జర్నలిస్టు కావాలంటే ఏం తెలియా(రావా)లి..?-6
Ens Balu
3
Visakhapatnam
2021-02-03 11:36:41
మీడియా రంగంలో వేలకొలదీ జర్నలిస్టులు పనిచేస్తారు...కొందరికి మాత్రమే మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. ఆ స్థాయిలో మనకి కూడా మంచి గుర్తింపు రావాలంటే, మంచి జర్నలిస్టుగా పేరు తెచ్చుకోవాలంటే ఒక్కరాత్రిలోనే వచ్చే పరిస్థితి అయితే ఉండదు. మనం ముందుగా చెప్పుకున్నట్టు మీడియాలో జర్నలిస్టుగా పనిచేసే ప్రతీ ఒక్కరూ తాను నిత్య విద్యార్ధిగానే పనిచేయాల్సి వుంటుంది. కొత్త ప్రయోగాలు చేస్తూ, బాహ్య ప్రపంచంలోని విషయాలను మంచి వార్తలు రూపంలో పాఠకులకు అందించాలి. ఇలా అందించడంలో ఒక్కో జర్నలిస్టు ఒక్కో స్టైల్ లో ప్రెజంటేషన్ చేస్తుంటారు. కొందరు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా రాస్తారు. కొందరు అదే విషయాన్ని మన కళ్లకి కట్టినట్టుగా రాస్తారు. మరికొందరు ఆ వార్త ఎందుకు రాస్తారో వారికే తెలియదు...ఆయా మీడియా సంస్థలు దాని ఎలా చూపిస్తాయో వారికే తెలియదు అన్నట్టుగా వుంటాయి. అందరితోపాటు మనం అన్నట్టుగా పనిచేస్తే మీడియా రంగంలో గుర్తింపు అనేది రాదు. అందరిలోనూ మనం మేటి అన్నట్టుగా పనిచేస్తే తప్పా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. అదే సమయంలో మనకు జీతాలు ఇచ్చే మీడియా సంస్థలను కూడా నిశితంగా పరిశీలించి మరీ ఎంపిక చేసుకోవాల్సి వుంటుంది. దానికి ముఖ్యంగా పబ్లిక్ రిలేషన్ అనేది చాలా చక్కగా ఉండాలి. ఏ వ్యక్తికైనా మీకోసం ముందు తెలియాలి. అలా తెలియాలంటే అందరితోనూ పరిచియాలు పెంచుకోవాలి. మంచి వార్తలు, అవినీతి వార్తలు, పాఠకుడికి ప్రేరణ ఇచ్చే వార్తలు అన్నీ ప్రముఖంగానే రాయాలి. అలా ఎపుడైతే మనం రాయగలుగుతామో అపుడే ఒక మంచి జర్నలిస్టుగా సమాజం గుర్తిస్తుంది. ఒక్కోసారి మనం పనిచేసే మీడియా సంస్థను బట్టి కూడా మనకి గుర్తింపు వస్తుంది. ఒక్కోసారి మనం పనిచేసే మీడియా సంస్థకు మన ద్వారా కూడా పేరువస్తుంది. ఎప్పుడైనా మనం పనిచేసే సంస్థ ద్వారా మనకు గుర్తింపువస్తే అది నీటి మీద రాతలానే వుంటుంది. కానీ మనం పనిచేసే సంస్థకు మీరు రాసిన వార్తల ద్వారా గుర్తింపు వస్తే అది చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీకంటూ ఒక బ్రాండ్ ఏర్పడుతుంది. ఎపుడైతే మీకంటూ ఒక బ్రాండ్ వచ్చిందో అప్పటి నుంచి మీ గుర్తింపు నలుదిశలా(News-Norths, East, West, South) పాకుతుంది. ఒక్కో సందర్భంలో మీ పనితనమే మీకు మంచి ఉద్యోగాన్ని కూడా తెచ్చిపెడుతుంది. మీపనితనాన్ని బట్టి మీరు ఏ సంస్థలో జర్నలిస్టు ఉద్యోగానికి దరఖాస్తు చేసినా ఖచ్చితంగా మీకు ఆ ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఆ స్థాయిలో జర్నలిస్టు గా మారాలంటే మనకి మనం పనిచేసే ప్రాంతీయ భాషపై మంచి పట్టు ఉండాలి. పూర్తిగా పత్రికా భాష తెలిసి వుండాలి, భాషను సందర్భానికి అనుగుణంగా వినియోగించే సమయస్పూర్తి కావాలి. అది కూడా ఒకేసారి జర్నలిస్టుకి వచ్చే పరిస్థితి ఉండదు.. దానికోసం కూడా ఎంతో కఠోర శ్రమ పడాలి. వందల సంఖ్యలో మంచి మంచి వార్తలు రాసినపుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. ఏ రోజైతే మనం జర్నలిజం శిక్షణ పూర్తయి జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభిస్తామో మొదటి రోజు నుంచి తాజా వార్తలను ఇవ్వడంలో మనం ముందుండాలి. ఎవరూ ఇవ్వలేని సమాచారాన్ని మనం ఇవ్వడానికి కొత్త కొత్త వ్యక్తులను పరిచియం చేస్తుండాలి. ఇప్పటికే అలాంటి వారు వివిధ మీడియాల్లో పాఠకులకు ప్రజలకు పరిచియం అయినా..