ఆ ఉద్యోగులు ఏశాఖకి చెందినవారో..
Ens Balu
3
Tadepalle
2021-02-22 10:20:43
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలో కొన్నిశాఖ సిబ్బంది తాము ఏశాఖకి చెందిన ఉద్యోగులమో తెలియ తికమక పడుతున్నారు(రెండు మూడు శాఖలకు చెందిన విధులు నిర్వహిస్తుండటంతో). ఉద్యోగం పొందినది ఒక శాఖ నుంచి అయితే వారు చేస్తున్నది రెండు మూడు ప్రభుత్వ శాఖలకు చెందిన సేవలు అందిస్తుండటంతో వారు ఏశాఖ తమకు మాత్రుశాఖ అవుతుందో..వారికి తరువాత ఏశాఖ నుంచి పదోన్నతులు వస్తాయో తెలియని పరిస్థి నెలకొంది. దీనితో ఈ గ్రామసచివాలయ శాఖలో వివిధ శాఖల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఒకే శాఖ ఉద్యోగులుగా గుర్తించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. దానికోసం వారి శాఖల్లో సమూల మార్పులు తీసుకురావాలని యోచిస్తుంది. ఇప్పటికే ఈ శాఖకు సెక్రటేరియట్ లో ఒక కమిషనరేట్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇపుడు సచివాలయాల్లో పనిచేస్తున్న 14శాఖల సిబ్బందిని ఆయా శాఖలకు ఎండార్స్ చేయనుంది. ఇప్పటి వరకూ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీష్, వెటర్నరీ, వీఆర్వో, కార్యదర్శిలకు మాత్రమే ఆయా ప్రభుత్వ శాఖలు మాత్రుశాఖలు గా ఉన్నాయి. వీరిలో ప్రధానంగా ఉన్న మహిళా సంరక్షణా కార్యదర్శిలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్, ఇక నగరాల్లో శానిటేషన్ అసిస్టెంట్లు తదితరులకు ఇప్పటి వరకూ ఏ శాఖకు వీరిని అటాచ్ చేస్తున్నారో ప్రభుత్వం నిర్ధేశించలేదు(అపాయింట్ మెంట్లు ఒక శాఖ నుంచి అత్యధిక విధులు మరో ప్రభుత్వ శాఖలకు చెందినవిగా ఉన్నాయి). ఉదాహరణకు తీసుకుంటే మహిళా సంరక్షణా కార్యదర్శిలు వీరికి ఉద్యోగాలు హోం డిపార్ట్ మెంట్ నుంచి ఇచ్చినా, వీరి విధులు అధికంగా ఐసీడిఎస్ మరియు ఆరోగ్యశాఖకు చెందినవి వుంటున్నాయి. గ్రామ శాంతి భద్రతలు, కేసులు, ఇతరత్రావి చాలా తక్కువగా వుంటున్నాయి. అదే విధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లను తీసుకుంటే వీరికి ఇంజనీరింగ్ విభాగం నుంచి వీరికి ఉద్యోగాలు కల్పించినా అన్ని రకాల ఇంజనీరింగ్ శాఖల పనులూ వీరు చేయాల్సి వస్తుంది( పీఆర్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, గ్రామస్థాయిలో శానిటేషన్, ఎలక్ట్రిసిటీ, పబ్లింగ్ తదితర) పనులన్నీ వీరు చేయాల్సి, చూడాల్సి వస్తుంది. వీరికి ఒక డిపార్ట్ మెంట్ అంటూ లేదు. ఇక డిజిటల్ అసిస్టెంట్లు ఇటు కార్యాలయ పనులతోపాటు, మీసేవా సర్వీసులన్నీ సచివాలయాల్లో చేస్తున్నారు. వీరికి ఏ శాఖ కేటాయించారో ఇంకా క్లారిటీ రాలేదు. అదే విధంగా చూసుకుంటే ఎడ్యుకేషన్ అండ్ వెల్పేర్ అసిస్టెంట్లు వీరిని అటు విద్యాశాఖకు, ఇటు వెల్పేర్ శాఖకు కాకు మధ్యలో ఉంచారు. అదేవిధంగా నగరాల్లో శానిటేషన్ అసిస్టెంట్లు, లేదా కార్యదర్శిలు వీరు కూడా అటు వైద్య ఆరోగ్యశాఖకు లేదా పురపాలక శాఖకు ఏ శాఖకు చెందిన ఉద్యోగులో కూడా తెలియడంలేదు. ఇలా గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని సిబ్బందికి తమ మాత్రుశాఖ ఏమిటో, వీరికి రేపు పొద్దున్న పదోన్నతులు ఏశాఖ నుంచి వస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీనితో ప్రభుత్వం ఈ శాఖ ఉద్యోగులను పని అధికంగా ఏ డిపార్డుమెంటుకి చెందినదిగా ఉందో వారిని గుర్తించి వారికి సదరు శాఖలోనే పదోన్నతులు కల్పించాలిని, ఇతరత్రా సదుపాయాలు ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఈశాఖకు చెందిన ముఖ్యకార్యదర్శి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా శాఖలకు చెందిన అంశాలు చర్చచి వచ్చినట్టు తెలుస్తుంది. దీనితో ఉద్యోగులు తికమక పడకుండా వారికి అపాయింట్ మెంట్లు ఇచ్చిన ప్రభుత్వ శాఖలే వారికి మాత్రుశాఖలుగా ఉంటాయని, ఆవిధంగానే వారికి పదోన్నతులు కూడా కల్పించాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం అయితే కొన్ని శాఖల కార్యదర్శిలు దానికి విముఖత చూపినట్టుగా తెలుస్తుంది. రెండు మూడు శాఖలకు చెందిన విధులు నిర్వహిస్తున్నప్పుడు వారికి ఏ శాఖకు కేటాయిస్తున్నట్టో నిర్ధిష్టంగా తెలిసినపుడు మాత్రమే వారికి పదోన్నతులు, సర్వీసు రూల్సు వర్తింపచేయడానికి వీలుపడుతుందని లేదంటే రానున్న రోజల్లో ఇబ్బందులు తలత్తే సమ్యలు ఉత్పన్నం అవుతాయనే అనుమానాలను వ్యక్తం చేశారట. ఆ కారణంగా ముందు గ్రామసచివాలయ శాఖ ఉద్యోగులందరికీ సర్వీస్ రికార్డులు ప్రారంభించిన తరువాత వారికి అందిచాల్సిన సదుపాయాలను, సెలవులను, ఇతరత్రా అంశాలను పొందు పరచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం అందుతుంది. మార్చి 20 నాటికి గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులందరికీ సర్వీస్ రిజిస్టర్లు ఓపెన్ అయిన తరువాత ఈ అనుమానాలకు క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే ఆయా శాఖల ఉద్యోగులు చేస్తున్న సర్వీసుకి, అందుకున్న అపాయింట్ మెంట్లకి పొంతన లేకుండా ఉంటుంది. అలాంటి అనుమానాలన్నీ నివ్రుత్తి చేయడం కోసమే వీరికి సర్వీర్ రూల్సు వర్తింపజేయడం ద్వారా సమస్యను పరిష్కరించాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండు మూడు శాఖల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఎలాంటి క్లారిటీ ఇస్తుందో వేచిచూడాలి..!