ప్రెస్ మీట్లతో ఉద్యోగ సంఘాల హడావిడి..
Ens Balu
2
Guntur
2021-01-09 18:44:57
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసిన వేళ ఉద్యోగ సంఘాలు ఒక్కసారిగా ప్రెస్ మీట్లకు ఉపక్రమించాయి. రాష్ట్రంలో ఏక కాలంలో అన్ని ప్రభుత్వ సంఘాలు ప్రెస్ ముందుకి వచ్చి కరోనా సమయంలో ఎన్నికలేంటంటూ తమ బాధను వెల్లగక్కుతున్నాయి. వారితో పాటు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికలకు సిద్దంగా లేమని చెప్పడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అవసరం అనుకుంటే మూకుమ్మడిగా సెలవులు పెట్టడానికి సైతం ఉద్యోగ సంఘాలు సిద్దమవుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఎన్నికల సంఘం చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ ఎప్పుడు ఎన్నికలు నిర్వహిద్దామని ముందుకు వస్తున్నా దానికి ముందుగా ప్రభుత్వమే ముఖ్య కార్యదర్శి నుంచి తాము ఎన్నికలకు సిద్దంగా లేమని ఒక లేఖ విడుదల చేస్తుంది. ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి లేఖను చూసిన ఉద్యోగ సంఘాలు కూడా తమ ప్రకటనను మీడియా ద్వారా వెల్లగక్కుతున్నాయి. ప్రత్యేక ప్రెస్ మీట్లు పెట్టి మరీ కరోనా, సెకెండ్ వేవ్ కరోనా విషయంపైనే మాట్టాడటంతో పాటు, అన్ని అసోసియేషన్లు ముందస్తుగానే తమ అసమ్మతిని లేఖల ద్వారా ఎన్నికల సంఘానికి పంపుతున్నాయి. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఏకమైపోవడం, కరోనా పరిస్తితులు తగ్గకపోవడం, ఇటు కోవిడ్ వ్యాక్సిన్ కు పంపిణీ ఏర్పాట్లు చేస్తున్న వేళ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి ప్రభుత్వం కూడా కోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల మద్దతు గట్టిగా ఉండటంతో ఈ సమయంలో ఎన్నికలను వాయిదా వేయించుకునే విషయంలో సఫలీ క్రుతం అయ్యేట్టుగానే కనిపిస్తున్నాయి. వాస్తంగా కూడా ఏపీలో కరోనా కేసులు మళ్లీ అధికం అవడమే ఉద్యోగ సంఘాలు వెనుకడుగు వేయడానికి కారణంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఒకే మాట మీదికి రావడం కూడా చర్చనీయాంశం అవుతోంది..