గ్రామసచివాలయాల్లో మళ్లీ ఖాళీలు..


Ens Balu
2
Tadepalle
2021-02-18 12:53:09

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ఏర్పాటు చేసిన గ్రామసచివాలయ వ్యవస్థలో నియమించిన ఒక లక్షా 34వేల ఉద్యోగాల్లో కొన్ని శాఖల్లో పోస్టులు నేటికీ భర్తీ కాలేదు.. కొంత మంది చేస్తున్న ఉద్యోగాలను వదిలి కొత్త ఉద్యోగాలకు వెళ్లిపోయారు. దీనితో చాలా విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీ అయపోయాయి.. దీనితో ప్రభుత్వం ఆ ఖాళీలను ఎలా భర్తీ చేయాలనేదానిపై కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా గ్రామసచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్లు, సెరీ కల్చర్, హార్టి కల్చర్ అసిస్టెంట్లు ఉద్యోగాలు రెండు దఫాలుగా నోటిఫికేషన్లు ఇచ్చినా భర్తీ కాలేదు. దీనితో ఖాళీగా వున్న ఉద్యోగాలను ఆయా పోస్టుల సమాన క్వాలిఫికేషన్ ఉన్న వారికి ఇవ్వాలా, లేదంటే ఖాళీ అయిపోయిన అన్ని రకాల పోస్టుల కోసం మరోసారి నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్హతలు, పోస్టుల విషయంలో మార్పులు చేర్పులు చేయాలనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సివుంది. లేదంటే చాలా విభాగాల్లోని ఖాళీలు భర్తీ అయ్యే పరిస్థితి లేదు. అంతేకాకుండా గ్రామసచివాలయ కార్యదర్శిలుగా ఉద్యోగాలు వచ్చిన వారు రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ గ్రేడ్ 4 కార్యదర్శి ఉద్యోగాలకు కూడా ఎంపికయ్యారు. అలాంటి వారంతా సచివాలయ ఉద్యోగాలకు రిజైన్ చేసి వారు ముందుగా రాసిన ఉద్యోగాల్లోకి వెళ్లిపోయారు. మరికొందరు డిఎస్సీలో టీచర్ ఉద్యోగాలకు, మరికొంత మంది బ్యాంకు ఉద్యోగాలకు చేస్తున్న ఉద్యోగాలకు రిజైన్ చేసి వెళ్లిపోయారు. అలా అన్ని విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయనే సమాచారాన్ని సేకరిస్తున్న ప్రభుత్వం వారికోసం మరోసారి నోటఫికేషన్ ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం. అలా జరిగితే చాలా సమయం పడుతుందని, అలా కాకుండా ఆయా పోస్టుల క్వాలిఫికేషన్ కు తగ్గట్టుగా వచ్చిన మార్కులు ఆధారంగా వెయింటింట్ లిస్టులో ఉన్నవారికి మిగిలిపోయిన ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉన్నతాధికారులు చేస్తున్నారట. కానీ ఏ విషయంలో క్లారిటీ లేదు. ఇదే సమయంలో గ్రామసచివాలయ వ్యవస్థకు ఇటీవలే ఒక కమిషనరేట్ ను ప్రారంభించిన ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగుల ప్రొహిబిషన్ పూర్తవుతున్నందున వారికి విధి విధానాలు రూపొందించడానికి అధికారులు ఈరోజు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఖాళీల భర్తీ, ఉద్యోగుల రెగ్యులరైజేషన్, మిగిలి పోయిన పోస్టుల భర్తీ, కొత్త నోటిఫికేషన్ తదితర అంశాలపై ఒక క్లారిటీ రానుంది.