ఇకపై గ్రామాలు రాత్రులు వెలగనున్నాయి..


Ens Balu
3
Amaravati
2021-01-18 15:58:00

ఆంధ్రప్రదేశ్ లో గ్రామాలు ఇకనుంచి రాత్రులు వెలగనున్నాయి. మీరు చదువుతున్నది నిజమే గ్రామాలు వెలగడం ఏంటి అనుకుంటున్నారా? అవునండీ గ్రామాల్లోన్ని వీధి దీపాల నిర్వహణ ఇకపై గ్రామసచివాలయాలు చూడనున్నాయి. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకూ పారిశుధ్య నిర్వహణతో పలు కార్యక్రమాలు, సేవలు, విధులను ప్రభుత్వం గ్రామసచివాలయాలకు అప్పగించింది. ఇపుడు ఆ సేవల్లో వీధి దీపాల నిర్వహణ కూడా చేరింది. ఇకపై గ్రామాంలో ఎక్కడ వీధిపాలు వెలగకపోయినా, పాడైనా తక్షణమే గ్రామసచివాలయాల ద్వారా వాటిని నిర్వహణ చేపట్టనున్నారు. దీనికోసం ఉన్నతాధికారులు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తున్నారు. గ్రామసచివాలయాల్లో సుమారు 14 ప్రభుత్వ శాఖల ద్వారా సేవలు అందిస్తున్న ప్రభుత్వం ఇపుడు వీధి దీపాల నిర్వహణ కూడా చేపట్టడంతో ప్రజలకు మరింతగా రాత్రి సమయంలో వీధుల్లో వెలుగులు నిండనున్నాయి. అదే సమయంలో వీటి నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తారా, లేదంటే కాంట్రాక్టు పద్దతిపై సిబ్బందిని తీసుకుంటారా అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఉన్నతాధికారులు ఇవ్వలేదు. కాకపోతే గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాల నిర్వహణ మాత్రం చేపట్టనున్నాయని మంత్రి ప్రకటించడం శుభపరిణామంగా కనిపిస్తోంది. దీంతో వీధి దీపాలు లేని గ్రామాలు, వీధులకు కూడా వీధి దీపాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది.