జర్నలిస్టు కావాలంటే ఏం తెలియా(రావా)లి..?-8
Ens Balu
2
Visakhapatnam
2021-02-05 11:03:42
మీడియారంలో జర్నలిస్టుగా కెరీర్ పదిలంగా ఉండేలా చూసుకోవునే వారికి పర్శనల్ రిలేషన్స్ చాలా బాగా వుండాలి. అలా ఏ జర్నలిస్టు అయితే ఆ తరహా సత్సంబంధాలు అన్ని వర్గాల ప్రజలతోపాటు, ప్రభుత్వ అధికారులతోనూ జర్నలిస్టు అనేవాడు మెయింటేన్ చేయాలి. అలా చేయాలంటే ఏంచేయాలనే ప్రశ్న జర్నలిస్టు అయిన ప్రతీ ఒక్కరికీ మదిలో తొలిచేస్తూ వుంటుంది. మనం ఏ ప్రాంతంలో అయితే పనిచేస్తున్నామో, లేదంటే ఏ ప్రభుత్వ శాఖలపై మనం వార్తలు రాస్తుంటామో సంబంధిత అధికారులతో మంచి పరిచియాలు వుండాలి. ఆయా శాఖలకు సంబంధించిన ప్రతీ అంశాన్నీ ముందుగా మనమే వార్తల్లా రాస్తుండాలి. చేసిన పనుల్లో తేడాలు వచ్చినా, అలసత్వం ప్రదర్శించినా, తక్కు పనిచేసి ఎక్కువడా చూపుకున్నట్టు ప్రయత్నాలు చేసినా, అసలు చేయకుండా చేసినట్టు కాగితాలపై లెక్కలు చూపాలని ప్రయత్నం చేసినా వాటిని కూడా ఆధారాలతో అటు ప్రభుత్వానికి ఇటు పాఠకులకు కళ్లకు కట్టేలా మంచి వార్తా కధనాలు రాయాలి. అంతేకాకుండా ఆయా ప్రభుత్వశాఖల్లో చేయబోయే పనులను ప్రత్యేక కథనాలుగా రాయడానికి ప్రయత్నం చేయాలి. మధ్య మధ్యలో మంచి అధికారులు, విధినిర్వహణలో సేవా భావంతో పనిచేసే అధికారులపై స్పూర్తిదాయకమైన కధనాలు, డిఫరెంట్ స్టోరీలు రాస్తుండాలి. అలా మంచి మంచి కధనాలు రాయడం ద్వారా ఆయాశాఖల అధికారులు మనల్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. అదే సమయంలో జరుగుతున్న అవినీతిపైనా, ఉద్యోగం పేరుతో వివిధ పనులపై తరచూ బయటకు వెళ్లపోవాలని చూసే అధికారులను, సిబ్బందిని ఓ కంట కనిపెడుతూ అప్పుడప్పుడు చురకలు అంటించే విధంగా ఆధారాలతో పాటు వార్తలు రాస్తుండాలి. అలా రాయడం ద్వారా జర్నలిస్టులంటే మంచి గౌరవంతోపాటు, అ విలేఖరికి తెలిస్తే తేడా వ్యవహారాలను కూడా తడుముకోకుండా రాసేస్తారాయన అనే విధంగా మనం వ్యవహరించాలి. అలా చేయడం ద్వారా సమాజంలో మనం మంచి జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకోవడాని వీలుపడుతుంది. అవికూడా తరచుగా ఆయాశాఖల కోసం రాస్తూనే ఉండాల్సి వస్తుంది. లేదంటే మనల్ని అధికారులు కూడా మరిచిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. చాలా మంది జర్నలిస్టులు అవసరం వుంటే తప్పా అధికారులతో మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ మనకి అవసరం వున్నా, లేకపోయినా అధికారులతో ఏదో ఒక విషయంలో మాట్లాడుతుండటం వంటివి చేస్తుండాలి. అలా చేయడం ద్వారా సదరు అధికారులు జర్నలిస్టులను గుర్తుంచుకోవడానికి వీలుంటుంది. మనం ఏ జిల్లాలో పనిచేసినా మనం చూసే ప్రభుత్వశాఖలు, రాజకీయపార్టీల నాయకులు, అటెండరు దగ్గర నుంచి ఐఏఎస్ అధికారుల వరకూ మనల్ని గుర్తుంచుకోవాలంటే మనం ఏవిధంగా వారితో వ్యవహరించాలి, ఏ విధమైన వార్త కధనాలు రాయాలి, ఏ తరహా అభివ్రుద్ధి కార్యక్రమాలను, చేయబోయే పనులను, చేసిన పనులకు అధికారులకు వచ్చే గుర్తింపు ఒక జర్నలిస్టు ఏవిధంగా మంచి కధనాలు రాస్తే సదరు అధికారులకు ఆ జర్నలిస్టు చిరస్థాయిగా గుర్తుంటాడు తదితర విషయాలు రేపటి పాఠంలో చర్చిద్ధాం.. ఔత్సాహిక యువత జరలిస్టులుగా తమ కెరీర్ మీడియాలో ప్రారంభించాలనుకునే వారికి, నిరుపేద విద్యార్ధులకు, డబ్బు ఖర్చుచేసి జర్నలిజంలో శిక్షణ పొందలేని వారికి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా మరియు www.ensliv.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా ఉచితంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఆన్ లైన్ పాఠాలను ప్రారంభించింది. జర్నలిజం కోసం ఉచితంగా అన్ని అంశాలపై పాఠాలు పూర్తయిన తరువాత ఉచితంగానే వెబినార్ల ద్వారా లైవ్ గా శిక్షణ ఇవ్వాలని కూడా సంకల్పించాం. దానికోసం జర్నలిజం పట్ల ఆశక్తి ఉన్నవారు ఎవరైనా ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ఈ పాఠాలన్నీ ఉచితంగానే చూసే వీలుంది. వెంటనే యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఉచిత పాఠ్యాంశాలు చదివి అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాం. అంతేకాదు బాగా అవగాహన పెంచుకున్న వారికి నేరుగా లైవ్ లో శిక్షణ ఇవ్వడానికి కూడా ఈఎన్ఎస్ లైవ్ యాప్ సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఔత్సాహికులు గుర్తించాలి. ఈ ట్రైనింగ్ ఎపిసోడ్ లో బాగా అన్ని అంశాలపై శిక్షణ తీసుకున్నవారు, ఆశక్తి పెంచుకున్నవారు జర్నలిస్టులుగా మారడానికి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా అవకాశం కల్పిస్తాం. ఒక వార్తను న్యూస్ ఫార్మాట్ లో ఏ విధంగా రాయాలో కూడా శిక్షణ ఇస్తాం. మంచి జర్నలిస్టులుగా తీర్చిదిద్దుతాం. భారతదేశానికి వైద్యులు, ఇంజనీర్లు, మేధావులు, ప్రభుత్వాలు ఎంత అవసరమో...వాస్తవాలను వెలికి తీసే మంచి జర్నలిస్టుల అవసరం నానాటికీ పెరుగుతూ వస్తుంది. ఆ లోటును భర్తీచేయడానికి మీరూ ముందుకి రావాలనుకుంటే ఈఎన్ఎస్ లైవ్ యాప్ తో చేతులు కలపండి. మంచి జర్నిలిస్టుగా కెరీర్ ప్రారంభించి దేశానికి మీవంతు సహాయం అందించండి..!