చిత్తూరులో రాష్ట్రపతికి ఘన స్వాగతం..
Ens Balu
2
Tirupati
2021-02-07 14:14:13
చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రపతి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హెలికాఫ్టర్ ద్వారా మదనపల్లెకి సమీపంలోని చిప్పిలిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మదననపల్లెలోని సత్‌సంగ్ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ సత్‌సంగ్ ఆశ్రమం, శంకుస్థాపన, భారత యోగా విద్యా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది..