అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..1
Ens Balu
4
విశాఖపట్నం
2021-01-16 19:15:20
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సమాచారశాఖ వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కోసం జారీ చేసిన జీఓనెంబరు 142 ద్వారా బడా పత్రికలకు సదరు పత్రికలు దాఖలు చేసిన న్యూస్ ఏజెన్సీ పేరుతో ఇచ్చిన క్లిప్పింగులతో సదరు పత్రికల పేరుతో అడ్డగోలుగా మంజూరు చేసిన అక్రిడిటేషన్ల వ్యవహారంపై సమాచారహక్కు చట్టం దరఖాస్తు దాఖలైంది. విశాఖజిల్లాలోని మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టరు పేరుతో దాఖలైన ఈ సమాచారహక్కుచట్టం దరఖాస్తులో కీలక అంశాలను దరఖాస్తు దారుడు ప్రస్తావిస్తూ, సమాచారం మొత్తం ఎలక్ట్రానిక్ రూపంలో కావాలని దాఖలు చేశారు. దానికి కారణం ప్రభుత్వం ప్రస్తుతం అక్రిడిటేషన్లన్నీ అన్ లైన్ లోనే దరఖాస్తు చేయడం దానికి ముఖ్య కారణం. ఒక్క విశాఖజిల్లానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు సమాచారశాఖ పెద్ద పత్రికలకు జారీచేసిన అక్రిడిటేషన్ల వ్యవహారంలో అటు పత్రికల నిబంధనలనూ, ఇటు న్యూస్ ఏజెన్సీల నిబంధనలనూ అమలు చేయకుండా అక్రిడిటేషన్లను మంజూరు చేసింది. ఆ విషయం ఇపుడు చర్చనీయాంశ అయ్యింది. విశాఖలో దాఖలైన సహచట్టం దరఖాస్తులోని 15 అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే...
1)సమాచారశాఖ ఇచ్చిన జీఓ142 నెంబరు ఆధారంగా ఎన్ని మీడియా సంస్థలు విశాఖజిల్లాలో అక్రిడిటేషన్ కోసం సమాచారశాఖ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నాయి? ఎందుకు పాత జీఓ కాకుండా కొత్తజీఓను అమలు చేశారు? దానికి గల కారణాలు, మీడియా సంస్థల పేర్లు..ఇచ్చిన అక్రిడిటేషన్లు, సమాచారం..ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సివున్నది..
2)ఎన్ని మీడియా సంస్థలు సమాచారశాఖ నిబంధనల ప్రకారం ఆన్ లైన్లో దరఖాస్తులు సపోర్టింగ్ డాక్యుమెంట్లు సమర్పించాయి? వాటి వివరాలు, సమర్పించిన పత్రాల పీడీఎఫ్ సమాచారం(ఆన్ లైన్లో వున్నదే కనుక పెద్దగా ఖర్చు వుండదు డౌన్ లోడ్ చేసి ఇవ్వడానికి వీలుపడుతుంది) ..ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) కావాల్సి వున్నది..
3)దేశవ్యాప్తంగా న్యూస్ ఏజెన్సీలన్నింటికీ ఒకే ఫార్మాట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నది అలా అయిన పక్షంలో జాతీయ న్యూస్ ఏజెన్సీలు ఎన్ని ఆన్ లైన్ లో అక్రిడిటేషన్ల కోసం దరఖాస్తులు చేశాయి..చేసిన సమయంలో నిబంధనల ప్రకారం ఎన్ని పత్రికలు, ఛానళ్లు, చందారుల వివరాలు పొందు పరిచాయి..ఎన్ని పత్రికలకు సంబంధించిన ప్రెస్ క్లిప్పింగులు అప్లోడ్ చేశాయి..అదీ ఎంపానల్ మెంట్ అయిన వివరాలతో కూడినవి అవి కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది..
4)పెద్ద పత్రికలు తమ సంస్థ నుంచి అక్రిడిటేషన్ల కోసం సమాచారశాఖ ఆన్ లైన్ వెబ్ సైట్ లో దరఖాస్తు చేస్తే పత్రిక పేరుతో దరఖాస్తు చేశాయా?..లేదంటే పత్రికకు సొంతంగా ఏర్పాటు చేసుకున్న న్యూస్ ఏజెన్సీ నుంచి దరఖాస్తు చేశాయా?...అలా న్యూస్ ఏజెన్సీ ద్వారా దరఖాస్తు చేసే ఒక పత్రికకే న్యూస్ సొంత ఏజెన్సీ ద్వారా వార్తలు అందిస్తే...ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ పత్రికల వార్తల క్లిప్పింగులు జతచేశారా? లేదంటే జత చేయలేదా..? జత చేయకపోతే సదరు పత్రిక పేరుతో లేని ప్రెస్ క్లిప్పింగ్ తో ఆ పత్రికకు ఏ ప్రభుత్వ జీఓ ప్రకారం అక్రిడిటేషన్లు మంజూరు చేశారు? వాటితో పాటు జర్నలిస్టుల నియామకపత్రాలు, లేబర్ యాక్టు ప్రకారం లేబర్ లైసెన్సు సదరు పెద్ద పత్రికలకు ఎన్ని అక్రిడిటేషన్లు జారీ చేశారు వాటి సంఖ్య.. అవి కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది..
5)గత ఐదేళ్లుగా ఏఎన్ఐ, పీటిఐ, యూఎన్ఐ, డిఎన్ఎస్ వార్త సంస్థలకు ఏ ప్రాతిపధికన అక్రిడిటేషన్లు మంజూరుచేశారు? ప్రభుత్వ నిబంధనల ప్రకారం సదరు న్యూస్ ఏజెన్సీలు వివిధ పత్రికల చందారుల వివరాలు, ప్రెస్ క్లిప్పింగులు, లేబర్ లైసెన్సు, షాప్స్ అండ్ ఎస్టాబ్లెస్ మంట్ సర్టిఫికేట్, ఉద్యోగుల జీతబత్యాలు, ఇతర ఖర్చులకు సంబంధించిన ప్రొప్రైటర్ యొక్క ఆదాయపు పన్ను, ఈ ఫైలింగ్ సర్టిఫికేట్, చార్టెట్ అకౌంటెంట్ ఇచ్చిన సర్టిఫికేట్లు పొందుపరిచాయా? పొందుపరిస్తే అవి ఎక్కడున్నాయి వాటిని అక్రిడిటేషన్ కమిటీలో పెట్టి ప్రస్తావిస్తే వాటియొక్క మినిట్స్ కాపీలు... విశాఖజిల్లా సమాచారశాఖ అధికారులకు సమర్పించాయా..? సమర్పిస్తే వాటి నకళ్లు కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది..
6)పత్రికలకైతే ఒక జర్నలిస్టుకి నెలకి 10 క్లిప్పింగులు చొప్పున 30 క్లిప్పింగులు అప్లోడ్ చేయాలి...కానీ సమాచారశాఖ న్యూస్ ఏజెన్సీలకు ఇచ్చిన మార్గ దర్శకాల ప్రకారం ఒక్కో అక్రిడిటేషన్ కు 200 క్లిప్పింగులు జతచేయాలి...అది పీడిఎఫ్ చేసి అప్లో చేయడానికి వీలుపడని సమయంలో ఎలా సమాచారశాఖ అధికారులు న్యూస్ ఏజెన్సీలకు ఈ నిబంధన వర్తింప చేశారు?. దానికి సాంకేతిక కారణాలకు సంబంధించిన ఆధారాలు, సదుపాయాలు, ఉంటే తెలియజేయ గలరు వాటిని కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది..
