాశం వున్నప్పటికీ రాష్ట్రంలోని ఒకటి అరా కార్పోరేషన్లు మినహా మరెక్కడా పీఆర్వోలు లేరు. కొన్ని చోట్ల సమాచారశాఖలోని ఏపీఆర్వోలే కార్పోరేషన్ పీర్వోలుగా డిప్యూటేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదేసమయంలో సమాచారశాఖ నుంచి డిప్యూటేషన్ కావాలని కార్పోరేషన్లకు వేయించుకవోడంతో సమాచారశాఖలోని సిబ్బంది కొరత ఏర్పడుతుంది. అయితే వాస్తవాలు, లోపాలు, ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతి మీడియా ద్వారా బయటకు రాస్తే మాత్రం రాష్ట్రంలోని పలు కార్పోరేషన్ల కమిషనర్లకు ఎక్కడలేని ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. కార్పోరేషన్ల ద్వారా సమాచారం రావడం లేదని ప్రశ్నిస్తే...మేము బాగానే పంపిస్తున్నాం కదా..దానిని మీకు అనుకూలంగా మార్చుకోండని ఉచిత సలహాలు మాత్రం ఇస్తున్నారు. ఇలా అయితే స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రంలోని ప్రజలకు ఎలా తెలుస్తాయో అర్ధం కాని పరిస్థితి నెలకొంది..!