జర్నలిస్టు కావాలంటే ఏం తెలియా(రావా)లి..?-1


Ens Balu
5
Visakhapatnam
2021-01-26 09:57:16

నేల నలు చెరగుల్లో(News-North, East, West, South) ఏం జరుగుతోందో తెలుసుకొని ఏరి,కోరి, కూర్చి, ఒక అంశాన్ని విషయంగా పాఠకుడికి అర్ధమయ్యే రీతిలో రాయడాన్నే వార్త అంటారు. అసలు మనకి వచ్చినట్టు ఏదో ఒక విషయాన్ని ఏదోలా రాసేస్తే అదివార్త..అదేనండి మీ పరిభాషలో న్యూస్ అయిపోతుందా..అంటే కాదనే చెప్పాలి. ఒక వార్తను మనం రాసేటపుడు ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా అనే అంశాలను ప్రామాణికంగా తీసుకొని రాసినపుడు మాత్రమే అది నిర్ధిష్టమైన న్యూస్ ఫార్మాట్ న్యూస్(వార్త) అవుతుంది. ప్రధాన మీడియా సంస్థలు, పేరున్న న్యూస్ ఏజెన్సీలు అన్నీ న్యూస్ ఫార్మాట్ లో మాత్రమే వార్తలను ప్రజలకు అందిస్తాయి. అలా న్యూస్ ఫార్మాట్ లో ఒక వార్త రాయడానికి పైన పేర్కొన్న ఐదు అంశాలపై అవగాహన మాత్రమే కాదు వాటిని ఎలా ఉపయోగించాలనే విషయంపై పట్టు కూడా  రావాలి. అలా పట్టు రావాలంటే ప్రతినిత్యం కాస్త గట్టిగానే శ్రమించాల్సి వుంటుంది. చాలా మంది అనుకోవచ్చు. డిగ్రీలో జర్నలిజం చేసినా, పీజీలో జర్నలిజం చేసినా జర్నలిస్టు అయిపోవచ్చు గదండీ అంటారు  చాలా మంది నాలాంటి తెలివైనోళ్లు..? అదెలా వుంటుందంటే వైట్ అండ్ వైట్ డ్రస్సు వేసిన ప్రతీవాడు రాజకీయ నాయకుడు ఎలా కాలేడో.. డిగ్రీ, పీజీల్లో జర్నలిజం చేసినంత మాత్రన జర్నలిస్టు అనుకోవడానికి లేదు. మనం ఎంత చదువు చదువుకున్నా ఎపుడైతే ఒక విషయాన్ని పాఠకుడికి అర్ధమయ్యే రీతిలో చక్కగా న్యూస్ ఫార్మాట్ లో  రాయగలిగామో అపుడే మనం నిజమైన జర్నలిస్టు అయినట్టు లెక్క. డిగ్రీ తరువాత మనం పీజి ఒక సబ్జెక్టులో మాస్టర్స్ ఎలా చేస్తామో..అలాగే జర్నలిస్టుగా అయిన తరువాత కూడా చాలా మంది తమ ప్రావీణ్యాన్ని వివిధ విభాగాల్లో పెంచుకోవడానికి, పనిచేయడానికి, గుర్తింపు తెచ్చుకోవడానికి ఉపయోగ పడుతుంది. ప్రస్తుతం కాలంలో ఒక్కో దిన పత్రిక ఒక్కో న్యూస్ ఫార్మాట్ ను వినియోగిస్తుంది. ఒక పత్రిక విషయాన్ని మాత్రమే పాఠకుడికి తెలియజేస్తుంది. మరో పత్రిక విషయంతో పాటు ఒక రెండు అంశాలను కూడా తెలియజేయాలని అనుకుంటుంది. మరో పత్రిక ఆ రెండు విషయాలతోపాటు జరగబోయే క్రమాన్ని కూడా పాఠకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. వివిధ అంశాలపై మనకున్న పట్టును బట్టీ మీడియా సంస్థలు ఆయా విభాగాలు, ప్రభుత్వ శాఖలు మనకి జర్నలిస్టుగా పనిచేయడానికి అవకాశాలు కేటాయిస్తాయి అదీ మీరు పూర్తిస్థాయి జర్నలిస్టుగా అయిన తరువాత.. అదేంటండీ న్యూస్ అని మొదలు పెట్టి అపుడే శిక్షణ మొత్తం అయిపోయి జర్నలిస్టుగా బాధ్యతలు చేపట్టినట్టుగా ముగించేస్తున్నారే అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. జర్నలిస్టు అనే వ్యక్తి ఎపుడైతే నిత్య విద్యార్ధిగా ఉన్నానని భావిస్తాడో అపుడే మంచి అంశాలను శోధించి వాటిని పాఠకుడికి వార్తలు, వార్తా కధనాలుగా, ప్రత్యేక కధనాలుగా అందించగలుగుతాడు. అలా జర్నలిస్టుగా మారాలంటే దానికి ముందు చాలా శ్రమపడి అన్ని విషయాలను నేర్చుకుంటే తప్పా జర్నలిస్టుగా మారడం కష్టం. మాకు ఇవన్నీ వద్దుకానీ మేము డైరెక్టుగా ఏదైనా పత్రికలోనో, టీవీలోనో, న్యూస్ ఏజెన్సీలోనో చేరిపోతే జర్నలిస్టు అనరా? అంటే అంటారని చెబుతాను. కానీ పూర్తిగా శిక్షణ తీసుకుని రాసే జర్నలిస్టుకి, ఏమీ రాకుండా పెన్నూ పేపరు పట్టుకొని ఫీల్డులోకి వెళ్లి, ఆ తరువాత సేకరించిన సమాచారాన్ని ఆఫీసుకో కూర్చొని ఒక సింగిల్ కాలమ్ వార్త రాయడానికి పడే కష్టం, పట్టే చెమటలు, చిరిగే పేపర్లు, అంతా రాసిన తరువాత స్వీకరించే పేపరు ఆఫీసువాళ్లు తిట్టే తిట్ల దండకం ఏ స్థాయిలో వుంటుందో ఏమీ తెలియకుండా నేనూ జర్నలిస్టుననే తెగఫీలైపోయిన వారిని అడిగితే చెబుతారు...కాదు కాదు ఎపుడైనా అలాంటి వారు పత్రికా కార్యాలయంలో వార్తలు రాస్తున్న సమయంలో వెళ్లిచేస్తే తెలుస్తుంది. కానీ ఎవరికీ వెళ్లి చూసే అవకాశం వుండదు. కానీ ఇది వాస్తవం. తాము సీనియర్ జర్నలిస్టులమని చెప్పుకునే వారు సైతం నేటికీ న్యూస్ ఫార్మాట్ లో వార్తలు రాయలేరంటే అతిశయోక్తి కాదు..ఇలాంటి ఇబ్బందులు, అవమానాలు పడకుండా ఉండాలనుకునే వారు మాత్రమే జర్నలిజంలో శిక్షణ తీసుకున్న తరువాత మాత్రమే జర్నలిస్టుగా మారతూ ఉంటారు. ఒకప్పుడు చాలా మంది జర్నలిజం స్కూళ్లు, కాలేజీల్లో వేలకు వేలు ఖర్చు చేసి జర్నలిజంలో శిక్షణ తీసుకునేవారు. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా మంచి జర్నలిస్టుగా మారదామనుకునే వారిని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ జర్నలిజంలో ప్రాధమిక శిక్షణ మొబైల్ యాప్ ద్వారా ప్రత్యేక కధనాల ద్వారా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.  ఆ కార్యక్రమంలో భాగంగానే గణతంత్ర దినోత్సవం రోజు నుంచి ఈ కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. అంతేకాదు విశాఖలో ఎవరైనా ఔత్సాహికులు జర్నలిజం పట్ల ఆశక్తి వుంటే నేరుగా ఫీల్డులోనే వారికి లైవ్ లో శిక్షణ కూడా ఇవ్వాలని సంకల్పించాం. ఈ ప్రత్యేక శిక్షణ ద్వారా మంచి జర్నలిస్టులను సమాజానికి అందించాలనే లక్ష్యంతో పైసా ఖర్చులేకుండా జర్నలిజంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. కాకపోతే మీరు ఈ జర్నలిజం పాఠాలను నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా గుగూల్ ప్లే స్టోర్ నుంచి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి వుంటుంది. రేపటి పాఠంలో మళ్లీ కలుద్దాం..