7)పెద్ద పత్రికలు సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త దిన పత్రికలతో పాటు ఇతర పత్రికల క్లిప్పింగులు అక్రిడిటేషన్ కోసం ఆన్ లైన్ లో సమర్పించినవి సదరు పత్రిక పేరుతో కాకుండా..ఆ పత్రిక యొక్క సొంత న్యూస్ ఏజెన్సీ పేరుతో ప్రచురితం అయిన క్లిప్పుంగులు జతజేస్తే...సదరు పత్రికలకు పత్రిక పేరుతో అక్రిడిటేషన్ ఎలా మంజూరు చేశారు?.. అలా మంజూరు చేయడానికి పెద్ద పత్రికల కోసం ప్రత్యేక నియమ నిబంధనలు, జీఓలు ఏమైనా ఉన్నాయా ? పత్రిక నుంచి అక్రిడిటేషన్ కి దరఖస్తు చేస్తే క్రెడిట్ లైన్ పత్రిక పేరుతోనే ఉండాలి అది ప్రభుత్వ నిబంధన, అలా కాకుండా ఈనాడు పత్రిక న్యూస్ టుడే, అని ఆంధ్రజ్యోతికి ఆన్ లైన్ అని, సాక్షి న్యూస్ లైన్ అని, వార్తకి ప్రభాతవార్త అని వార్తల క్లిప్పింగులు సమర్పిస్తే ప్రభుత్వం వాటిని సదరు పత్రిక వార్తలుగా ఎలా పరిగణిస్తుంది? అలా ప్రచురితం అయిన వార్తలు న్యూస్ ఏజెన్సీ వార్తలుగా పరిగణించాలి కదా..? అలా పరిగణించకపోయినా..వారికికోసం ఏదైనా ప్రత్యేక జీఓ గానీ, నియమ నిబంధనలు గానీ ఏమైనా ఉంటే వాటిని తెలియజేయగలరు.. ..అదే సమయంలో మిగిలిన పత్రకలకు కూడా ప్రభుత్వ సమాచారశాఖ ఏ న్యూస్ ఏజెన్సీ వార్తలు పెద్ద పత్రికల్లో ప్రచురణ జరిగినా వాటికి మాత్రం సదరు పేరుతోనే, అక్రిడిటేషన్లు మంజూరు చేయాలనే పత్రికలకే వర్తిస్తుందా? అలా వర్తించినపుడు ఒక జర్నలిస్టు నెలకు పది వార్త క్లిప్పింగులు కాకుండా, న్యూస్ ఏజెన్సీ లెక్కలో పరిగణిస్తే సదరు పత్రికల నుంచి కూడా నెలకు 50 క్లిప్పింగులు ఆన్ లైన్ లోనే అప్లోడ్ చేయాల్సి వుంటుంది... ప్రస్తుతం సమాచారశాఖ మంజూరు చేసి అక్రిడిటేషన్లు ఆ నిబంధనలను అనుసరించి ఇచ్చారా..? ప్రస్తుతం ఇచ్చిన అక్రిడిటేషన్లకు సంబంధించిన నకలు, సదరు పత్రికలు అన్లైన్ లో సమర్పించిన ప్రెస్ క్లిప్పింగులు కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది..
8)అక్రిడిటేషన్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న పత్రికలు పత్రిక పేరుతో అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేశాయా?..లేదంటే ఆ పత్రిక కోసం సొంతంగా ఏర్పాటు చేసుకున్న న్యూస్ ఏజెన్సీల పేరుతో దరఖాస్తు చేశాయా..? న్యూస్ ఏజెన్సీల క్లిప్పింగులను ఎలా పత్రిక పేరుతో ప్రమాణికంగా తీసుకుంటున్నారో దానికి సాంకేతిక కారణలు, ఆ పత్రికల కోసం ప్రత్యేక నియమ నిబంధనలు ప్రభుత్వ జీఓల రూపంలో జారీ చేస్తేవాటియొక్క నకలు పీడిఎఫ్ లేదా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది..
9)ప్రభుత్వం ఇచ్చిన మార్గ దర్శకాల ప్రకారం ఆదాయ పన్ను చెల్లించిన మీడియా సంస్థలు, న్యూస్ ఏజెన్సీల నిర్వాహకులకు రేషన్ బియ్యం కార్డు రద్దు చేశారు...అలాగని అన్ని నిబంధనల ప్రకారం న్యూస్ ఏజెన్సీలు నడుపుతున్నా వారికి అక్రిడిటేషన్లు మంజూరు విషయంలో ప్రత్యేక జీఓ ద్వారా కొర్రీలు వేస్తున్నారు. అయితే రేషన్ కార్డు కేన్సిల్ చేసినందుకు, సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా అమలు ఆదాయపన్ను రూపంలో కట్ చేసినందుకు మీ న్యూస్ ఏజెన్సీలకు అక్రిడిటేషన్లు అయినా ఇవ్వండి...లేదంటే ఇప్పటి వరకూ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లో అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు పొందిన న్యూస్ ఏజెన్సీలకు అయిన నష్టాన్ని భర్తీ చేయండి.. ఒక వేళ రెండూ చేయడానకి కుదరదు అనుకుంటే ఎందుకు కుదరదో తెలియజేసే నిబంధనలనైనా లిఖిత పూర్వకంగా తెలియజేయండి.. అది కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది..
