జర్నలిస్టు కావాలంటే ఏం తెలియా(రావా)లి..?-5
Ens Balu
3
Visakhapatnam
2021-02-02 13:58:34
మీడియారంగంలో మంచి జర్నలిస్టు కావాలంటే కఠోర దీక్ష..పట్టుదల..మంచి శిక్షణ..చూసింది చూసినట్టు అక్షర రూపంలోకి తీసుకువచ్చే నేర్పు కావాలి. అది ఎలా వస్తుంది..డిగ్రీ చదివి, జర్నలిజంలో పోస్టు గ్రాడ్యూషన్ చేసేసి, ఏదైనా మీడియా సంస్థ నిర్వహించే జర్నలిజం స్కూలులో శిక్షణ పొందితే మంచి జర్నలిస్టు అయిపోతామా అంటే కాదనే చెప్పాలి. చదువు, శిక్షణ, అవగాహన మనం జర్నలిస్టుగా మారడానికి సరిపోతాయి తప్పితే మంచి జర్నలిస్టుగా, పేరున్న జర్నలిస్టుగా మారాలంటే మాత్రం దానికి సత్యశోధన చాలా అవసరం. అది మనం జర్నలిస్టుగా మారిన తరువాత కాలక్రమంలో వస్తుంది. అలా రావాలంటే మనం మీడియా రంగంలో ఎంచుకునే విభాగాన్ని బట్టీ కూడా ఆధారపడి వుంటుంది. జర్నలిస్టుగా మారిన వారికి ఆయా మీడియా సంస్థలు అన్ని రకాల వార్తలను రాయడానికి అవకాశం ఇవ్వవు. కొందరిని ప్రభుత్వశాఖలు, మరికొందరిని క్రైమ్, ఇంకొందరిని ఇన్వెస్టిగేషన్, కొందరిని సినిమా, మిగిలిన వారిని సాంస్క్రుతిక విభాగం, వంటలు, సాధారణ కార్యక్రమాలు కవర్ చేసే జర్నలిస్టులుగా ఆయా మీడియా సంస్థలు నియమిస్తాయి. మనం పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన తరువాత మనం ఏ విభాగంలో మనల్ని నియమించా పనిచేయడానికి సిద్ధంగా వుండాలి. మనం పనిచేసే విభాగంలోనే మనం సేకరించిన సమాచారాన్ని కొత్తగా, సరికొత్తగా ప్రెజెంట్ చేయడంలో పట్టు సాధించాలి. తద్వారా అలా మనకి కొత్తదనం అలవాటు అవుతుంది. మనం రాసే వార్తలకు కూడా పాఠకుల నుంచి మంచి స్పందన కూడా వస్తుంది. మనం పాత్రికేయ పాఠశాలలో శిక్షణ పొందే సమయంలో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని వుంటే.. దానిని మనం కాపాడుకుంటూ వస్తూ మనకి మనమే ఒక న్యూస్ బ్రాండ్ గా మారడానికి పునాదులు వేసుకూంటూ వెళ్లాల్సి వుంటుంది. ఎప్పుడూ మనం రాసే వార్తల్లో వాస్తవాలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. అసత్యవార్తలకు ఎలాంటి సమయంలోనైనా తావివ్వకూడదు. సాధారణ వార్తలు రాసినా కూడా మనం ప్రజెంట్ చేసే వార్తలో వైవిధ్యం కనిపిస్తూనే ఉండాలి. అదే మనం మంచి జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఒక మంచి జర్నలిస్టుగా మారాలనుకునే వారు ఎవరైనా సరే తాను నిత్యవిద్యార్ధినే అన్నట్టుగా విధినిర్వహణ లో ముందుకు వెళ్లాలి. ఎందుకంటే బాహ్య ప్రపంచంలోని అన్ని విషయాలు మనకి తెలియాలని లేదు. మనకి తెలియని విషయాలు రాసేకొద్ది పుట్టుకొస్తూనే వుంటాయి. అందుకోసమే జర్నలిస్టు అనేవాడు ఎపుడైనా నిత్యవిద్యార్ధిగా కొత్త విషయాలు.. కొత్తదనాన్ని తెలుసుకోవడానికి దానిని పాఠకులకు దగ్గర చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. అది ఏ ఒక్క భాషకో పరిమితం కాదు. మనం తెలుగు మీడియా, ఇంగ్లీషు, హిందీ ఏ భాషలో మనం జర్నలిస్టుగా పనిచేసినా వాస్తవాలకు మాత్రమే పెద్దపీట వేయాలి. అనునిత్యం కొత్త విషయాలను పాఠకులకు చేరవేయడం ద్వారా మనకు మంచి సీనియారిటీ లభిస్తుంది. చాలా మంది సంవత్సరాలకు సంవత్సరాలు పనిచేసినా ఒక సింగిల్ కాలమ్ వార్తను న్యూస్ ఫార్మాట్ లో రాయడానికి చాలా పేపర్లు చింపుతుంటారు. దానికి కారణం ఒక్కటే..