శారదాపీఠంలో సీఎం ప్రత్యేక పూజలు..


Ens Balu
2
Pendurthi
2021-02-17 17:07:53

విశాఖలోని పెందుర్తి శ్రీ శారదా పీఠం వార్షికోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. బుధవారం పెందుర్తి చేరుకున్న సీఎం వైఎస్ జగన్, పీఠంలోని అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పీఠంలోని ఆచార్యులలు సీఎంకీ ఆశీర్వచనం అందించారు. అనంతరం ఇక్కడ విద్యాబ్యాసం చేస్తున్న చిన్నారులతో సీఎం ముచ్చటించారు. పీఠం మరింత అభివ్రుద్ధి చెందాలని, అమ్మవారి దయ ఈ విశాఖ ప్రజలపై ఉండాలని, రాష్ట్రం శుభిక్షింగా ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా పీఠాదిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మనాందేంద్ర సరస్వతిలు స్వయంగా సీఎంకి స్వాగతం పలికి అమ్మవారి తీర్ధ ప్రశాదాలను అందజేశారు. సీఎం రాక సందర్భంగా పెందుర్తిలో  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు పోలీసులు. సీఎంతోపాటు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు, విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ ఇతర నాయకులు పాల్గొన్నారు.