10)న్యూస్ ఏజెన్సీల నిర్వహణకు కంప్యూటర్లు, ఏసిలు, కరెంటు బిల్లులు, ఇంటర్నెట్ చార్జీలు, సిబ్బంది జీతాలు, ఇంటి అద్దెలు, సాఫ్టు వేర్లు, ఫ్యాక్స్ మిషన్లు, ప్రింటర్లు, స్కానర్లు, ప్రభుత్వ అనుమతి పత్రాలు, బ్యాంకు కరెంటు అకౌంట్లు, చార్టెడ్ అకౌంట్ ఛార్జీలు, మొబైల్ ఫోన్లు, న్యూస్ యాప్ లు, న్యూస్ వెబ్ సైట్లు, లేబర్ లైసెన్సులు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ పత్రాలు నిర్వహణకు అయిన ఖర్చును, న్యూస్ ఏజెన్సీలు నిర్వహిణ ఏ స్థాయిలో వినియోగిస్తున్నారో ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి. లేదంటే గత నాలుగేళ్లుగా చేసిన లక్షల రూపాయల ఖర్చు మొత్తం వ్రుధా పోయినట్టేనని అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, సమాచారశాఖ అధికారులు తెలుసుకోవాల్సి వుంది. ఇవేమీ మాకు పట్టవు మాకు నిబంధనలు మాత్రమే అమలు చేస్తాము అని ఖరాఖండీగా చెబితే నియమ నిబంధనలన్నీ అన్ని మీడియా సంస్థలకు ఒకేలా అమలు చేయాలి..అలా ఎక్కడ అమలు చేశారో కూడా లిఖిత పూర్వకంగా పెద్ద పత్రికలు, లోకల్ కేబుల్ టివి ఛానళ్లు, శాటిలై ఛానళ్లు విషయంలో లిఖిత పూర్వకంగా అది కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది..
11)విశాఖ జిల్లాలో ఎన్ని మీడియా సంస్థలు వేజ్ బోర్డు నియమ నిబంధనలు పాటిస్తున్నాయో, వాటి వివరాలు కూడా లిఖిత పూర్వకంగా ఆధారాలు, సదరు సంస్థలు సిబ్బందికి ఇచ్చిన జీతాల యొక్క ఆడిట్ రిపోర్టులు, లేదంటే సదరు పత్రికలకు సొంతంగా ఏర్పాటు చేసుకున్న న్యూస్ ఏజెన్సీల యొక్క ఆడిట్ రిపోర్టులు, పత్రికలు సమర్పించిన ఆడిట్ రిపోర్టులు, సదరు పత్రిక న్యూస్ ఏజెన్సీ కోసం తీసుకున్న లేబర్ లైసెన్స్, షాప్ష్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ ద్రువీకరణ, ప్రొప్రైటర్ ఆదాయపన్ను ఈఫైలింగ్ పత్రాలు కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది..
12)ఏదైనా మీడియా సంస్థకు పత్రికగానీ, టివి గానీ, న్యూస్ ఏజెన్సీ గానీ దేనికైనా ఎడిటర్, జర్నలిస్టు, ఫోటో గ్రాఫర్, సబ్ ఎడిటర్ లేకుండా ఒక న్యూస్...న్యూస్ ఫార్మాట్ లోకి రాదు. అలా అందరూ జర్నలిస్టులుగానే పరిగణింప బడతారు. అదే సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదిలక్షల లోపు టర్నోవర్ దాటిన న్యూస్ ఏజెన్సీలకు, ఇతర మీడియా సంస్థలకు ఇచ్చే అక్రిడిషన్ల సంఖ్య విషయంలో నిబంధలు ఎందుకు, ఏ జీఓ ప్రకారం మార్చారో కూడా తెలియజేయాలి... వాటికి గల కారణాలను మీడియా సంస్థలకు వివరించాలి..దానికి సంబంధించిన పత్రాలు వుంటే అవి కూడా ఎలక్ట్రానిక్ రూపంలోనూ ఇవ్వాలని కోరుతున్నాం.. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పీఐబి అక్రిడిటేషన్ మంజూరులోని లేని నియమ నిబంధనలు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు అమలు చేశారో కూడా లిఖిత పూర్వకంగా కావాల్సిన్నది. ఉంటే అది కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది..
