అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..7


Ens Balu
1
Visakhapatnam
2021-01-22 13:27:11

ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ జర్నలిస్టులకిచ్చే ప్రభుత్వ గుర్తింపు కార్డు అదేనండీ అక్రిడిటేషన్ విషయంలో దేశ రాజధాని న్యూఢిల్లీలోని పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్ మేషన్ బ్యూరో)లో కూడా లేని  నిబంధనలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వంలోని సమాచారశాఖ.. అదే ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలు వేజ్ బోర్డు అమలు చేయకపోయినా, కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా జర్నలిస్టుల రక్తమాంశాలతో సంస్థలు నడిపే ఒక్క మీడియా సంస్థపైనా ప్రభుత్వం నేటికీ చర్యలు తీసుకోకపోవడంపై  సమాధానం చెప్పలేని అధికారులు.. నిజంగా పనిచేసే జర్నలిస్టుల విషయంలో మాత్రం నిబంధనలు పెట్టి అక్రిడిటేషన్లు రాకుండా చేయాలని మాస్టర్ ప్లాన్ వేసింది సమాచారశాఖ. పైకి మాత్రం తాము నిబంధనలు ముక్కుసూటిగా పాటిస్తున్నామనే కాస్త తేడా రంగు పులుముకుంటోంది. అందులో భాగంగానే జిఓ నెంబరు 142ను తెరమీదకు తీసుకువచ్చి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు అధికారులు. ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలకు అటు న్యూస్ ఏజెన్సీలు, ఇటు న్యూస్ పేపర్స్ ఫార్మాట్ లో దేనితో దరఖాస్తు చేశారో తెలియక పోయినా పత్రికల పేరుతోనే ఆయా సంస్థల్లోని జర్నలిస్టులకు తొలివిడతగా అక్రిడిటేషన్లు మంజూరు చేసేసింది. అదేమంటే వారు తాము ఇచ్చిన జీఓకి అనుగుణంగా సంబంధిత పత్రాలు ఆన్ లైన్ సమర్పించారని రొమ్ము విరుచుకొని మరీ చెబుతున్నారు. మరి దినపత్రికలు వాటి సొంత న్యూస్ ఏజెన్సీల పేరుతోనూ, క్రెడిట్ లైన్లతోనూ సమర్పించిన ప్రెస్ క్లిప్పింగులను ఎలా పరగణలోకి తీసుకున్నారని ప్రశ్నిస్తే...ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా సమాధానం చెప్పడానికి అడ్డదారులు వెతుకుతోంది సమాచారశాఖ. పైగా చిన్న, మధ్య తరహార పత్రికలను పూర్తిగా నియంత్రించే లక్ష్యంతో జీఎస్టీ పరిధిలోకి రాని పత్రికలకు, న్యూస్ ఏజెన్సీలకు కూడా జీఎస్టీని ఆపాదిస్తూ..కొర్రీలు వేసింది. వాస్తవానికి 40 లక్షల రూపాయల టర్నోవర్ దాటితేనే జీఎస్టీ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వమే సూచించినపుడు సమాచారశాఖ ఆ ప్రాధమిక విషయాన్ని కూడా తెలుసుకోకుండా కనీసం రెండేళ్ల జీఎస్టీ రిటర్న్స్ కావాలని ఏ విధంగా అడుగుతుందో  సమాచార శాఖలోని ముఖ్య అధికారులకే తెలియాల్సి వుంది. వీటిని సమర్పించలేదని చిన్న, మధ్యతరహా మీడియా సంస్థలు, న్యూస్ ఏజెన్సీల అక్రిడిటేషన్ల దరఖాస్తులన్నీ పెండింగ్ లో వుంచింది. అంటే పాము చావకుండా కర్ర విరగకుండా, అటు మంజూరు చేయకుండా, అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వకుండా ఆపేసి,.. పక్కన పెట్టామని చెప్పకుండా పెండింగ్ అనే పదాన్ని వినియోగించి జర్నలిస్టుల అక్రిడిటేషన్లను గాల్లో వుంచింది సమాచాశాఖ. ఇన్ని నిబంధనలు పెట్టిన సమాచారశాఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలమేరకు జర్నలిస్టులకు జీతలు ఇచ్చినా, ఆర్ఎన్ఐ గైడ్ లైన్స్ ను తూచా తప్పకుండా అమలు చేసినా, సమాచారశాఖ ఎన్ని నిబంధనలు పెడితే అన్ని నిబంధనలతో మీడియా సంస్థలు దరఖాస్తులు అక్రిడిటేషన్ కోసం దాఖలు చేసేవి. అలా కాకుండా ఒకేసారి కొత్తనిబంధనలన్నీ పెట్టి...