జర్నలిస్టు కావాలంటే ఏం తెలియా(రావా)లి..?-7
Ens Balu
4
Visakhapatnam
2021-02-04 09:16:16
మీడియా రంగంలో జర్నలిస్టుగా కెరీర్ మొదలు పెట్టేవారంతా మంచి జర్నలిస్టుగా రాణించాలన్నా, పాఠకుల్లో గుర్తింపు తెచ్చుకోవాలన్నా ప్రధానంగా పంచ సూత్రాలు పాటించాల్సి వుంటుంది. ముందుగా చక్కనైన భాషను మనం రాసే వార్తల్లో వినియోగించాలి, పాఠకుడిని వార్త మొత్తం చదివించేలా చక్కటి వాడుక బాష పదాలను వార్తాలో రాయాలి, రాసే వార్తలో కొత్తదనం కనిపిస్తూ వైవిధ్యభరితంగా ఉండాలి, వార్తకు అనుగుణంగా మంచి ఫోటోలను వినియోగించాలి, చూడగానే గుర్తుండిపోయేలా మంచి శీర్షికను రాసే జర్నలిస్టే పెట్టే సామర్ధ్యం సంపాదించాలి. ఈ పంచసూత్రాలు ఒక జర్నలిస్టు ఏరోజైతే చక్కగా వినియోగించి పాటించడం మొదలు పెడతాడో అపుడు ఆ జర్నలిస్టుకి మంచి గుర్తింపు వస్తుంది. అంతేకాదు మనం ఏదైతే డేట్ లైన్ తో వార్తలు రాస్తామో, ఆయా మీడియా సంస్థలు మనకి ఇచ్చే గుర్తింపుకి వన్నె తీసుకు రావాలి. అది ఏ స్థాయిలో ఉండాలంటే ఈరోజు పలానా డేట్ లైన్ వార్త కోసం పాఠకుడు పత్రికను చూడాలి, అదే మీడియా రంగంలో అయితే ఆ జిల్లాల వార్తకోసం ఛానల్ చూస్తూ వుండాలి, న్యూస్ ఏజెన్సీలు నిర్వహించే వెబ్ సైట్ అయితే మంచి వార్తల నోటిఫికేషన్ కోసం పాఠకులు ఎదురు చూడాలి, మొబైల్ యాప్ విషయానికొస్తే ఆ రిపోర్టర్ ఇచ్చే న్యూస్ కార్డ్ కోసం ఆత్రుతగా వేచిఉండాల.. ఇలా ఒక జర్నలిస్టు పంచసూత్రాలతో ఎపుడైతే వార్త కధనాలను పాఠకులకు అందిస్తాడో ఆ రోజున మంచి గుర్తింపు వస్తుంది. ఏడాదికో శివరాత్రి అన్నట్టు ఒకటీ అరా మంచి వార్తలు రాసినంత మాత్రన ఆ గుర్తింపు రాదు. అనునిత్యం మనం రాసే వార్తల్లో కొత్తదనం కనిపిస్తూనే ఉండాలి. దానికోసం నిరంతరం శ్రమించి పనిచేస్తే తప్పా మంచి జర్నలిస్టు అనే గుర్తింపుని నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది. ఉదాహరణకు ఒక్కో పత్రికలో ప్రముఖంగా భూ ఖబ్జాలు వార్తలు మాత్రమే వస్తుంటాయి. మరికొన్ని పత్రికల్లో ప్రముఖుల జీవిత చరిత్రలు, వారు చేసిన సేవలు మాత్రమే వస్తుంటాయి. ఇంకొన్ని పత్రికల్లో సినిమాలు, సాధారణ, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన వార్తలు వస్తుంటాయి. ఇక ప్రధాన పత్రికలైతే అన్ని రకాల వార్తలను తమ పత్రికలో వివిధ పేజీల్లో ప్రత్యేక కథనాలుగా పాఠకుడికి అందిస్తాయి. ఒక అవినీతివార్త మనకి తెలిస్తే తెలిసింది అని రాయడం వలన ఆ వార్తకు గుర్తింపు రాదు. పలాన చోట ఇంత మొత్తంలో అవినీతి జరిగిందని ఎపుడైతే ఆ జర్నలిస్టు ఆధారాలతో సహా వార్తలు రాస్తాడో అపుడు ఆ వార్తకు పాఠకుల నుంచి మంచి స్పందన వచ్చి ఆ వార్త రాసిన వ్యక్తికి గుర్తింపు వస్తుంది. అలా మనకి అవినీతి వార్తలు, విషయలు మనకి డైరెక్టుగా తెలుస్తాయా? మనం పెద్ద పత్రికలు, టీవీ ఛానళ్లు, న్యూస్ ఏజెన్సీలు, న్యూస్ యాప్స్ లో పనిచేస్తున్నామని అందరూ మనదగ్గరకి వచ్చి చెప్పేస్తారా? అంటే అవేమి జరగవనే చెప్పాలి. దానికోసం మనం ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలి. అన్ని