పరిశోధన, సాహిత్యాలకు ప్రాధాన్యం..
Ens Balu
3
Andhra University
2021-02-06 19:06:25
తెలుగు భాష, సాహిత్యాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలుగు అకాడమి చైర్‌పర్సన్ ఎన్.లక్ష్మీపార్వతి అన్నారు. శనివారం ఉదయం ఆమె ఏయూ తెలుగు విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ముందుగా తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పరిశోధనల్లో నాణ్యత, ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రాచీన సాహిత్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలుగు అకాడమి ఆధ్వర్యంలో పరిశోధనలు నిర్వహించే విధంగా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ విశిష్ట పరిశోధనలు జరపాలని తెలిపారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ప్రిన్సిపాల్ ఆచార్య పి.రాజేంద్ర కర్మార్కర్, తెలుగు విభాగాధిపతి ఆచార్య జర్రా అప్పారావు, విశ్రాంత ఆచార్యులు యోహాన్ బాబు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీపార్వతిని విభాగం తరపున సత్కరించారు.