జర్నలిస్టు కావాలంటే ఏం తెలియా(రావా)లి..?-1
Ens Balu
4
విశాఖపట్నం
2021-01-24 14:04:39
మీరు జర్నలిస్టు కావాలనుకుంటున్నారా...అలా అయితే మీకు ఏం తెలియాలి..ఏం రావాలి..? అనే ప్రశ్న చాలా మంది ఉత్సాహవంతమైన పట్టభద్రుల్లో కలుగుతుంది.. జర్నలిస్టుగా మారాలంటే మీరు ఏం నేర్చుకోవాలి.? ఖచ్చితంగా ఒక పూర్తిస్థాయి జర్నలిస్టుగా మారాలంటే ఎంత సమయం పడుతుంది.? మీరు సాధారణ జర్నలిస్టుగా కావాలనుకుంటున్నారా..? క్రైమ్ జర్నలిస్టు కావాలనుకుంటున్నారా..? ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్టు కావాలనుకుంటున్నారా..? ఫ్రీలాన్స్ జర్నలిస్టు కావాలనుకుంటున్నా, ఆన్ లైన్ కంటెంట్ జర్నలిస్టు కావాలనుకుంటున్నా..? న్యూస్ ఏజెన్సీ జర్నలిస్టు కావాలనుకుంటున్నారా..? ప్రెస్ కార్డు మెడలో వేసుకొని ఏదో మొక్కబడి జర్నలిస్టు కావాలనుకుంటున్నారా...? అసలు మీకు ఏమీ రాకపోయినా ఏదో పత్రికలోనో, టివీలోనో, వెబ్ సైటులోనో, న్యూస్ ఏజెన్సీలోనో, మొబైల్ యాప్ లోనో చేరిపోయి నేనూ జర్నలిస్టునని చెప్పుకుంటే జర్నలిస్టు అయిపోతారా..? అసలు ఏం నేర్చుకొని, ఏం రాసి, ఎలా రాస్తే మీరు జర్నలిస్టు అవుతారు?.. ఏమీ రాకపోయినా వచ్చీరాని తెలుగు పదాలతో నేనూ జర్నలిస్టుగా మారిపోతానని ఒక పెన్నూ, పుస్తకం పట్టుకొని, బైక్ పై ప్రెస్ అనే స్టిక్కర్ వేసుకుంటే మీరు జర్నలిస్టు అయిపోయాతారా? అసలు జర్నలిజం అంటే ఏంటి? జర్నలిజంలో ఏముంటుంది. పెద్ద పత్రికలు, న్యూస్ ఛానళ్లు, న్యూస్ ఏజెన్సీలో పనిచేవారు కొంతమంది మాత్రమమే ప్రముఖ జర్నలిస్టులుగా సంఘంలో ఎలా ప్రాచుర్యం పొందుతున్నారు..? అందరు జర్నలిస్టులకంటే భిన్నంగా వారు చేసేదేమిటి?.. నిర్ధిష్టమైన వార్త ఒక వార్త ఎలా రాయాలి..? ఏం నేర్చుకుంటే అలాంటి వార్త మనం ఒక జర్నలిస్టుగా రాయగలం? దీనికి ప్రత్యేక మైన శిక్షణ తీసుకోవాలా? ఒక సారి తీసుకున్న శిక్షణ సరిపోతుందా? మనకి ఎన్ని సంవత్సరాల్లో ఒక మంచి జర్నలిస్టుగా గుర్తింపు వస్తుంది..? ఇవన్నీ జర్నలిస్టుగా మారాలి అనుకున్నవారు అవగాహన పెంచుకోవాలని చూస్తారు..కానీ ఒక ప్రత్యేక విధానం, మరో ప్రత్యేక శిక్షణ, ప్రధాన పత్రికలు, మీడియా సంస్థలు నిర్వహించే జర్నలిజం కళాశాలలు తప్పితే మరెవరూ శిక్షణ ఇచ్చే పరిస్థితి లేదు..ఇదంతా ఒకప్పటి మాట. ఇపుడు మీరే ఆరు నెలల నుంచి ఏడాదిలోపు ఒక మంచి జర్నలిస్టుగా మారవచ్చు...ఏంటి నమ్మసఖ్యంగా లేదా.. దానికి మేము గేరంటీ.. దానికోసం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఒక వేదికను కల్పిస్తోంది.. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి జర్నలిస్టులుగా మారాలనుకునే వారందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. దానికోసం ఉత్సాహవంతులైన పట్టభద్రులు చేయాల్సిందల్లా ఒక్కటే ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ప్రతీరోజూ ఒక ప్రత్యేక కధనం జర్నలిస్టుగా మారాలంటా ఏం చేయాలనే అంశంపై మీరు తెలుసుకోవాల్సి వుంటుంది...వాటితో యాప్ లో వచ్చే వార్తలు ఏ విధమైన న్యూస్ ఫార్మాట్ లో వస్తున్నాయో గమనిస్తూ..శిక్షణ పొందుతూ, మీరే జర్నలిస్టుగా మారి మీ యొక్క నైపుణ్యాన్ని ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా పెంచుకోవచ్చు.. తద్వారా మీరు మంచి జర్నలిస్టుగా తయారు కావడంతోపాటు, మీరు జర్నలిస్టుగా మారితే ఎలావుంటుందో బాహ్య ప్రపంచానికి తెలియజేయవచ్చు. జర్నలిజంలోని వివిధ అంశాలను, ప్రస్తావిస్తూ సాగే శిక్షణా కధనాలను ప్రతీరోజూ తెలుసుకోవడం తోపాటు అదే రోజు మీరు కూడా వార్తలు రాయడం మొదలు పెట్టి అనతి కాలంలో మంచి జర్నలిస్టుగా మారవచ్చు.. ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా మీరు పొందిన జర్నలిజం శిక్షణ నిజమైన న్యూస్ ఫార్మాట్ విధానంలో వుంటుంది కనుక. ఇక్కడ నేర్చుకున్న శిక్షణతో మీరు ఎక్కడైనా ఏ మీడియా సంస్థలో అయినా పనిచేయడానికి ఎంతో దోహద పడుతుంది... ఇది తొలిరోజు ప్రోమో లెసన్ మాత్రమే..ఇంకెందుకు ఆలస్యం మీకు ఆండ్రాయిడ్ ఫోను ఉంటే మీరు ఆరునెలల్లో పెర్ ఫెక్ట్ జర్నలిస్టుగా మారిపోవచ్చు.. వెంటనే మీ మొబైల్ లో ఈఎన్ఎస్ లైవ్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోండి. జర్నలిస్టుగా మారి మీ ఆదాయాన్ని వార్తలు రాయడం ద్వారా సంపాదించుకోండి..బెస్టాఫ్ లక్..!