బర్డ్ ట్రస్టుకు రూ. 5 లక్షలు విరాళం..
Ens Balu
0
Tirumala
2021-02-06 14:58:15
తిరుమలలోని గుబ్బా సత్రం 33వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గుబ్బా ట్రస్టు ఛైర్మన్ అశ్వనీకుమార్, మేనేజింగ్ ట్రస్టీ జీవన్‌కుమార్ శనివారం బర్డ్ ట్రస్టుకు రూ.5 లక్షల విరాళాన్ని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డికి అందించారు. అనంతరం సత్రం వార్షికోత్సవానికి టిటిడి ఛైర్మన్‌ను ఆహ్వానించారు. సత్రంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బర్డ్ ట్రస్టుకు తమవంతుగా విరాళం అందించడం ఆనందంగా వుందన్నారు. తిరుమల గిరులపై ఏ సహాయం చేసినా అది శ్రీవారికే చెందుతుందనే భావనతో ఈ మంచి కార్యక్రమానికి పూనుకున్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు చిప్పగిరి ప్రసాద్ పాల్గొన్నారు.