ప్రభుత్వాన్ని కదిలించిన ఈఎన్ఎస్ కథనం..
Ens Balu
2
Visakhapatnam
2021-02-06 14:46:00
ఆంధ్రప్రదేశ్ లోపంచాయతీ ఎన్నికల పోరులో వార్తలను కవర్ చేసే అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చే కవరేజీ పాసుల విషయంపై ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక యాప్ ఈఎన్ఎస్ లైవ్ ప్రచురించిన ప్రత్యేక కథనంపై ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించాయి. గాల్లో జర్నలిస్టుల ఎలక్షన్ కమిషన్ పాసులు శీర్షికన వచ్చిన న్యూస్ కార్డ్ అంశం ఎన్నికల కమిషన్ వరకూ చేరడంతో, కాలం చెల్లిన అక్రిడిటేషన్ల ఆధారంగానే ఎలక్షన్ కమిషన్ పాసులు జారీచేయాలని ప్రభుత్వం సమాచారశాఖకు ఆదేశాలిచ్చింది.. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల డిపీఆర్వోలకు ఆదేశాలు జారీచేసింది. దీనితో జర్నలిస్టుల వివరాలు సమాచారశాఖ సేకరిస్తోంది. స్టేట్ రిపోర్టర్లకు జిల్లా పాసులు, మండల విలేకరులకు మండలస్థాయి ఎలక్షన్ కమిషన్ పాసులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఎన్నికల వార్తలను కవర్ చేయడానికి అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు మాత్రమే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం పాసులు జారీచేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లోని వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కాలపరిమితి తీరిపోయి 2021వ సంవత్సరంలో రెండవ నెల వచ్చినా నేటికీ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయలేదు. దీనితో ఎన్నికల వార్తలు కవర్ చేసే జర్నలిస్టులకు ఎలక్షన్ కమిషన్ పాసుల విషయమై సందిగ్దత ఏర్పడింది. అదే సమయంలో జర్నలిస్టుల సమస్యలను, అక్రిడిటేషన్ లేకపోతే ఎలక్షన్ కమిషన్ పాసులు రావనే విషయాన్ని ప్రత్యేక కథనం ద్వారా ఈఎన్ఎస్ లైవ్ న్యూస్ యాప్ ద్వారా న్యూస్ కార్డు ప్రచురించింది. దీంతో ఈ విషయాన్ని అన్నిజిల్లాల రిటర్నింగ్ అధికారులు ప్రభుత్వ ద్రుష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం స్పందించి. అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు ఎలక్షన్ కమిషన్ పాసులు జారీ చేయాలని నిర్ణయించి ఆ మేరకు పాలసును సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికల కమిషన్ పాసులు లేకపోతే ఎన్నికల ప్రక్రియ, ఓట్ల లెక్కింపును జర్నలిస్టులు కవర్ చేయడానికి గానీ, అక్కడ జరిగే విషయాలను తెలుసుకోవడానికి గానీ వీలుపడదు. అదే సమయంలో ఎన్నికల సిబ్బంది కూడా పోలింగ్ స్టేషన్ల దగ్గరకు రానీయరు సరికదా, జర్నలిస్టులని కూడా చూడకుండా పోలీసులు చాలా దారుణంగా వ్యవహరిస్తారు. వర్కింగ్ అక్రిడేటెడ్ జర్నలిస్టుల విధులకు ఎక్కడా ఆటంకం రాకుండా ప్రభుత్వమే ఎలక్షన్ కమిషన్ పాసులను మంజూరు చేయాలని నిర్ణయించడం విశేషం. ప్రభుత్వానికి సంబందించిన విషయాలను కవర్ చేసే జర్నలిస్టులకు, ప్రాధాన్యతను గుర్తించి కొత్త అక్రిడిటేషన్లు ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.