జర్నలిస్టు కావాలంటే ఏం తెలియా(రావా)లి..?-2


Ens Balu
3
Visakhapatnam
2021-01-27 10:14:01

జర్నలిస్టు కావాలనుకునేవారు నేరుగా జర్నలిస్టు అయిపోదామని అనుకోవడానికి ముందు అసలు మీడియా ఎలా వుంటుంది? ..ఎన్ని విభాలుగా వుంటుంది?.. ఎన్నిరకాలుగా వుంటుంది?.. ఏ రకం మీడియాలో అయితే ఉపాది లభిస్తుంది?..ఏ మీడియాలో అయితే మంచి గుర్తింపు వస్తుంది?..ఎలా పనిచేస్తే మంచి జర్నలిస్టుగా రాణించవచ్చు?.. అనే అంశాలను ముందు తెలుసుకుంటే మీడియా రంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి  వేదికను ఏర్పాటు చేసుకోవడానికి వీలుపడుంది. దానితో పాటు మీడియాలోని ఏ విభాగంలో జర్నలిస్టుగా కెరీర్ మొదలు పెడితే బాగుంటుందనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సి వుంటుంది. జర్నలిస్టు అయిపోతే ఏ విభాగంలోనైనా పనిచేసేయొచ్చు కదా అనుకోవడానికి లేదు. ఒక్కో విభాగంలో జర్నలిజం ఒక్కోలా వుంటుంది. దానికోసం మనం జర్నలిజంలో ఉన్న వివిధ విభాగాల్లో మనకి అనుకూలంగా వున్న విభాగాన్ని ఎంచుకోవడం ద్వారా మన భవిష్యత్తు కూడా ఉజ్వలంగా వుంటుందని గమనించాలి. లేదంటే మధ్యలోనే మనం మీడియాని వదిలిపెట్టే పరిస్థితులు కూడా రావొచ్చనే ఇబ్బందులు కూడా ఎదురు పడొచ్చు. ఏదోలా బతికేద్దామంటే మీడియా రంగంలోకి రావడం దండగనే చెప్పాలి. దమ్ము, దైర్యం, సమయస్పూర్తి, ఒక మంచి విజన్, ఇన్విస్టెగేషన్, సర్వీస్, జస్టిస్, జాబ్ సాటిస్ఫేక్షన్ ఉండేలా అయితేనే మీడియా రంగంలోకి అడుగు పెట్టాలి. లేదంటే సాధారణ జర్నలిస్టులకూ మీకూ పెద్దగా తేడా ఏమీ ఉండదు. దానికోసం ముందుగానే మీడియా కోసం తెలుసుకోవాల్సి వుంటుంది. అసలు మీడియాకోసం మీకు ఎవరు చెబుతారు...ప్రస్తుతం జర్నలిస్టులుగా పనిచేస్తున్నవారందరికీ మీడియాకోసం తెలుసా అంటే తెలియదనే చెప్పాలి. మరేం తెలుసునని చాలా మంది జర్నలిస్టులు మాకు తెలియంది ఏముంటుందని అంటారని మీకు సందేహం రావచ్చు. చాలా మంది జర్నలిస్టులకు తెలిసింది కేవలం వార్తలు రాయడం, రాసిన వార్త ఏవిధంగా వచ్చింది, కార్యాలయంలో దానికి ఎలా తుది మెరుగులు దిద్దుతారు, పత్రిక అయితే ప్రింట్ అయి, టివి అయితే టెలీకాస్ట్ అయి, న్యూస్ యాప్ అయితే పబ్లిష్ అయి, వీడియో అయితే ప్లే అయినంత వరకూ మాత్రమే వారికి తెలుస్తుంది. దాని వెనుక ఎన్ని విభాగాలు పనిచేస్తే ఒక న్యూస్ ఫార్మాట్ లో మీరు రాసిన న్యూస్ బయటకొస్తుందో చెప్పమంటే చాలామంది తెల్లమొహం వేస్తారు. మరి ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి అంటే... మనం జర్నలిజం కోసం ప్రాధమిక శిక్షణ తీసుకున్న తరువాత ఆయా మీడియా సంస్థల్లోని విభాగాలు పనిచేసే తీరుపై ద్రుష్టి సారిస్తే తప్పా మనకి మీడియాలోని విభాగాల కోసం తెలియదు. తెలుసుకునే అవకాశం కూడా ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ మీడియా తప్పితే స్థానిక మీడియాలో ఉపాది, ఉద్యోగాలు గాల్లో దీపం లానే ఉన్నాయి. దానికోసం జర్నలిజం కెరీర్ ను ఎంచుకునేవారు పెద్ద మీడియా సంస్థల్లో ఉపాది లభించేలా శిక్షణ పొందాల్సి వుంటుంది. అలా పెద్ద మీడియా సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే ఏంచేయాలనేది ముందు ముందు పాఠాల్లో నేర్చుకుందాం. రేపటి పాఠంలో మీడియా ఎన్నిరకాలుగా వుంటుంది, ఎన్ని విభాగాలు ఉంటాయి? ఆయా విభాగాల్లో పనిచేయాలంటే ఏం నేర్చుకోవాలి, విద్యార్హతలేంటి, ఉద్యోగాలు ఎలా వుంటాయి, జీతాలు ఎలా ఉంటాయి, కెరీర్ ఏ విభాగంలో అయితే బాగుంటుంది, ఏ విభాగంలో ఉద్యోగమైతే ఎన్ని ఇబ్బందులొచ్చినా భరోసా ఉంటుంది, తదితర అంశాలు చర్చిద్దాం..!