స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనే దైర్యం లేదు..
Ens Balu
1
Guntur
2021-01-09 18:28:38
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల విధుల్లో పాల్గొనే ధైర్యం మాకు లేదంటూ ఏపీ ఉద్యోగుల సంఘం తేల్చేసింది. ఈ మేరకు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదన్న అయన కరోనా సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. 64 సంఘాలు కూడా ఇదే అంశాన్ని వెల్లడించాయన్న ఆయన, అయినా నిన్న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందని అన్నారు. అంత అత్యవసరంగా ఇప్పుడు ఎన్నికల నిర్వహణ ఎందుకు ? అని ప్రశ్నించారు. మరి ఐదేళ్లకాల పరిమితిలో ఎన్నికలు ఎందుకు నిర్వహించ లేదు అని అయన ప్రశ్నించారు. మీ ప్రయోజనాల కోసం.. మా బతుకులను బలి పెట్ట వద్దన్న ఆయన ఇప్పుడు వ్యాక్సిన్ వస్తున్న సమయంలో ఎన్నికల ప్రక్రియ ఎందుకు ? ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న వారికి ముందుగా వ్యాక్సిన్ వేయాలని అన్నారు. కరోనా విధుల్లో ప్రజల కోసం ఎంతో రిస్క్ తో పని చేశాం, ఎన్నికల కోసం కూడా మా ప్రాణాలు ఫణంగా పెట్టలేమని అన్నారు. ఒక వ్యక్తి ఇగో ను సంతృప్తి పరచాలని ఇలా చేయడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. రాజ్యాంగ బద్ద పదువుల్లో ఉన్న వారు.. బాధ్యత కు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
కరోనా సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ధైర్యం మాకు లేదన్న ఆయన కాదని బలవంతం చేస్తే.. న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. వేసవి సమయంలో అయితే... ఎన్నికల నిర్వహణ కు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని అన్నారు. వ్యాక్సినేషన్ మాకువేసిన తరవాత అయినా ఎన్నికలు పెడితే బాగుండేదని ఆయన అన్నారు. మా ప్రాణాల మీదకు వచ్చింది కాబట్టే...నేడు ఇలా మాట్లాడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఇప్పుడు అయినా పునరాలోచన చేయాలని అన్నారు.