వర్గాల వారితో ఎప్పుడూ మాట్లాడుతూ, వారి సాదక బాధలను వార్తలుగా రాస్తూ ఉండాలి, ఎపుడైనా వారికి సహాయం కావాల్సి వస్తే ఒక జర్నలిస్టుగా సహాయం చేస్తూ రావాలి. ఆ విధంగా చేయడం ద్వారా మనకి వివిధ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అలా అందిన ప్రాధమిక సమాచారంతో మనకున్న నెట్వర్క్ ను వినియోగించి వార్తకు కావాల్సిన ఆధారాలు సేకరించి ప్రత్యేక కధనం రాస్తే ఆ వార్తకు మంచి ఆదరణ వస్తుంది. అదే ప్రభుత్వ శాఖలో జరిగిన అవినీతి వార్త అయితే సదరు ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం వుంటుంది. అసలు ప్రభుత్వ శాఖల నుంచి మనకి సమాచారం ఎలా అందుతుంది? ఎవరు ఇస్తారు? ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఏ విధంగా చోటుచేసుకుంటుంది? ప్రభుత్వ శాఖల్లో ప్రజలకు సేవ చేసేవారు ఉంటారా? అలా ఉంటే వారికోసం ఏ విధమైన వార్త కధనాలు రాయాలి? ఎలా రాస్తే మనం అనుకున్న సమాచారం మనకి అందుతుంది? అది ప్రభుత్వశాఖల్లోని సిబ్బంది, అధికారుల ద్వారా ఎలా వైరల్ అవుతుంది? తదితర అంశాలను రేపటి పాఠంలో చర్చిద్దాం.. ఔత్సాహిక యువత జరలిస్టులుగా తమ కెరీర్ మీడియాలో ప్రారంభించాలనుకునే వారికి, నిరుపేద విద్యార్ధులకు, డబ్బు ఖర్చుచేసి జర్నలిజంలో శిక్షణ పొందలేని వారికి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా మరియు www.ensliv.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా ఉచితంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఆన్ లైన్ పాఠాలను ప్రారంభించింది. జర్నలిజం కోసం ఉచితంగా అన్ని అంశాలపై పాఠాలు పూర్తయిన తరువాత ఉచితంగానే వెబినార్ల ద్వారా లైవ్ గా శిక్షణ ఇవ్వాలని కూడా సంకల్పించాం. దానికోసం జర్నలిజం పట్ల ఆశక్తి ఉన్నవారు ఎవరైనా ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ఈ పాఠాలన్నీ ఉచితంగానే చూసే వీలుంది. వెంటనే యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఉచిత పాఠ్యాంశాలు చదివి అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాం. అంతేకాదు బాగా అవగాహన పెంచుకున్న వారికి నేరుగా లైవ్ లో శిక్షణ ఇవ్వడానికి కూడా ఈఎన్ఎస్ లైవ్ యాప్ సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఔత్సాహికులు గుర్తించాలి. ఈ ట్రైనింగ్ ఎపిసోడ్ లో బాగా అన్ని అంశాలపై శిక్షణ తీసుకున్నవారు, ఆశక్తి పెంచుకున్నవారు జర్నలిస్టులుగా మారడానికి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా అవకాశం కల్పిస్తాం. ఒక వార్తను న్యూస్ ఫార్మాట్ లో ఏ విధంగా రాయాలో కూడా శిక్షణ ఇస్తాం. మంచి జర్నలిస్టులుగా తీర్చిదిద్దుతాం. భారతదేశానికి వైద్యులు, ఇంజనీర్లు, మేధావులు, ప్రభుత్వాలు ఎంత అవసరమో...వాస్తవాలను వెలికి తీసే మంచి జర్నలిస్టుల అవసరం నానాటికీ పెరుగుతూ వస్తుంది. ఆ లోటును భర్తీచేయడానికి మీరూ ముందుకి రావాలనుకుంటే ఈఎన్ఎస్ లైవ్ యాప్ తో చేతులు కలపండి. మంచి జర్నిలిస్టుగా కెరీర్ ప్రారంభించి దేశానికి మీవంతు సహాయం అందించండి..!