అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..2
Ens Balu
4
Visakhapatnam
2021-01-17 19:27:16
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఒక పక్క తమ ప్రభుత్వం అన్నిపనులు ముక్కుసూటిగా చేస్తుందని, నిబంధనలు ఎవరు అతిక్రమించినా క్షమించేది లేదని, అలాంటివారెవరైనా ఉపేక్షించేది లేదని.. పదేపదే ప్రతీ సమావేశంలోనూ గొంతు చించుకొని మరీ చెబుతుంటే.. సమాచారశాఖలోని ఉన్నతాధికారులు సీఎం మాటలు సీఎంవే...మా పనులు మావే అన్నట్టు వర్కింగ్ జర్నలిస్టులకు జారీచేసే ప్రెస్ అక్రిడిటేషన్ల విషయంలో పెద్ద పత్రికల విషయంలో నిబంధనలను తుంగలోకి తొక్కి మరీ అక్రిడిటేషన్లు జారీ చేసి తమ ఆదిపత్యాన్ని..అత్యుత్యాహాన్ని ప్రదర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.. ఫలితంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కేసును సుమోటాగా స్వీకరించడం, కోర్టులో కేసులు ఇలా అన్ని విధాలుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టుతున్నా..సమాచారశాఖ అధికారులు మాత్రం తాము ఇచ్చిందే జీఓ..తాము అమలు చేసేవే నిబందనలు అంటున్నారు..ఇక వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వం సమాచారశాఖ వెబ్ సైట్ ద్వారా అక్రిడిటేషన్ల కోసం పెద్ద పత్రికల నుంచి దరఖాస్తులు కోరినపుడు ఈనాడు పత్రిక కొన్ని అక్రిడిటేషన్లకు ఈనాడు పేరుతోనూ, మండల అక్రిడిటేషన్లకు న్యూస్ టుడే పేరుతోనూ, సాక్షి న్యూస్ లైన్ పేరుతోనూ, కొన్ని క్లిప్పింగులు సాక్షిపేరుతోనూ, ఆంధ్రజ్యోతి ఆన్ లైన్ పేరుతోనూ, కొన్నింటినీ ఆంధ్రజ్యోతి పేరుతోనూ, వార్త ప్రభాతవార్త, ఆంధ్రప్రభ ప్రభన్యూస్ పేరుతోనూ, అదేవిధంగా ఇంగ్లీషు పత్రికలు కూడా, క్లిప్పింగ్లులు తమ సొంత న్యూస్ ఏజెన్సీల పేరుతో క్లిప్పింగులు సమర్పించాలి(న్యూస్ ఏజెన్సీ పేరుతో సమర్పిస్తే).. అలా కాకపోతే, పత్రిక పేరుతోనే నేరుగా క్లిప్పింగులు సమర్పించాలి. అలా కాకుండా అటు న్యూస్ ఏజెన్సీ పేరులేకుండా, ఇటు పత్రిక పేరు(క్రెడిట్ లైన్ లేదా డేట్ లైన్) లేకుండా క్లిప్పింగులు సమర్పిస్తే సదరు పత్రికలు సమర్పించిన న్యూస్ క్లిప్పింగులకు ఆధారం ఏమిటి..? ఒక వేళ సదరు పెద్ద పత్రికల సొంత న్యూస్ ఏజెన్సీల పేరుతో క్లిప్పింగులు సమర్పిస్తే సమాచారశాఖ జారీచేసిన జిఓనెంబరు 142 ఆధారంగా న్యూస్ ఏజెన్సీల క్లిప్పింగులు సమర్పించాలంటే కనీసం 5 ఎంపానల్ కలిగిన పత్రిక క్లిప్పింగులను, ఒక్కోఅక్రిడిటేషనకు 200 క్లిప్పింగులు చొప్పున సమర్పించాలి... అవి పెద్ద పత్రికలు ఎక్కడ సమర్పించాయి..? అదే సదరు న్యూస్ ఏజెన్సీ షాప్ప్ అండ్ ఎస్టాబ్లిస్ మెంట్ నిబంధనల ప్రకారం ఫర్మ్ సర్టిఫికేట్, ఇతర ప్రొప్రైటర్ ఆడిట్ రిపోర్టు, లేబర్ లైసెన్సు, ఇతరత్రా అన్ని ద్రువీకరణ పత్రాలుసమర్పించాలి..