ఎన్నికల అనంతరం కొత్తజిల్లాలేనా..
Ens Balu
1
తాడేపల్లి
2021-02-22 11:36:26
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా పూర్తిచేసింది. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తిచేయబోతుంది. ఈ ఊపులోనే కొత్త జిల్లాల ప్రక్రియ కూడా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోందట. దానికి అధికార వర్గాల నుంచి కూడా అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయాలని తొలుత యోచించినా అవి దానికి మరో మూడు జిల్లాలు ఆయా ప్రాంతాల సెంటిమెంటు ఆధారంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియకు ముందు ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాలు, రెవిన్యూ డివిజన్ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, సముదాయాలు ఇలా అన్నింటిని పరిశీలించి ఎక్కడ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే విషయమై ఒక నిర్ణయానికి వచ్చింది. ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్ధులు విజయఢంకా మోగించడంతో ఆ ఉత్సాహం, ఊపులో వున్న ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తే ఒక పనైపోతుందని భావిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నతరుణంలో కొత్త రాష్ట్రంలో కొత్త జిల్లాలు కూడా పూర్తయితే మిగతా రెండేళ్లు పూర్తిగా ప్రజా సంక్షేమం మీద ద్రుష్టి పెట్టాలని అధికార పార్టీ భావిస్తోంది. దానికి అనుగుణంగా ఒక్కోమెట్టూ ఎక్కుతూ అన్ని పనులూ పూర్తిచేస్తుంది. కొత్తజిల్లాల ఏర్పాటు వివిధ కార్పోరేషన్లకు చైర్మెన్లు, మార్కెట్ కమిటీలకు చైర్మన్లకు కూడా నియమిస్తే పదేళ్లుగా పనిచేసిన కేడర్ కి ఒక గుర్తిపంపు ఇచ్చినట్టు అవుతుందని ప్రభుత్వ బావన అసలే గత ప్రభుత్వంలో పంచాయతీ ఎన్నికలూ లేవు, వివిధ కార్పోరేషన్లకు చైర్మన్ పదవులూ లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరాశచెంది ఎన్నికల్లో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎక్కడో కొద్దిమేర అసమ్మతి, అసంత్రుప్తిలు వస్తూనే ఉన్నాయి. వీటన్నింటినీ అదిగమించాలంటే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే మరికొంత మంది నేతలకు పదవులు అందుతాయని కూడా పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. అన్నిపనులు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతూ ప్రజా సంక్షేమాన్ని కూడా పూర్తిచేస్తాయిలో చేపడితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చుననేది ప్రభుత్వ ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఎన్నికల హడావిడి మొత్తం పూర్తయితే కొత్త జిల్లా ల వ్యవహారం కూడా ఒక కొలిక్కి వస్తుంది. కొత్త జిల్లాలు ఏర్పడితే కొత్త నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, కొత్తగా ప్రైవేటు కంపెనీలు పెరిగి నిరుద్యోగం కూడా తగ్గుతుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే మే, జూన్ నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు ఖాయంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం కొత్త జిల్లాల విషయంలో తీసుకుంటో వేచి చూడాలి మరి..!