అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..6
Ens Balu
1
Visakhapatnam
2021-01-21 12:46:39
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సమాచారశాఖ వర్కింగ్ జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ల మంజూరుకి దేశంలోనే లేని నిబంధనలు పెట్టిన అధికారులు ఇదే శాఖలోని అధికారులు అక్రిడేటెడ్ జర్నలిస్టుల పేరుతో పెట్టే అడ్డగోలు బిల్లులు, అవినీతిపై ద్రుష్టి సారించడం లేదు. ఏంటి ఇదేదో కొత్త విషయం అనుకుంటున్నారా కానే కాదండీ..పాత విషయమే కాకపోతే నిబంధన ఎవరికైనా నిబంధనే కదా..అదే నిబంధన ప్రకారం ఎంత మంది వర్కింగ్ జర్నలిస్టులు ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్రపతి కార్యక్రమాలకు న్యూస్ కవరేజికి వచ్చిపుడు రాని జర్నలిస్టుల పేరుతో కూడా మంచినీరు, టీలు, కాఫీలు, టిఫిన్లు, భోజనాలు, వాహనాలకయ్యే డీజిల్ ఖర్చులు పెట్టినట్టు చూపించే అవినీతి బిల్లులపై ప్రభుత్వం ఎందుకు ద్రుష్టిసారించడంలేదనే విషయాన్ని సమాచారశాఖ శాఖలోని రాష్ట్ర అధికారులకే తెలియజేయడం కోసం, సమాచారశాఖ జరుగుతున్న అడ్డగోలు వ్యవహారంపై జిల్లా అక్రిడిటేషన్ కమిటీకి దాఖలైన సమాచారహక్కుచట్టం 2005 దరఖాస్తు ఆధారంగా మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ప్రభుత్వ శాఖలోనూ అవినీతి చోటు చేసుకుకుండా రివర్స్ టెండరింగ్ ద్వారా ఖర్చులను తగ్గిస్తూ వస్తుంది. అన్నిశాఖల్లో ఈ విధానం జరుగుతున్నా ఒక్క సమాచారశాఖ విషయంలో పెట్టిన బిల్లులకు మాత్రం ఎలాంటి కొర్రీలు వేయకుండా బిల్లులు మంజూరు చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇపుడు ఆంధ్రప్రదేశ్ లోని ఇదే హాట్ టాపిక్. రాష్ట్రంలో లక్షల మంది నిరుపేద ప్రజలకు అడక్కుండా అన్ని సంక్షేమ పథకాలు లక్షలు, కోట్ల రూపాయ వ్యవయంతో వర్తింపజేస్తున్న ప్రభుత్వం ఒక్క సమాచారశాఖ ద్వారా వర్కింగ్ జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్ల విషయంలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ విధించని నిబంధనలు అమలు చేస్తున్న తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనితో ఈ శాఖలో అక్రిడేటెడ్ జర్నలిస్టులను సంఖ్యను అడ్డం పెట్టుకొని వారికి కల్పించని వసతులను కల్పించినట్టుగా..తీసుకెళ్లని స్టడీ టూర్లకు తీసుకెళ్లినట్టుగా, పీఎం, సీఎం, మంత్రులు కార్యక్రమాలకు జర్నలిస్టులు వెళ్లకపోయినా వెళ్లినట్టుగా, అక్కడ ఎలాంటి టీలు, టిఫిన్లు, మంచినీరు, స్నాక్స్, భోజనాలు పెట్టకపోయినా పెట్టినట్టుగా రాష్ట్ర సమాచారశాఖ అధికారులకు చూపించే బిల్లులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో విశాఖలో సమాచారహక్కుచట్టం ద్వారా దాఖలైన దరఖాస్తుకి సమాచారాన్ని ఏవిధంగా ఇవ్వాలనే విషయమై సమాచారశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో ఇదే సమాచారశాఖలో దాఖలైన సహచట్టం దరఖాస్తు బుట్టదాఖలు కావడంతో ఈ సారి దరఖాస్తు దారుడు నేరుగా జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ కు 15 అంశాలతో కూడిన దరఖాస్తు చేశాడు. దీనితో ప్రోటోకాల్ ప్రకారం సమాచారశాఖ అధికారులు సమాచారం ఇవ్వాల్సివుంది. గతంలో మాదిరిగా ఈ దరఖాస్తును కూడా బుట్టదాఖలు చేస్తే సమాచారశాఖ అధికారులు చేసే తప్పులకు, అవినీతికి ఈ సారి జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ల విషయంలో ఇంత ముక్కుసూటిగా, దేశంలో ఎక్కడా లేని నిబంధనలను పెట్టిన రాష్ట్ర సమాచారశాఖ అధికారులు, అవే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూడా జర్నలిస్టులకు ఖర్చు చేసినట్టుగా డిడిలు, డీపీఆర్వోలు, పెట్టిన బిల్లుల విషయంలో ప్రభుత్వం అదేవిధంగా వ్యవహరించాల్సి వుంది. కానీ ఆ విధంగా చేయకుండా ప్రభుత్వానికి, ప్రభుత్వంలోని పెద్దలకు మచ్చతెచ్చేవిధంగా సమాచారశాఖ అనుసరించడం దేనికి సంకేతమో అధికారులే సమాధానం చెప్పాల్సివుంటుంది. అదే సమయంలో కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి చేయని కళాజాత కార్యక్రమాలకు కూడా కార్యక్రమాలు చేసినట్టుగా నకిలీ బిల్లలు పెట్టినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. పెద్దపత్రికలకు మాత్రమే నెలవారీ బిల్లులు చెల్లించే సమాచారశాఖ చిన్నపత్రికలకు వేసిన పత్రికలకు ఎందుకు బిల్లులు చెల్లించడం లేదు...