సదరు జీఓ నెంబరులో ఉన్నట్టుగా జిఎస్టీ రిటర్న్స్ లేకపోయినా, మండలానికి 100 కాపీలు అమ్మకపోయినా, నియోజవర్గానికి 300 కాపీలు, జిల్లా కేంద్రంలో 500 కాపీలు అమ్మకపోయినా, అలా అమ్ముతున్నట్టు తహశీల్దార్ల ద్రవీకరణ పత్రాలు లేకపోయినా అక్రిడిటేషన్లు ఇవ్వమని చెప్పడం విడ్డూరంగా వుంది. ఏదైనా ప్రభుత్వశాఖ కొన్ని నిబంధనలు అమలు చేసే సమయంలో ముందుగా విషయాన్ని ప్రకటిస్తుంది. అలాకాకుండా ఒకేసారి కొత్తగా జీఓ తెచ్చి వాటి ఆధారంగా తమకు ద్రువీకరణ పత్రాలు కావాలంటే చిన్న మధ్యతరహా మీడియా సంస్థలు ఏవిధంగా తేగలవో సమాచారశాఖ అధికారులే ఆలోచించాల్సి వుంది. అలా కాకపోయినా ముందునుంచి లేబర్ యాక్టు ప్రకారమైనా మీడియా సంస్థలు కనీసం లేబర్ లైసెన్సులు, జీతాలు, పీఎఫ్, ఈఎస్ఐలు కట్టేట్టుగా చేసినా ప్రభుత్వం పెట్టే నిబంధనలకు అనుగుణంగా మీడియా సంస్థలు కూడా అనుబంధ పత్రాలను సమర్పించడానికి వీలుపడేది. అలా అయితే ప్రభుత్వం కోరినట్టుగా కేవలం వేజ్ బోర్డు జీతాలు అమలు చేసే మీడియా సంస్థలు తప్పా మరే ఇతర మీడియా సంస్థలు కూడా సమాచారశాఖ జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్లకు అర్హత ఉండదు. కానీ అర్హత ఉన్నట్టుగా తొలివిడతలో అడ్డగోలుగా, న్యూస్ ఏజెన్సీల పేరుతో దాఖలు చేసిన క్లిప్పుంగులతో, సదరు పత్రికలకు సమాచారశాఖ అక్రిడిటేషన్లు ఎలా ఇచ్చిందనే విషయమై విశాఖలోని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కు దాఖలైన 15 అంశాల సమాచారహక్కుచట్టం 2005 దరఖాస్తు ఆధారంగా ఇపుడు సమాచారశాఖ అధికారులు కాకుండా కమిటీ చైర్మన్ సమాధానం చెప్పాల్సి వుంటుంది. దీంతో సదరు దరఖాస్తు కోరిన ఆన్ లైన్ సమాచారం ఎలక్ట్రానిక్ రూపంలో  ఏ విధంగా దరఖాస్తు దారుడికి ఇవ్వాలనే విషయమై సమాచారశాఖ అవకాశం వున్న అన్ని అడ్డదారులు వెతుకుతోంది. ఇవన్నీ చేస్తూనే తాము విడుదల చేసిన జీఓ నెంబరు142ను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల సమాచారశాఖ డిడిలు, డీపీఆర్వోలను ఖచ్చితంగా అమలు చేయాలని కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు పంపడం కూడా ఆశ్చర్యానికి తావిస్తోంది. వాస్తవానికి సమాచారశాఖ పెట్టిన నిబంధనలు ప్రభుత్వ అనుకూల మీడియా, ప్రతికూల మీడియాకి ఒకే విధంగా అమలు చేయాలి. కానీ సమాచారశాఖ అలా చేయకుండా ఒక వర్గం మీడియానే టార్గెట్ చేస్తున్నట్టుగా చేస్తున్న చర్యలు ఇపుడు ప్రభుత్వానికి జర్నలిస్టులంతా వ్యతిరేకం అయ్యేలా చేస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, దీని యొక్క అధికారిక మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా సమాచారశాఖ అత్యుత్సాహంతో ఏ రకంగా నిబంధనలు అమలు చేస్తుందనే విషయాన్ని, వర్కింగ్ జర్నలిస్టులను, చిన్న, మధ్య తరహా మీడియా సంస్థలను ఏ విధంగా నిబంధనలపేరుతో ఇబ్బందులు పెడుతుంతో బాహ్య ప్రపంచానికి తెలియజేసే పనిలో పడింది. అక్రిడిటేషన్ల విషయంలో సమాచారశాఖకి, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియా అయితే నిబంధనలు