వారు ఎంత కాలం పనిచేసినా ఒక విధానంలో పనిచేయకపోతే పరిస్తితి అలానే వుంటుంది. కానీ మనం జర్నలిజంలో ఒక విధానపరమైన శిక్షణ తీసుకొని పనిచేస్తే మాత్రం అలాంటి ఇబ్బందులు, ఏమీ రాదనే బావన మన దరిపాల్లోకి కూడా రాలేవు. ఎలాంటి సమయంలోనైనా మనమే ఎదుటికి వ్యక్తికి కొత్త విషయం చెప్పగలగిలే ఎదగడానికి అవకాశం వుంటుంది.ఇవన్నీ చేస్తే ఒక మంచి జర్నలిస్టుగా గుర్తింపు వస్తుందా? వచ్చేసినట్టేనా? ఇంకా ఏమైనా నేర్చుకోవాలా? అంటే నేర్చుకుంటూనే ఉండాలనే చెప్పాలి...జర్నలిస్టుగా మంచి గుర్తింపు పొందాలంటే మన చదువు, శిక్షణ, సీనియారిటీ టాలెంట్ ఏరకంగా వినియోగించాలనే విషయాన్ని రేపటి పాఠంలో చర్చిద్దాం.. ఔత్సాహిక యువత జరలిస్టులుగా తమ కెరీర్ మీడియాలో ప్రారంభించాలనుకునే వారికి, నిరుపేద విద్యార్ధులకు, డబ్బు ఖర్చుచేసి జర్నలిజంలో శిక్షణ పొందలేని వారికి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా మరియు www.ensliv.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా ఉచితంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఆన్ లైన్ పాఠాలను ప్రారంభించింది. జర్నలిజం కోసం ఉచితంగా అన్ని అంశాలపై పాఠాలు పూర్తయిన తరువాత ఉచితంగానే వెబినార్ల ద్వారా లైవ్ గా శిక్షణ ఇవ్వాలని కూడా సంకల్పించాం. దానికోసం జర్నలిజం పట్ల ఆశక్తి ఉన్నవారు ఎవరైనా ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ఈ పాఠాలన్నీ ఉచితంగానే చూసే వీలుంది. వెంటనే యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఉచిత పాఠ్యాంశాలు చదివి అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాం. అంతేకాదు బాగా అవగాహన పెంచుకున్న వారికి నేరుగా లైవ్ లో శిక్షణ ఇవ్వడానికి కూడా ఈఎన్ఎస్ లైవ్ యాప్ సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఔత్సాహికులు గుర్తించాలి. ఈ ట్రైనింగ్ ఎపిసోడ్ లో బాగా అన్ని అంశాలపై శిక్షణ తీసుకున్నవారు, ఆశక్తి పెంచుకున్నవారు జర్నలిస్టులుగా మారడానికి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా అవకాశం కల్పిస్తాం. ఒక వార్తను న్యూస్ ఫార్మాట్ లో ఏ విధంగా రాయాలో కూడా శిక్షణ ఇస్తాం. మంచి జర్నలిస్టులుగా తీర్చిదిద్దుతాం. భారతదేశానికి వైద్యులు, ఇంజనీర్లు, మేధావులు, ప్రభుత్వాలు ఎంత అవసరమో...వాస్తవాలను వెలికి తీసే మంచి జర్నలిస్టుల అవసరం నానాటికీ పెరుగుతూ వస్తుంది. ఆ లోటును భర్తీచేయడానికి మీరూ ముందుకి రావాలనుకుంటే ఈఎన్ఎస్ లైవ్ యాప్ తో చేతులు కలపండి. మంచి జర్నిలిస్టుగా కెరీర్ ప్రారంభించి దేశానికి మీవంతు సహాయం అందించండి..!