13)సమాచారశాఖలోని అటెండరు దగ్గర నుంచి డిప్యూటీ డైరెక్టర్ వరకూ డిపార్ట్ మెంట్ అక్రిడిటేషన్లు మంజూరు చేసే ప్రభుత్వం ఏ నిబంధనలను అనుసరించి వారికి అక్రిడిటేషన్లు మంజూరు చేస్తుంది? సమాచారశాఖలోని అక్రిడిటేషన్లు పొందిన ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రభుత్వ సమాచారం సేకరించి మీడియాకి అందిస్తున్నారా? అలా అయితే సమాచార శాఖలో ఎంతమంది ఉద్యోగులు అక్రిడిటేషన్ తీసుకొని ప్రభుత్వ శాఖల సమాచారం, ప్రభుత్వ పథకాల సమాచారం అందిస్తున్నారు వారి వివరాలు, వారి విద్యా అర్హత వివరాలు కావాల్సి వుంది.. ఎందుకంటే ప్రభుత్వం పత్రికల్లో పనిచేసిన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కోసం పెట్టిన విద్యార్హత నిబంధనలు సమాచారశాఖలని అధికారులు, సిబ్బందికి కూడా అమలు చేయాల్సివుంటుంది.. వారికి లెక్కకు మించి అక్రిడిటేషన్లు ఎందకు మంజూరు చేస్తున్నారు..చేస్తే ఎన్ని అక్రిడిటేషన్లు ఏఏ కేడరలో ఉన్నవారికి మంజూరు చేశారు ఆ సమాచారం కూడా లిఖిత పూర్వకంగా కానీ ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది..
14)సమాచారశాఖలో అధికారులు జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో నిబంధనలకు దేశంలో లేని నిబంధనలు పెట్టడంతోపాటు గవర్నర్, ముఖ్య మంత్రి, ఇతర మంత్రులు కార్యక్రమాలకు అక్రిడేటెడ్ జర్నలిస్టులంతా కార్యక్రమాలకు హాజరు కాకపోయినా.. కార్యక్రమాలకు అత్యధిక మంది జర్నలిస్టులు హాజరైనట్టుగా, అక్కడ వారికి టీలు, టిఫెన్లు, భోజనాలు, మంచినీరు బాటిళ్లలో కొనుగోలు చేసినట్టుగా.. ప్రత్యేక వాహనాలకు సంబంధించి చేసిన ఖర్చుల వివరాలు, గత మూడు సంవత్సరాలకు సంబంధించిన పూర్తి ఖర్చుల వివరాలు, ఆడిట్ రిపోర్టులు లిఖిత పూర్వకంగా కానీ ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది..
15)గత ఐదేళ్లుగా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు కాకుండా, సమాచారశాఖ సమావేశం పూర్తయిన తరువాత వాళ్లకి అనుగుణంగా రాసిన జిల్లా అక్రిడిటేషన్ కమిటీ మినిట్స్ వివరాలు కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది..
పైన పేర్కొన్న అంశాలన్నీ అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ వివరాలు అందజేస్తే..ఆ వివరాలతో ప్రత్యేక వార్త కధనాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశ్యంతోనూ, విశాఖజిల్లాలో సమాచారశాఖలోని జరిగిన కొన్ని అక్రమాలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడానికి పైన పేర్కొన్న సమాచారం ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతోనే సమాచార హక్కుచట్టం 2005 ప్రకారం..నిబంధనలు అనుసరించి కోర్టుఫీ స్టాంపు అతికించి మరీ ఇవ్వడంతోపాటు, దానికి సంబంధించిన రిసీవ్ కాపీని కూడా తీసుకుంటున్నామని తెలియజేయడమైనది. గడువులోపల అడిగిన సమాచారం ఇవ్వకపోయినా ఇదే అంశాలను అప్పిలేట్ అధికారికి దరఖాస్తు చేస్తామని కూడా ఈ దరఖాస్తులోనే తెలియజేస్తున్నాము. అంతేకాకుండా సమాచారశాఖ ఇచ్చిన సమాచారంతోనూ, మా దగ్గర వున్న సమాచారం, ప్రభుత్వం జారీ చేసిన జీఓల పూర్తివివరాలతో కోర్టును కూడా ఆశ్రయిస్తామని కూడా మిక్కిలి గౌరవంతో తెలియజేయడమైనది. ప్రభుత్వం దాపరికం లేని వివరాలు మీడియాకి ఇవ్వడానికి, సమాచార హక్కు చట్టాన్ని అమలు చేస్తూ, అవినీతి రహిత సమాజ నిర్మాణానికి నడుంబిగించి ఉన్నందున కోరిన సమాచారం కోరినట్టుగా సకాలంలో ఇవ్వాలని, ప్రభుత్వ గౌరవానికి సమాచారశాఖ ద్వారా ఎక్కడా భంగం వాటిల్లకుండా చేయాలని కూడా మిక్కిలి గౌరవంతో కోరడమైనది.