అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..4
Ens Balu
2
Visakhapatnam
2021-01-19 12:35:00
ఆంధ్రప్రదేశ్ లోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇచ్చే విషయంలో దేశ రాజధాని పీఐబీలో కూడా లేని నిబంధనలు పెట్టిన సమాచాశాఖ.. ఈ శాఖలోని అటెంటడర్లుకు, వాచ్ మెన్ లకు కూడా ప్రభుత్వ అక్రిడిటేషన్లు ఎలా ఇచ్చిందో అధికారులే సమాధానం చెప్పాల్సి వుంది. సమాచారశాఖలో ప్రభుత్వ కార్యక్రమాల కవరేజికి వెళ్లే డిడి, ఏడి, డిపిఆర్వో, ఏపీఆర్వో, ఫోటోగ్రాఫర్, సినిమా ఆపరేటర్, మైక్ సెట్ ఆపరేటర్లకు సమాచారశాఖ విధినిర్వహణలో భాగంగా అక్రిడిటేషన్లు మంజూరు చేస్తుంది. కానీ విశాఖజిల్లాలోని సమాచారశాఖలో మాత్రంలో అటెండర్లుకు, వాచ్ మెన్లకు కూడా సమాచారశాఖ అక్రిడిటేషన్లు మంజూరు చేసేసింది. దానికి కారణం కూడా లేకపోలేదు. జర్నలిస్టులతో సహా సమాచారశాఖలోని అక్రిడిటేడెస్ సిబ్బందికి కూడా ఆర్టీసీ బస్సు పాసులు మంజూరు చేయడంతో ఇబ్బడి ముబ్బడిగా కార్యాలయంలోని ఉన్న సిబ్బందికి మొత్తం అక్రిడిటేషన్లు ఇచ్చేసింది. ఈ విషయాన్ని బహిర్గతం చేయాలని కోరుతూ విశాఖజిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ కు సమాచారహక్కుచట్టం 2005 ప్రకారం సమాచారశాఖలోని అడ్డగోలు అక్రిడిటేషన్ల వ్యహారం ఆధారాలతో సహా బయటకు తీసే ఉద్దేశ్యంతో దరఖాస్తు దాఖలైంది. అంతేకాదు సమాచారశాఖలోని కొందరు సిబ్బంది, అక్రిడిటేషన్ కమిటీలోని సభ్యుల అండ దండలతో నచ్చిన వారికి నచ్చినట్టుగా పరిమితికి మించి అక్రిడిటేషన్లు మంజూరు చేశారు. అందులోకొన్ని పెద్ద పత్రికలు కూడా ఉన్నాయి. సమాచారశాఖ జర్నలిస్టులకి అమలు చేసే నిబంధనలు ఎందుకు ప్రభుత్వశాఖ అయిన సమాచారశాఖలోని అధికారులు, సిబ్బంది, కార్యాలయ ఉద్యోగుల విషయంలో పాటించలేదో అధికారులే సమాధానం చెప్పాల్సి వుంది. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి తదితర అతిముఖ్యమైన వారు వచ్చినపుడు సమాచారశాఖ లోని సిబ్బంది అవసరం అవుతారని, అందుకే వారికి అక్రిడిటేషన్లు ఇచ్చారని ఇక్కడి అధికారులు సమర్ధించుకున్నా ప్రభుత్వ నిబంధనల మేరకు పనిచేసే అటెండర్లకు పదో తరగతి అర్హతున్న ఉద్యోగులకు అక్రిడిటేషన్లు ప్రభుత్వం ఇవ్వకూడదు. కానీ సమాచారశాఖ వరకూ వస్తే ఒక నిబంధన, జర్నలిస్టులకు మాత్రం మరోలా కఠినతరమైన నిబంధనలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నిస్తే...మేమిచ్చిందే జీఓ దానిని ఎవరైనా పాటించాల్సిందేనని అధికారులు బల్లగుద్ది చెబుతున్నారు. పైగా తమ కమిషనర్ ఇచ్చిన జీఓ ప్రకారం అన్ని అనుబంధ పత్రాలు లేకపోతే అక్రిడిటేషన్ వచ్చే పరిస్థితి లేదని తెగేసి చెప్పేస్తున్నారు కూడా. ఇలాంటి సమయంలో విశాఖజిల్లాలో అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కు దాఖలైన సమాచారహక్కుచట్టం దరాఖాస్తులోని పలు అంశాలను ఇపుడు అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ను ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయి. ఇప్పటికే అటు న్యూస్ ఏజెన్సీ, ఇటు దిన పత్రికా కాని పెద్ద మీడియా సంస్థలకు ఇబ్బడి ముబ్బడిగా మొదటి విడతలో అక్రిడిటేషన్లు ఇచ్చేసిన సమాచారశాఖ తమను తాము సమర్ధించుకునే పనిలో పడింది. గత మూడేళ్లుగా సమాచారశాఖలోని కొందరు అధికారులు అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ను సైతం తప్పుదోవ పట్టిస్తూ వస్తూ, తమ అనుకూల మీడియాకి కూడా అక్రిడిటేషన్లు ఇచ్చేస్తూ వచ్చాయి. అయితే ఇపుడు వాటిని సమాచారహక్కు చట్టం ద్వారా కోరిన సందర్భంలో సమాచారశాఖ అధికారులు అపుడే జర్నలిస్టు సంఘాల నేతలను రంగంలోకి దించాయి. సమాచార హక్కుచట్టం క్రింద కోరిన సమాచారం మొత్తం అందినట్టుగా దరఖాస్తు దారుడితో చెప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఎన్నిచేసినా ప్రస్తుతం దాఖలైన సమాచారహక్కుచట్టం క్రింద దాఖలైన దరఖాస్తులోని విషయాలతో దరఖాస్తు దారు, సమాచారశాఖ ఇచ్చిన సమాచారంతో కోర్టుకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే జీఓ నెంబరు 142 ద్వారా అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాలను లేకుండా కేవలం అధికారులతోనే కమిటీ వేయడానికి కోర్టు ద్వారా స్టేటస్ కో ఇచ్చిన నేపథ్యంతో సమాచారహక్కుచట్టం దరఖాస్తుతో అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ఇచ్చిన సమాచారంతో పరిస్థితి, అధికారులు అడ్డగోలుగా ఇచ్చిన అక్రిడిటేషన్ల వ్యవహారం ఆధారాలతో సహా బహిర్గతం కానుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని సమాచారశాఖలోని రాష్ట్ర కమిషనర్ తో పాటు, అన్ని జిల్లా సమాచారశాఖ అధికారులకు జరుగుతున్న తంతు వార్తల రూపంలో ముందుగానే తెలుస్తుంది. ఈరోజు మీడియా సలహాదారుల విషయాన్ని తెలియజేయాల్సి వుండగా, దానికంటే ముందు సమాచారశాఖలోని అందరు సిబ్బందికి డిపార్టమెంటల్ అక్రిడిటేషన్లు మంజూరు చేసిన విషయాన్ని ముందుగా తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ కధనాన్ని ముందు ఇచ్చేస్తున్నాం. ఇదేదో కావాలని ప్రభుత్వాన్ని తప్పుపడుతూ రాస్తున్న ప్రత్యేక కధనాలు కావనే విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలు గమనించాలి. కేవలం సమాచారశాఖ జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ల విషయంలో నిబందనలు ఒక్కొక్కరికి ఒక్కోలా అమలు చేస్తున్న విషయాన్ని మాత్రమే ఇటు ప్రభుత్వానికి, ఇటు జర్నలిస్టులకు ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, ఈఎన్ఎస్ లైవ్.నెట్ న్యూస్ వెబ్ సైట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అదీకాకుండా సమాచార హక్కుచట్టం 2005 ఆధారంగా ధాఖలైన దరఖాస్తులోని అంశాలను ప్రస్తావిస్తూ, అక్రిడిటేషన్లు మంజూరు చేసిన విషయాన్ని, ప్రభుత్వానికి సమాచారశాఖ అధికారులు తెస్తున్న చెడ్డపేరుని ప్రజలకు, పాఠకులకు తెలియజేయడానికి, దేశ రాజధాని న్యూఢిల్లీ పీఐబీలోనే లేని నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని అమలు చేయడాన్ని బహిర్గతం చేయాలని...ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మాటలను, సూచనలను, ప్రతీసారి నిబంధనలు పాటించని ఏ ప్రభుత్వ శాఖ అయినా, అధికారులైనా ప్రభుత్వానికి ఒక్కటే..తప్పు జరిగితే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటాం.. మీడియా వాస్తవాలను రాయాలని పదే పదే ప్రజలను చైతన్యం చేయడానికి సీఎం చెబుతున్న తరుణంలో ఈ విషయాలను దారావాహికంగా బయటకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే అవినీతిలేని, నిబంధనలు తప్పకుండా అన్ని వర్గాలకు ఒకేలా పాటించాలనే సూచనను పాటిస్తూనే ఈ విధమైన వార్త కధనాలను అందిస్తున్నామనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి..రేపటి ప్రత్యేక కధనం అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..5 లో ప్రభుత్వ మీడియా సలహా దారులు జర్నలిస్టు సంఘాలకు ఇచ్చిన హామీలేంటి, సమాచారశాఖ అధికారులు వాటిని పట్టించుకోకుండా ఎలా వ్యవహరిస్తున్నారు...కావాలనే మొండిగా వెళుతూ, కోర్టులో కౌంటర్లు ఎందుకు దాఖలు చేస్తున్నారు..తదితర అంశాలతో మళ్లీ కలుద్దాం..!