అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..3


Ens Balu
2
Visakhapatnam
2021-01-18 12:43:50

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ శాఖలోనైనా నిబంధనలకు విరుద్ధంగా ఏస్థాయి అధికారి వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటాం..వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజలతోపాటు, ప్రభుత్వ శాఖలు కూడా ముఖ్యం..ప్రభుత్వ శాఖల సేవలు దేశానికే ఆదర్శంగా నిలవాలి..ఇవీ తరచుగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి చెబుతున్న మాటలు.. కానీ ముఖ్యమంత్రి మాటలుగానీ, ఉన్నత ఆశయాలుగానీ సమాచారశాఖలోని ఉన్నతాధికారులకు పట్టడం లేదు.. కాదు కాదు పట్టించుకోవడం లేదు.. సీఎం గొంతుచించుకొని పదే పదే ఆ మాటలు ప్రతీ సభలోనూ, సమావేశంలోనూ చెబుతున్నా సమాచారశాఖ అధికారుల తీరులోగానీ, వ్యహారంలోని ఎలాంటి మార్పులేదనే విషయం ఇపుడు జీఓనెంబరు 142 ద్వారా వర్కింగ్ జర్నలిస్టులకు జారీచేసే అక్రిడిటేషన్ల విషయంలో(న్యూస్ ఏజెన్సీలకు ఇచ్చే అక్రిడిటేషన్లు) రుజువైంది. మీడియా నియంత్రణే లక్ష్యంగా దేశరాజ ధాని పీఐబీలోని అక్రిడిటేషన్ల మంజూరులోకూడా లేని నిబంధనలన్నీ ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసి, వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని పదే పదే కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తున్నారు సమాచారశాఖలోని ఉన్నతాధికారులు.. చేసిన తప్పులకు కోర్టుల్లో కౌంటర్లు వేసుకుంటూ ప్రతిపక్షాలతో నానా మాటలు, కామెంట్లు పడేలా చేస్తున్నారు. ఇక సమాచారశాఖ న్యూస్ ఏజెన్సీలకిచ్చే అక్రిడిటేషన్ల విషయానికి వచ్చేద్దాం.. భారతదేశంలో ఏ ప్రభుత్వమైనా పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు, టీవీ ఛానళ్లు ఎరికైనా కేంద్ర, రాష్ట్ర సమాచారశాఖ అధికారులు నిబంధనలు పాటించే అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి. కానీ నిబంధనలను పక్కనపెట్టి నేషనల్ న్యూస్ ఏజెన్సీలకు కేవలం ఒక్క లెటర్ ఇచ్చారనే కారణంతో యూఎన్ఐ, ఏఎన్ఐ, పీటిఐ, డిఎన్ఎస్ వంటి న్యూస్ ఏజెన్సీలకు అక్రిడిటేషన్లు ఇచ్చేశారు సమాచారశాఖ అధికారులు. అదే విశాఖజిల్లాలోని న్యూస్ ఏజెన్సీలకు మాత్రం మీడియా అక్రిడిటేషన్ కమిటీలో అప్రూవల్ చేసినా నిబంధనల పేరుతో దరఖాస్తులను బుట్ట దాఖలు చేశారు. సమాచారశాఖ నిబంధనల ప్రకారం జిల్లా న్యూస్ ఏజెన్సీలకు మూడేళ్లు కాలపరిమితి నిండాలి, అదే రాష్ట్రస్థాయి న్యూస్ ఏజెన్సీలకు ఐదేళ్లు, జాతీయ న్యూస్ ఏజెన్సీలకు పదేళ్లు కాలపరితి నిండితే అందులో పనిచేసే జర్నలిస్టులు అక్రిడిటేషన్లు పొందేందుకు అర్హులు అదీ ప్రభుత్వం న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ ప్రకారం అనుబంధ ప్రభుత్వ అనుమతి పత్రాలు, ప్రొప్రైటర్ ఐటి రిటర్న్స్, లేబర్ లైసెన్స్, షాప్ష్ అండ్ ఎస్టాబ్లిస్ మెంట్ లైసెన్స్, సదరు న్యూస్ ఏజెన్సీ నుంచి చందాదారులుగా జాబితా, పత్రికు, టీవీ ఛానళ్లు, న్యూస్ వెబ్ సైట్లు యొక్క క్లిప్పింగులు సమాచారశాఖకు అందించిన తరువాత వాటిని అక్రిడిటేషన్ కమిటీ ముందుంచాలి. కానీ అలా కాకుండా విశాఖలోని సమాచారశాఖ అధికారులు నేరుగా ఒక జర్నలిస్టు సంఘం సిఫారసు చేసిన లెటర్ హెడ్ తో సదరు న్యూస్ ఏజెన్సీలన్నింటికీ అక్రిడిటేషన్లు ఇచ్చేశారు. ఇదేమంటే అక్రిడిటేషన్ కమిటీ సిఫారసు చేసిందని అటు కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ ను కూడా తప్పుదారి పట్టించారు. అధికారులను అయితే నమ్మించారు గానీ, సమాచారహక్కు చట్టం క్రింద దాఖలైన దరఖాస్తుకు మాత్రం విశాఖలోని సమాచారశాఖ అధికారులు సమాధానం చెప్పలేదు. దీనితో గత మూడేళ్ల నుంచి న్యూస్ ఏజెన్సీలకు ఏ ప్రాతిపదికన అక్రిడిటేషన్లు మంజూరు చేశారు, సదరు న్యూస్ ఏజెన్సీలు సమాచారశాఖకు దాఖలు చేసిన అనుబంధ పత్రాలు అన్నీ ఎలక్ట్రానిక్ రూపంలో కావాలని ఆర్టీఐ  దరఖాస్తు దారు విశాఖ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కు దరఖాస్తు దాఖలు చేశాడు. దీనితో దరఖాస్తుతో సమాచారశాఖ అధికారులు రుజువులు చూపించడానికి మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ దరఖాస్తుకి సమాచార శాఖ అధికారులు గానీ, అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ గానీ రుజువులు చూపించకపోతే అధికారులు చేసిన తప్పులకు, నిబంధనలు పక్కన పెట్టి మంజూరు చేసిన అక్రిడిటేషన్లకు సమాధానం చెప్పాల్సి వుంటుంది. అంతేకాదు ప్రస్తుతం కొత్త అక్రిడిటేషన్లు కూడా పెద్ద పత్రికలకు న్యూస్ ఏజెన్సీ క్లిప్పింగులతో పెద్ద పత్రికలు అక్రిడిటేషన్ కి దరఖాస్తు చేస్తే పత్రికల పేరుతో సమాచారశాఖ అక్రిడిటేషన్లు మంజూరు చేసింది. అంటే ఇక్కడ సమాచారశాఖ అధికారులు కావాలనే నిబంధనలు పక్కన పెట్టినట్టుగా ఒప్పుకున్నట్టు అయ్యింది. విచిత్రం ఏంటంటే పెద్ద పత్రికల క్లిప్పింగులన్నీ న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లో సమర్పించి, ఇతర అనుబంధ పత్రాలన్నీ ఆర్ఎన్ఐ, పత్రికలకు సంబంధించిన ఫార్మాట్ లో పత్రికలు సమర్పించినా వాటికి సమాచారశాఖ అక్రిడిటేషన్లు మంజూరు చేసింది. అంటే ఇక్కడ జీఓనెంబరు 142 నిబంధనలన్నీ పక్కన పెట్టినట్టుగానే అధికారులే ఇచ్చిన అక్రిడిషన్ల సాక్షిగా దొరికిపోయినట్టు అయ్యింది. అలా న్యూస్ ఏజెన్సీల క్లిప్పింగులు సమర్పించినపుడు సమాచారశాఖ సదరు న్యూస్ ఏజెన్సీ పేరుతోనే అక్రిడిటేషన్లు కూడా మంజూరు చేయాలి...అదీ న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లో అక్రిడిటేషన్ కు దరఖాస్తు చేస్తే. కానీ ఇక్కడ పెద్ద పత్రికలన్నీ అటు న్యూస్ ఏజెన్సీ కాకుండా, ఇటు న్యూస్ పేపర్ ఫార్మాట్ లో కాకుండా దరాఖాస్తు చేసినా సమాచారశాఖ మాత్రం పత్రికల పేరుతోనే అక్రిడిటేషన్లు మంజూరు చేసింది. పైగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇపుడు న్యూస్ ఏజెన్సీలు కూడా అన్ని రకాల పత్రాలు ఆన్ లైన్ లో సమర్పిస్తే తప్పా అక్రిడిటేషన్లు మంజూరు చేసేది లేదని, ఇవి కమిషనర్ కార్యాలయం నుంచి తమకు వచ్చిన ఉత్తర్వులనీ విశాఖలోని సమాచారశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగని న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లో విశాఖ జిల్లాలోని న్యూస్ ఏజెన్సీలు ఆన్ లైన్ లో అన్ని రకాల పత్రాలు సమర్పించి, వివిధ పత్రికల క్లిప్పింగులు నేరుగా పత్రికలు తీసుకెళ్లి సమాచారశాఖ కార్యాలయంలో అందిస్తే... అలా అందించినా ఆన్ లైన్ లో పత్రికల క్లిప్పింగులు సమర్పించాల్సిందేనని మెలిక పెట్టి జిల్లా స్థాయి న్యూస్ ఏజెన్సీల అక్రిడిటేషన్ దరఖాస్తులను పెండింగ్ లో పెట్టాయి. వాస్తవానికి న్యూస్ ఏజెన్సీలకు సంబంధించిన వందల సంఖ్యలో వున్న క్రెడిట్ లైన్ క్లిప్పింగులు అన్ లైన్ లో