ఆల‌యాల నిర్మాణాల‌కు సీఎం శంఖుస్థాప‌న‌..


Ens Balu
1
Vijayawada
2021-01-08 15:45:02

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. శుక్ర‌వారం ముఖ్యమంత్రి  ఆలయాల పునర్నిర్మాణ కార్య‌క్ర‌మంలో పాల్గొని ప‌నుల‌ను ప్రారంభించారు. వీటిలో విజ‌య‌వాడ‌లోని దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్టుడి ఆలయం, కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. వీటితో పాటు ‌77 కోట్ల రూపాయల వ్యయంతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు కూడా  సీఎం వైయ‌స్‌ జగన్ మోహన రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఆల‌యానికి చేరుకున్న ముఖ్య‌మంత్రి కి  దుర్గ గుడి అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లుక‌గా, మంత్రులు, ఎమ్మెల్యేలు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు వెలంప‌ల్లి  శ్రీ‌నివాస్‌, పుర‌పాల‌క శాఖ‌ బోత్స స‌త్య‌నారాయ‌ణ‌, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు మ‌ల్లాది విష్ణు, జోగి ర‌మేష్‌, ర‌క్ష‌ణ నిధి, వంశీ, దేవినేని అవినాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.