ఏపీలో ఫైబర్ నెట్ తో సామాజిక విప్లవం..
Ens Balu
1
Vijayawada
2021-02-06 18:46:36
ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ గ్రిడ్‌ను విస్తరించుట ద్వారా ప్రజలందరికీ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోనికి తీసుకువస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపియస్‌యఫ్‌యల్) ఛైర్మన్ పునూరి గౌతమ్‌రెడ్డి అన్నారు. విజయవాడ ఏపియస్ఆర్ టిసి అడ్మినిస్ట్రేటివ్ 3వ బ్లాక్‌లో గల ఏపియస్‌యఫ్‌యల్ కార్యాలయంలో శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా పునూరి గౌతమ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సర్వమత ప్రార్ధనల అనంతరం ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పునూరి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏఒక్కరూ ఇవ్వలేనివిధంగా ఏ.పి. ఫైబర్ నెట్ ద్వారా నాణ్యమైన ఇంటర్నెట్, కేబుల్ ప్రసారాలు ప్రజలకు అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపియస్‌యఫ్‌యల్) ఛైర్మన్ పునూరి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఫైబర్ గ్రిడ్‌ను విస్తరించుట ద్వారా రాష్ట్రంలో 660 మండలాల్లో, 6300 గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఫైబర్ నెట్ సేవలను తీసుకువచ్చామని దీనిలో భాగంగా త్రిపుల్ ప్లే సర్వీసెస్ అందిస్తున్నామని, రూ. 599/- లకే అన్‌లిమిటెడ్ ప్లాన్‌తో కేబుల్ కనెక్షన్, ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యం అందిస్తున్నామని గౌతమ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామానికీ ఇంటర్నెట్ సౌకర్యం అందాలనే ఉద్ధేశ్యంతో ప్రతీగ్రామంలోనూ ఇంటర్నెట్ పార్క్‌లను ఏర్పాటుచేస్తున్నామని ఆయన అన్నారు. మారుమూల గిరిజన గ్రామాలకు సైతం ఫైబర్ నెట్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్, టివి, టెలిఫోన్ సర్వీసులు అందిస్తున్నామని ఇప్పటివరకు ఐటిడిఏ పాడేరు, ఐటిడిఏ రంపచోడవరం పరిధిలో రిమోట్ గిరిజన గ్రామాలకు సైతం ఫైబర్ నెట్ సేవలు అందించామని ఆయన అన్నారు. ఫైబర్ నెట్‌కు ప్రజల నుండి మంచి ఆదరణ ఉన్నదని, రాష్ట్రంలో ఇప్పటికే 10 లక్షల కేబుల్, ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్షన్లు పనిచేస్తున్నవని ఆయన అన్నారు. విద్యార్ధులకు ప్రభుత్వం ఇప్పటికే ల్యాప్‌టాప్‌లను అందించిందని, ఫైబర్ గ్రిడ్ ద్వారా విద్యార్ధులకు ఉచితంగా ఇంటర్నెట్ అందిస్తామని ఆయన అన్నారు. కేబుల్, ఇంటర్నెట్, టెలిఫోన్ ప్రజలకు విడిగా అందించడానికి కూడా చర్యలు తీసుకున్నామని అన్నారు. రూ. 499/- లకే అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ అందిస్తున్నామని, రూ. 300/- లకే కేబుల్ కనెక్షన్ అందిస్తామని, రూ. 99/- లకే టెలిఫోన్ ల్యాండ్ కనెక్షన్‌ను అందిస్తున్నామని గౌతమ్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం, రాబోయే తరాలకు కూడా ఇంటర్నెట్ అవసరం ఎ ంతో ఉందని దీన్ని దృష్టిలోపెట్టుకుని రానున్న రోజుల్లో ఫైబర్ గ్రిడ్‌ను మరింత విస్తరించి సులభతరమైన సేవలను ప్రజలకు అందుబాటులోనికి తీసుకువస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏపి ఫైబర్ నెట్ ద్వారా సాంకేతిక విప్లవం మొదలైందని గ్రామగ్రామాన ఫైబర్ గ్రిడ్ ద్వారా సేవలు అందిస్తున్నామని గౌతమ్‌రెడ్డి అన్నారు. గ్రామ, మండల స్ధాయిలో అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేస్తున్నామని, త్వరలో క్రొత్త సెట్ టాప్ బాక్స్‌లు తీసుకువస్తున్నామని గౌతమ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రానున్న 3 సంవత్సరాల్లో ఫైబర్ నెట్ ద్వారా 70 లక్షల కుటుంబాలకు ఇంటర్నెట్ సౌకర్యం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని గౌతమ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సాంకేతిక సామాజిక విప్లవానికి నాందిపలికిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆశయాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్ధ నెట్ వర్క్ సేవలను మరింత పటిష్టపరిచి, రాష్ట్రంలో ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా డిజిటల్ సేవలను అందించేవిధంగా ఈసంస్ధను తీర్చిదిద్దుతున్నామని ఛైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఫైబర్ నెట్ సర్వీస్‌లను నిర్వీర్యం చేసిందని, గత ప్రభుత్వం చేసిన అవినీతిని కూడా వెలికితీస్తామని, సిబిఐ విచారణ చేస్తున్నదని, అవినీతికి పాల్పడిన ఏఒక్కరినీ ప్రభుత్వం వదలబోదని గౌతమ్‌రెడ్డి అన్నారు. ఈసమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ యండి యం. మధుసూధనరెడ్డి, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.