సమర్పించడానికి వీలుపడదు. కానీ ఏదోవిధంగా న్యూస్ ఏజెన్సీలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న సమాచారశాఖ అధికారులు దరఖాస్తుతోపాటు, వివిధ పత్రికలకు చెందిన ప్రెస్ క్లిప్పింగ్ పత్రికలను భారీ సంఖ్యలో తీసుకొని, ఇపుడు ప్రెస్ క్లిప్పింగులు కూడా ఆన్ లైన్ లో సమర్పించాలని చెబుతోంది. ఒకేసారి పత్రికలన్నీ నేరుగా సమాచారశాఖ కార్యాలయంలో అందిస్తే ఇపుడెలా సమర్పిస్తామని ప్రశ్నిస్తే దానికి తాము ఏమీ చేయలేమని, ఖచ్చితంగా ఆన్ లైన్ అన్ని రకాల అనుబంధ పత్రాలతోపాటు, క్లిప్పింగులు కూడా సమర్పిస్తే తాము ఏమీ చేయలేమని చెబుతున్నారు.  అలా అయితే న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లో పత్రికలు సమర్పించిన దరఖాస్తులకు ఎలా అక్రిడిటేషన్లు మొదటి విడతలో ఎలా మంజూరు చేశారని సమాచారహక్కు చట్టం ద్వారా విశాఖ జిల్లా మీడియా కమిటీకి దాఖలు చేసిన 15 అంశాలపై అటు కమిటీ చైర్మన్ గానీ, ఇటు సమాచారశాఖ గానీ సమాచారం ఇవ్వడానికి తడబడుతున్నాయి.  అదేసమయంలో అక్రిడిటేషన్ కమిటీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యను ప్రెస్ కౌన్సిల్ కూడా సుమోటాగా స్వీకరించడం ప్రభుత్వ పనితీరును ప్రశ్నించినట్టు అయ్యింది. మరోపక్క అక్రిడిటేషన్ కమిటీ విషయమై, నిబందనలు, జీఎస్టీ తదితర అంశాలపై సమాచారశాఖ కోర్టుల్లో కౌంటర్ దాఖలు చేయనుంది. కావాలని సమాచారశాఖ అధికారులు తమ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జర్నలిస్టుల విషయంలో కోర్టు మెట్లు ఎక్కించేలా చేసినా ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం కూడా చర్చనీయాంశం అవుతోంది.  ఇదేదో కావాలని ప్రభుత్వాన్ని తప్పుపడుతూ రాస్తున్న ప్రత్యేక కధనాలు కావనే విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలు గమనించాలి. కేవలం సమాచారశాఖ జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ల విషయంలో నిబందనలు ఒక్కొక్కరికి ఒక్కోలా అమలు చేస్తున్న విషయాన్ని మాత్రమే ఇటు ప్రభుత్వానికి, ఇటు జర్నలిస్టులకు ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, ఈఎన్ఎస్ లైవ్.నెట్ న్యూస్ వెబ్ సైట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అదీకాకుండా సమాచార హక్కుచట్టం 2005 ఆధారంగా ధాఖలైన దరఖాస్తులోని అంశాలను ప్రస్తావిస్తూ, అక్రిడిటేషన్లు మంజూరు చేసిన విషయాన్ని, ప్రభుత్వానికి సమాచారశాఖ అధికారులు తెస్తున్న చెడ్డపేరుని ప్రజలకు, పాఠకులకు తెలియజేయడానికి, దేశ రాజధాని న్యూఢిల్లీ  పీఐబీలోనే లేని నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని అమలు చేయడాన్ని బహిర్గతం చేయాలని...ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మాటలను, సూచనలను అంటే అవినీతిలేని, నిబంధనలు తప్పక అన్ని వర్గాలకు ఒకేలా పాటించాలనే సూచనను పాటిస్తూనే ఈ విధమైన వార్త కధనాలను అందిస్తున్నామనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి..రేపటి ప్రత్యేక కధనం అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..4 లో ప్రభుత్వ మీడియా సలహా దారులు జర్నలిస్టు సంఘాలకు ఇచ్చిన హామీలేంటి, సమాచారశాఖ అధికారులు వాటిని పట్టించుకోకుండా ఎలా వ్యవహరిస్తున్నారు...కావాలనే మొండిగా వెళుతూ, కోర్టులో కౌంటర్లు ఎందుకు దాఖలు చేస్తున్నారు..తదితర అంశాలతో మళ్లీ కలుద్దాం..!