ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రవాహం..


Ens Balu
2
Velagapudi
2021-02-15 12:50:18

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రవాహం కొనసాగుతుంది..గత ప్రభుత్వంలో జరగని స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్ల ఎన్నికలు నిర్వహించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం యమ స్పీడుతో ఉంది. తొలుతగా గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల ఎన్నికలను పూర్తి చేస్తున్న ప్రభుత్వం, ఎన్నికల సంఘం తరువాత మండల పరిషత్ లు, జిల్లా పరిషత్ లు నిర్ణయానికి వచ్చింది. ఆపై మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లకు కూడా ఇదే గెలుపు ప్రవాహంలోనే నిర్వహించాలని భావిస్తోంది. కరోనా వలన చాలా కాలం ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం నిరాకరించినా తరువాత మాత్రం అన్నింటికి ఓకేసారి ఎన్నికలు నిర్వహించి రికార్డు స్రుష్టించే పనిలో వుంది. ఇప్పటికే తొలి రెండు విడదల ఎన్నికల్లో భారీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇపుడు అదే జోష్ తో అన్ని ప్రాంతాల్లోనూ ఎన్నికలు ఏర్పాటు చేసి ప్రజల్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి కార్యాచరణ రూపొందించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. టిడిపి అధికారంలో ఉన్న సమయంలో చాలా కార్పోరేషన్లకు చైర్మన్లను నియమించని అప్పటి ప్రభుత్వానికి ధీటుగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చాలా కార్పోరేషన్లకు చైర్మన్లను, డైరెక్టర్లను నియమించి ఫుల్ జోష్ ఎన్నికలను నిర్వహిస్తోంది. ఇదే సమయంలో అన్నింటికి ఎన్నికలు నిర్వహించేస్తే..ఓ పనైపోతుందని భావించిన ప్రభుత్వం...ఎన్నికల ప్రవాహాన్ని కొనిసాగించేయడం విశేషం.