కనీసం ఆ విధంగానైనా ఒక్క పత్రికైనా సమర్పించిందా..? కొన్ని ప్రధాన పత్రికలు ఇటు న్యూస్ ఏజెన్సీకి కాకుండా అటు పత్రిక పేరుతో కాకుండా క్రెడిట్ లైన్ లేని క్లిప్పింగులు సమర్పిస్తే సమాచారశాఖ వారందరికీ తొలివిడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేసేసింది. దీనితో సదరు పెద్ద పత్రికలకు ఈ రకంగా అంటే న్యూస్ ఏజెన్సీ కాకుండా పత్రిక కాకుండా ఏదైనా తమకి నచ్చినట్టు సమర్పించడానికి ఏదైనా ప్రత్యేక జీఓ ఇస్తేనే ఆ రకంగా పత్రికలు తమకి నచ్చినట్టు క్లిప్పింగులు ఇతర అనుబంధ పత్రాలు సమర్పించాలి.. అలా కాకుండా సదరు పెద్ద పత్రికల కోసం ప్రత్యేకంగా ఎలాంటి జీఓలు ఇవ్వకపోయినా.. సమాచారశాఖ అధికారులు అక్రిడిటేషన్లు మంజూరు చేయడాన్ని అనేవిషయాన్ని సమాచారహక్కు చట్టం ద్వారా దరఖాస్తు దారుడు సుమారు 15 అంశాలను ఈ కోణంలోనే ప్రస్తావిస్తూ, విశాఖజిల్లాలోని మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ కు సమర్పించాడు. గతంలో కూడా ఇదే విధంగా సమాచార హక్కుచట్టం ద్వారా దరఖాస్తు చేసినా విశాఖజిల్లాలోని సమాచారశాఖ అధికారులు సమారాచాన్ని ఇవ్వలేదు సరికదా దరఖాస్తును బుట్టదాఖలు చేసింది. అదేమంటే ఇవిమాకు ప్రభుత్వ నిబంధనలని ఇక్కడి పౌర సమాచార అధికారి నొక్కి వక్కానించారు. పక్కాగా నిబంధనలు పాటించి, ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసిన వారికి అక్రిడిటేషన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, సమాచారశాఖ ఉన్నతాధికారులు ఈ ప్రధాన పత్రికల విషయంలో ఏదైనా ప్రత్యేక జీఓ జారీచేశారా అంటే అదే లేదు. విశేషం ఏంటంటే ఏ సంస్థ అయినా ఐదుగురు ఉద్యోగులు, అంతకంటే అధికంగా సిబ్బంది పనిచేస్తే లేబర్ యాక్టు ప్రకారం లేబర్ లైసెన్సు పొందాల్సి వుంది. కానీ సమాచారశాఖ ప్రస్తుతం మొదటి విడతలో జారీచేసిన ఏ పత్రిక కూడా లేబర్ లైనెస్స్ సమర్పించలేదు. వేజ్ బోర్డు జీతాలు అమలు చేయడం లేదు.. ఉన్న అధికారిక ఉద్యోగులకు సంబంధించిన పే స్లిప్పులు గానీ, పీఎఫ్, ఈఎస్ఐ తదితర సమాచారాన్ని కూడా సమాచారశాఖకు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసినపుడు సమర్పించలేదు. కేవలం జీఎస్టీ ఒక్కటి పెద్ద పత్రికలు కట్టాయన్న నెపంతో మాత్రం వారికి అక్రిడిటేషన్లు తొలివిడతలో మంజూరు చేసేసింది. అంటే ముఖ్యమంత్రి తన మట్టుకు తాను సభలు, సమావేశాల్లో అవినీతికి, నిబంధనల ప్రకారంమే పనిచేస్తామని చెప్పుకుంటూ పోయినా...సమాచారశాఖ అధికారులు మాత్రం తమకి నచ్చినట్టు చేసుకుపోతామని చెప్పకనే చెప్పారు తొలివిడదలో కొన్ని ప్రధాన పత్రికలకు నిబంధనల ప్రకారంగా కాకుండా వారికి నచ్చినట్టుగా అక్రిడిటేషన్లు మంజూరు చేసి. ఓహో అంటే ఇక్కడ తమకు ఒకలా, మిగిలిన వారికి మరోలా చేస్తారని ఇతర పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు అర్ధం చేసుకోవాలన్నమాట. అలా అర్ధం చేసుకున్నా సమాచారశాఖ చేసిన తప్పును ఏవిధంగా కప్పిపుచ్చుకునే విషయంలో ఏ ఉన్నతాధికారి కూడా నేటికీ సమాధానం చెప్పలేదు. అంటే ఇక్కడ ఖచ్చితంగా అర్ధం చేసుకోవాల్సింది ఏమిటింటే తమకు కావాల్సిన పత్రికలు అటు న్యూస్ ఏజెన్సీకి కాకుండా, ఇటు పత్రికలకు కాకుండా తమకు నచ్చినట్టు ఏ విధంగా అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసినా వారికి అక్రిడిటేషన్లు ఇచ్చేస్తారు..కానీ జీఓలో ఇచ్చిన నిబంధనలన్నీ మాత్రం ఇతర మీడియా సంస్థలకు పాటించాలి. అలా పాటించకపోతే అక్రిడిటేషన్లు ఇవ్వమని అధికారులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం మాత్రమే సంబంధిత పత్రాలు ఆన్ లైన్ లో అప్లోడ్ చేసి, సదరు కాపీలన్నీ మళ్లీ డీపీఆర్వో కార్యాలయంలో అందజేస్తేనే అక్రిడిటేషన్ వస్తుందని డిడిలు, డిపీఆర్వోలు తెగేసి చెబుతున్నారు. మరి ఎటూ కాకుండా పెట్టిన పత్రికలకు అక్రిడిటేషన్లు ఎలా ఇచ్చారని అడిగితే దానికి మా కమిషనర్ మాత్రమే సమాధనం చెప్పాలని, దానికి తాము బాధ్యులం కాదని చేతులెత్తేస్తున్నారు. ఇక రేపటి ఈఎన్ఎస్ ప్రత్యేక కధనంలో ఏ ఆధారాలున్నాయని గతంలో యూఎన్ఐ, పీఐటి, ఏఎన్ఐ, డిఎన్ఎస్, తదితర న్యూస్ ఏజెన్సీలకు అక్రిడిటేషన్లు మంజూరు చేశారు? ఎలాంటి ప్రెస్ క్లిప్పింగులు, ఇతర సంబంధిత ద్రువీకరణలు లేకుండానే నేషనల్ న్యూస్ ఏజెన్సీలకు అక్రిడిటేషన్లు ఎలా ఇచ్చారు? వారికి విశాఖలోని సమాచారశాఖ అధికారులు ప్రత్యేక మినహాయింపులు ఏమైనా ఇచ్చారా తదితర వ్యవహారాలన్నీ ప్రస్తావిద్దాం..ఇదేదో కావాలని ప్రభుత్వాన్ని తప్పుపడుతూ రాస్తున్న ప్రత్యేక కధనాలు కావనే విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలు గమనించాలి. కేవలం సమాచారశాఖ జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ల విషయంలో నిబందనలు ఒక్కొక్కరికి ఒక్కోలా అమలు చేస్తున్న విషయాన్ని మాత్రమే ఇటు ప్రభుత్వానికి, ఇటు జర్నలిస్టులకు ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, ఈఎన్ఎస్ లైవ్.నెట్ న్యూస్ వెబ్ సైట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అదీకాకుండా సమాచార హక్కుచట్టం 2005 ఆధారంగా ధాఖలైన దరఖాస్తులోని అంశాలను ప్రస్తావిస్తూ, అక్రిడిటేషన్లు మంజూరు చేసిన విషయాన్ని, ప్రభుత్వానికి సమాచారశాఖ అధికారులు తెస్తున్న చెడ్డపేరుని ప్రజలకు, పాఠకులకు తెలియజేయడానికి, దేశ రాజధాని న్యూఢిల్లీ పీఐబీలోనే లేని నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని అమలు చేయడాన్ని బహిర్గతం చేయాలని...ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మాటలను, సూచనలను అంటే అవినీతిలేని, నిబంధనలు తప్పక అన్ని వర్గాలకు ఒకేలా పాటించాలనే సూచనను పాటిస్తూనే ఈ విధమైన వార్త కధనాలను అందిస్తున్నామనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి..రేపటి ప్రత్యేక కధనం అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..3తో మళ్లీ కలుద్దాం..!