ఒక వేళ చెల్లించినట్టుగా బిల్లులు చూపుతుందా అనే కోణంలో కూడా నేటికి ఏ ఒక్క రాష్ట్ర స్థాయి అధికారి కూడా తనిఖీలు చేసిన పాపాన పోలేదు. ఇలాంటి వ్యవహారాలన్నీ బటకు రాకుండా ఒక జర్నలిస్టు యూనియన్ నేత ఈ మొత్తం వ్యవహారంలో భాగస్వాములు అయినట్టుగా సమాచారం. ఈ మొత్తం వ్యవహారం సమాచారహక్కు చట్టం ద్వారా అధికారులు ఇచ్చే సమాచారంతో నేరుగా కోర్టుకు వెళ్లడం ద్వారా సమాచారశాఖ లో జరిగిన అవినీతిని అటు ప్రభుత్వానికి, ఇటు జిల్లా మీడియా అక్రిడిటేషన్ చైర్మన్ కు, జర్నలిస్టులకు, ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే సమాచార హక్కుచట్టంలో దాఖలైన అంశాలను అడ్డగోలు అక్రిడిటేషన్లపై సహచట్టం దారావాహికం ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, www.enslive.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా మొదలు పెట్టాం. గత నెల 10వ తేదిన దాఖలైన దరఖాస్తుకి కమిటీ చైర్మన్ ద్వారా 15 రోజుల్లోగా తొలి సమాచారం రావాల్సి వుంది. అలా సమాచారం రాకపోతే మొదటి అప్పిలేట్ అధికారికి దరఖాస్తు దాఖలవుతుంది. అప్పటికీ సమాచారం రాకపోతే రాష్ట్ర సమాచార అధికారికి దరఖాస్తు దాఖలు చేయడానికి దరఖాస్తు దారుడు సిద్ధమవుతున్నాడు. ఇదేదో కావాలని ప్రభుత్వాన్ని తప్పుపడుతూ రాస్తున్న ప్రత్యేక కధనాలు కావనే విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలు గమనించాలి. కేవలం సమాచారశాఖ జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ల విషయంలో నిబందనలు ఒక్కొక్కరికి ఒక్కోలా అమలు చేస్తున్న విషయాన్ని మాత్రమే ఇటు ప్రభుత్వానికి, ఇటు జర్నలిస్టులకు ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, ఈఎన్ఎస్ లైవ్.నెట్ న్యూస్ వెబ్ సైట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అదీకాకుండా సమాచార హక్కుచట్టం 2005 ఆధారంగా ధాఖలైన దరఖాస్తులోని అంశాలను ప్రస్తావిస్తూ, అక్రిడిటేషన్లు మంజూరు చేసిన విషయాన్ని, ప్రభుత్వానికి సమాచారశాఖ అధికారులు తెస్తున్న చెడ్డపేరుని ప్రజలకు, పాఠకులకు తెలియజేయడానికి, దేశ రాజధాని న్యూఢిల్లీ పీఐబీలోనే లేని నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని అమలు చేయడాన్ని బహిర్గతం చేయాలని...ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మాటలను, సూచనలను, ప్రతీసారి నిబంధనలు పాటించని ఏ ప్రభుత్వ శాఖ అయినా, అధికారులైనా ప్రభుత్వానికి ఒక్కటే..తప్పు జరిగితే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటాం.. మీడియా వాస్తవాలను రాయాలని పదే పదే ప్రజలను చైతన్యం చేయడానికి సీఎం చెబుతున్న తరుణంలో ఈ విషయాలను దారావాహికంగా బయటకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే అవినీతిలేని, నిబంధనలు తప్పకుండా అన్ని వర్గాలకు ఒకేలా పాటించాలనే సూచనను పాటిస్తూనే ఈ విధమైన వార్త కధనాలను అందిస్తున్నామనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి..రేపటి ప్రత్యేక కధనం అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..7 లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని మీడియా సంస్థలు వేజ్ బోర్డు జీతాలు అమలు చేస్తున్నాయి..ఎన్ని మీడియా సంస్థలు కనీసం లేబర్ లైసెన్సులు కూడా తీసుకోకుండా పత్రికల నిర్వహణ చేస్తున్నాయి.. ఎన్ని న్యూస్ ఏజెన్సీలు అక్రిడిటేషన్ల దరఖాస్తు చేసినపుడు అన్ని రకాల ద్రువీకరణ పత్రాలు ఇచ్చాయి..ఇవ్వకుండానే ఎన్ని సంస్థలకు అక్రిడిటేషన్లు జారీచేశారు? తదితర వివరాలతో రేపటి ప్రత్యేక కధనంతో మళ్లీ కలుద్దాం..!