ఫేస్ ‘బుక్కు‘ వుతున్నారు..


Ens Balu
2
Tadepalle
2021-02-21 14:24:54

ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ సోషల్ మీడియా తన ఉనికిని కొద్దికొద్దిగా కోల్పోవలసి వుస్తుంది. ఈ కోవకె చెందినది సోషల్ మీడియా  దిగ్గజం ఫేస్ బుక్ పై నమ్మకం తగ్గించే దిశగా కొందరు దుండగలు అదేపనిగా అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. వారి పేర్లతోనూ ఫోటోలతోనే నకిలీ అకౌంట్లను క్రియేట్ చేసి అక్రమ సంపాదనకు తెరతీస్తున్నారు. మొదట్లో కొందరు ఈ హ్యాకర్ల మాటలు నమ్మి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినా..అదే పనిగా చాలా మంది అకౌంట్లు ప్రతినిత్యం హ్యాకర్లు హ్యాక్ చేస్తుండటంతో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. అయినా ఫేస్ బుక్ ఈ హ్యాకింగ్ ని నియంత్రించలేకపోతుంది. ఈ హ్యాకర్లు ముఖ్యంగా జర్నలిస్టులు, మహిళలు, సంఘంలో కాస్త పలుకుబడి వున్నవారి అకౌంట్లనే హ్యాక్ చేయడం విశేషం. ఈ హ్యాకింగ్ కి ఎక్కడో ఒక చోట పులుస్టాప్ పడుతుందని భావిస్తున్నప్పటికీ హ్యాకర్లు వారి పని వారు చేసుకుంటూనే పోతున్నారు. తద్వారా చాలా మందికి చెందిన సమాచారం, ఫోటోలను డౌన్ లోడ్ చేసి మార్ఫింగ్ చేసి కొందరు బెదిరింపులకు కూడా దిగుతున్నారు. దీనితో చాలా మంది మహిళలే కాకుండా, పురుషులు కూడా తమ ప్రొఫైల్ ను లాక్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ హ్యాకింగ్ మాత్రం ఆగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ కి ఆదరణ ఉన్నప్పటికీ, ఇందులో వున్నవారి ఖాతాలకు రక్షణ లేకుండా పోతుంది. ఈ విషయంలో ఫేస్ బుక్ నిర్వాహకులు కూడా ఎన్నో రక్షణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ హ్యాకర్లు వారికంటే తెలివిగా అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారంటే టెక్నాలజీ ఏ స్థాయిలో అభివ్రుద్ధి చెందిందో అర్ధం చేసుకోవచ్చు. సాఫ్ట్ వేర్ రంగంలో హ్యాకింగ్ కి వున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. చాలా మంది తెలివైనవారు ఈ హ్యాకింగ్ ను దేశ అభివ్రుద్ధికి కాకుండా దేశవినాశనానికి వినియగించడం ఇపుడు అందరినీ ఆందోలనకు గురి చేస్తుంది. ఒక మంచి విషయం పంచుకుందామని సోషల్ మీడియా వేదికలో ఖాతా తెరిస్తే అదే వివరాలు, ఫోటోలతో మరో నకిలీ ఖాతా వెంటనే క్రియేట్ అవుతుంది. స్నేహాలు, బంధాలు, పరిచియాలను అడ్డం పెట్టుకొని హ్యాకర్లు అక్రమ, అడ్డదారి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా సోషల్ మీడియా దిగ్గజం తన ఫేస్ బుక్ లోని ఖాతాదారులను కాపాడుకోకపోతే చాలా ముఖ్య మైన సమాచారం హ్యాకింగ్ కి గురవడంతోపాటు, ఫేస్ బుక్ నుంచి హ్యాకింగ్ గురైన వారు ఒక్కొక్కరుగా ఫేస్ బుక్ ని వీడే ప్రమాదాలు లేకపోలేదు. ఈ విషయంలో ఫేస్ బుక్ నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.