మీ స్టైల్ లో మరోసారి కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఏ జర్నలిస్టు మనం మాట్లాడే వాడుక భాషను వార్తలను, వార్తా కధనాలను రాయడానికి వినియోగిస్తాడో అలాంటి జర్నలిస్టుకి అనతి కాలంలోనే మంచి గుర్తింపు వస్తుంది. అలా వాడుక బాషను నేరుగా వాడేస్తే గుర్తింపు వచ్చేస్తుందా?..కొత్త విషయాలను మనం చూపినంత మాత్రన మనల్ని సహచర జర్నలిస్టులు గుర్తిస్తారా?, మనం పనిచేసే మీడియా సంస్థలు ప్రోత్సహిస్తాయా? అంటే అవి ఒక్కో సందర్భంలో మాత్రమే జరుగుతాయి. మనపై అందరి ద్రుష్టి ఉండాలంటే మనం కూడా అన్ని విషయాలపైనా ద్రుష్టిపెట్టాలి. అది ఎలా పెట్టాలి?, ఏవిధంగా పెట్టాలి?, ఎప్పుడు పెట్టాలి?, ఏ సందర్భంగా పెట్టాలి? అనే విషయాలు మనకి తెలిస్తే...ఆవిధంగా మనం మంచి వార్తా కధనాలు రాయగలిగితే మనకంటూ జర్నలిస్టుగా ఓ గుర్తింపు వస్తుంది. జర్నలిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలంటే ఏఏ విభాగాల్లో మనం ఏ విధంగా వార్తలు రాయాల్సి వుంటుందనే అంశాలు రేపటి పాఠంలో చర్చిద్దాం.. ఔత్సాహిక యువత జరలిస్టులుగా తమ కెరీర్ మీడియాలో ప్రారంభించాలనుకునే వారికి, నిరుపేద విద్యార్ధులకు, డబ్బు ఖర్చుచేసి జర్నలిజంలో శిక్షణ పొందలేని వారికి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా మరియు www.ensliv.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా ఉచితంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఆన్ లైన్ పాఠాలను ప్రారంభించింది. జర్నలిజం కోసం ఉచితంగా అన్ని అంశాలపై పాఠాలు పూర్తయిన తరువాత ఉచితంగానే వెబినార్ల ద్వారా లైవ్ గా శిక్షణ ఇవ్వాలని కూడా సంకల్పించాం. దానికోసం జర్నలిజం పట్ల ఆశక్తి ఉన్నవారు ఎవరైనా ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ఈ పాఠాలన్నీ ఉచితంగానే చూసే వీలుంది. వెంటనే యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఉచిత పాఠ్యాంశాలు చదివి అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాం. అంతేకాదు బాగా అవగాహన పెంచుకున్న వారికి నేరుగా లైవ్ లో శిక్షణ ఇవ్వడానికి కూడా ఈఎన్ఎస్ లైవ్ యాప్ సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఔత్సాహికులు గుర్తించాలి. ఈ ట్రైనింగ్ ఎపిసోడ్ లో బాగా అన్ని అంశాలపై శిక్షణ తీసుకున్నవారు, ఆశక్తి పెంచుకున్నవారు జర్నలిస్టులుగా మారడానికి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా అవకాశం కల్పిస్తాం. ఒక వార్తను న్యూస్ ఫార్మాట్ లో ఏ విధంగా రాయాలో కూడా శిక్షణ ఇస్తాం. మంచి జర్నలిస్టులుగా తీర్చిదిద్దుతాం. భారతదేశానికి వైద్యులు, ఇంజనీర్లు, మేధావులు, ప్రభుత్వాలు ఎంత అవసరమో...వాస్తవాలను వెలికి తీసే మంచి జర్నలిస్టుల అవసరం నానాటికీ పెరుగుతూ వస్తుంది. ఆ లోటును భర్తీచేయడానికి మీరూ ముందుకి రావాలనుకుంటే ఈఎన్ఎస్ లైవ్ యాప్ తో చేతులు కలపండి. మంచి జర్నిలిస్టుగా కెరీర్ ప్రారంభించి దేశానికి మీవంతు సహాయం అందించండి..!