పట్టవన్నట్టుగానే అధికారులు వ్యవహరించడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అంటే ఈలెక్కన ప్రతీ సమావేశంలో తమ ప్రభుత్వం నీతి, నిజాయితీకి, నిబంధనల అమలకి నిలువుట్టద్దమని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతీ సమావేశంలో గొంతు చించుకొని మరీ తీసుకొస్తున్న చైతన్యం సమాచారశాఖకు జోలపాటలా అనిపించి, జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇచ్చే విషయంలో ఒక్కో మీడియాకి ఒక్కోలా నిబంధనలు అమలుచేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడంలో శక్తివంచన లేకుండా క్రుషి చేస్తున్నట్టుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ విధంగా ప్రత్యేక కధనాలు రాయడం ఇదేదో కావాలని ప్రభుత్వాన్ని తప్పుపడుతూ రాస్తున్న ప్రత్యేక కధనాలు కావనే విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలు గమనించాలి. కేవలం సమాచారశాఖ జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ల విషయంలో నిబందనలు ఒక్కొక్కరికి ఒక్కోలా అమలు చేస్తున్న విషయాన్ని మాత్రమే ఇటు ప్రభుత్వానికి, ఇటు జర్నలిస్టులకు ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, ఈఎన్ఎస్ లైవ్.నెట్ న్యూస్ వెబ్ సైట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అదీకాకుండా సమాచార హక్కుచట్టం 2005 ఆధారంగా ధాఖలైన దరఖాస్తులోని అంశాలను ప్రస్తావిస్తూ, అక్రిడిటేషన్లు మంజూరు చేసిన విషయాన్ని, ప్రభుత్వానికి సమాచారశాఖ అధికారులు తెస్తున్న చెడ్డపేరుని ప్రజలకు, పాఠకులకు తెలియజేయడానికి, దేశ రాజధాని న్యూఢిల్లీ  పీఐబీలోనే లేని నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని అమలు చేయడాన్ని బహిర్గతం చేయాలని...ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మాటలను, సూచనలను, ప్రతీసారి నిబంధనలు పాటించని ఏ ప్రభుత్వ శాఖ అయినా, అధికారులైనా ప్రభుత్వానికి ఒక్కటే..తప్పు జరిగితే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటాం.. మీడియా వాస్తవాలను రాయాలని పదే పదే ప్రజలను చైతన్యం చేయడానికి సీఎం చెబుతున్న తరుణంలో ఈ విషయాలను దారావాహికంగా బయటకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే అవినీతిలేని, నిబంధనలు తప్పకుండా అన్ని వర్గాలకు ఒకేలా పాటించాలనే సూచనను పాటిస్తూనే ఈ విధమైన వార్త కధనాలను అందిస్తున్నామనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి..రేపటి ప్రత్యేక కధనం అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..8 లో ఆంధ్రప్రదేశ్ సమాచారఖ ఏ ప్రాతిపదిక మీడియా సంస్థలకు అక్రిడిటేషన్లు ఇస్తుంది, వార పత్రికలు, పక్షపత్రికలు, మాస పత్రికలు, దినపత్రికలు, లోకల్ కేబుల్ టివి ఛానళ్లు, సాటిలైట్ ఛానళ్లు, న్యూస్ ఏజెన్సీలు, ఫ్రీ లాన్స్ జర్నలిస్టుల విషయంలో నిబంధనలు మార్చి ఏవిధంగా అక్రిడిటేషన్లు మంజూరు చేస్తుంది.. మాసపత్రికలు, పక్షపత్రికలు, వారపత్రికలకి ఒకే అక్రిడిటేష్ మాత్రమే ఎందుకిస్తుంది..అసలు ఒక పత్రిక మీడియా సంస్థలో తయారై బాహ్య ప్రపంచంలోకి రావడానికి ఎన్ని విభాగాలు పనిచేస్తాయి, ఎంత ఖర్చు అవుతుంది తదితర వివరాలతో రేపటి ప్రత్యేక కధనంతో మళ్లీ కలుద్దాం..!