ఎమ్మెల్యేల హక్కులను కాపాడాల్సిందే..


Ens Balu
2
Tirupati
2021-01-18 16:16:49

రాష్ట్రంలోని శాసన సభ్యుల హక్కులను కాపాడవలసిన భాద్యత ప్రివిలేజస్ కమిటీ  మీద ఉందని ఆంధ్రప్రదేశ్ శాసన సభ  ప్రివిలేజస్ కమిటీఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం తిరుపతి పద్మావతీ అతిధి గృహంలో ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రివిలేజస్ కమిటీ సభ్యులు  మల్లాది విష్ణు, ఎస్.వెంకట చిన్న అప్పల నాయుడు, వి.వరప్రసాద్ రావు, శిల్పా చక్రపాణి రెడ్డి మరియు ఎ పి ఐ ఐ సి చైర్ పర్సన్ రోజా లతో కలసి  ఛైర్మన్ జిల్లాలో ప్రోటోకాల్ అమలు తీరు పై జిల్లా కలెక్టర్ డా.నారాయణ్ భరత్ గుప్తా, జిల్లా ఉన్నతాదికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ శాసన సభ్యులకు రాష్ట్ర  ప్రభుత్వ  ప్రోటోకాల్ నియమావళిని  అనుసరించాలని, శాసన సభ్యులు సమస్యల పరిష్కారం కొరకు ఇచ్చే లేఖలకు తీసుకున్న చర్యలకు సంబందించి తగు సమాచారం వెంటనే అందివ్వాలని , అధికారులు  సంక్షేమ కార్యక్రమాలకు సంబందించిన పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు  అందివ్వాలని తెలిపారు. చిత్తూరు జిల్లాకు సంబందించి ఇప్పటి వరకు ప్రివిలేజస్ కమిటీకి ఎటువంటి ఫిర్యాధులు అందలేదని ఈ పద్ధతిని ఇలాగే కొనసాగించాలని తెలిపారు.  అనంతరం ప్రివిలేజస్ కమిటీ ఛైర్మన్  కాకాణి గోవర్ధన్ రెడ్డి , సభ్యులు  మల్లాది విష్ణు, ఎస్.వెంకట చిన్న అప్పల నాయుడు, వి.వరప్రసాద్ రావు, శిల్పా చక్రపాణి రెడ్డి లతో కలసి  విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, శాసనసభ ప్రివిలేజస్  కమిటీ 175 మంది శాసనసభ్యుల హక్కులను కాపాడటం, కీలకమైన శాసనసభ్యుల హక్కులకు భంగం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న  చర్యలపై  ప్రివిలేజస్ కమిటీ దృష్టి పెడుతుందన్నారు. సాధారణంగా ప్రోటోకాల్ లో  శాసన సభ్యుల  హక్కులకు భంగం వాటిల్లినప్పుడు  ప్రివిలేజస్ కమిటీకి ఫిర్యాదులు  అందుతాయని వాటిని కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవడం  జరుగుతుందని తెలిపారు. స్పీకర్ రిఫర్ చేసిన ఫిర్యాదులకు  సంబందించి తొలి సమావేశం అమరావతిలో నిర్వహించామని తెలిపారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించడం జరుగుతుందని, తొలి సమావేశం తరువాత రెండవ సమావేశం తిరుపతిలో నిర్వహించడం జరుగుచున్నదని తెలిపారు.   చిత్తూరు జిల్లాకు సంబందించి ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని, ఈనెల 19న టీటీడీ అధికారులతో ప్రివిలేజస్ కమిటీ సమావేశం అవుతుందని  తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 175  మంది శాసనసభ్యులకు ఒక్కొక్కరికీ కోటి రూపాయల చొప్పున సిఏండిఎఫ్ కింద నిధులు విడుదల చేయడం జరిగిందని ముఖ్యమంత్రి శాసనసభ్యులకు గౌరవించడంలో భాగంగా నిధులు విడుదలచేయడం జరిగిందని దీనిని అధికార యంత్రాంగం దృష్టిలో పెట్టుకుని శాసనసభ్యులు ప్రతిపాదించిన అంశాలను పరిగనలోకి తీసుకుని వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి, జిల్లా సంయుక్త కలెక్టర్ (సంక్షేమం) రాజశేఖర్, డిఆర్ ఓ మురళి ,  తిరుపతి , చిత్తూరు ఆర్డీఓ లు కనకనరసారెడ్డి, రేణుక,  తిరుపతి కార్పొరేషన్ ఇంచార్జి  కమీషనర్  హరిత, డ్వామా , డీఆర్డీఎ పిడి లు  చంద్రశేఖర్, తులసి వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.