గ్రామసచివాలయంలో తేడాలపై ద్రుష్టి..


Ens Balu
2
Tadepalle
2021-02-23 10:48:42

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామసచివాలయ సేవలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లే కార్యక్రమానికి వైఎస్ జగన్ సర్కారు ఉపక్రమించింది. గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఉద్యోగులు, సిబ్బంది ఇప్పటి వరకూ ఆడుతూ పాడుతూ విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఇక అలాంటి విధులకు కాలం చెల్లినట్టే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 15వేల గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బయోమెట్రిక్ హాజరు దగ్గర నుంచి వారు చేపడుతున్న విధులు, ప్రజలకి అందిస్తున్న సేవలపై మండలాల వారీగా ప్రత్యేకంగా ద్రుష్టి కేంద్రీకరించాలని ప్రభుత్వం యోచిస్తుంది. దానికి గాను ఉద్యోగులకు నిర్ధేశించిన డ్యూటీ చార్టు ప్రకారంగా ఎంత మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎంత మంది ఉద్యోగులు నెలలో ఎన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు, అసలు వారికి ఇచ్చిన టూర్ డైరీలు, మూమెంట్ రిజిస్టర్ లలో సంతకాలు చేస్తున్నారా, సచివాలయాల్లో కార్యదర్శిలు ఎంత ఖర్చు చేస్తే, ఎంత మొత్తానికి బిల్లులు ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు తదితర అంశాలపై ప్రభుత్వం ద్రుష్టి సారిస్తుంది. కరోనా సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది సచివాలయ కార్యదర్శిలు బ్లీచింగ్, ఫినాయిల్, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాల కొనుగోలులో చేతివాటం ప్రదర్శించిన విషయం ప్రభుత్వం జిల్లాలు, మండలాలు వారిగా నివేదికలు తయారు చేసినట్టు సమాచారం అందుతుంది. అలా బిల్లుల్లో తేడాలు వచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శిలపైనే ఇపుడు మొత్తంగా నిఘా  ఉంచింది ప్రభుత్వం. అంతేకాకుండా ప్రజలకు సేవలు అందించాల్సిన సిబ్బందిని కార్యాలయాల్లోనే సమావేశాల పేరిట గంటలు గంటలు కూర్చోబెట్టే కార్యదర్శిల తీరుపైనా అసహనం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం, కార్యదర్శిలు కూడా గ్రామాల్లోని సమస్యలు గుర్తించేలా ప్రభుత్వం దిశా నిర్ధేశం చేయనుంది. మున్సిపల్ ఎన్నికల తరువాత గ్రామ, వార్డు సచివాయాలశాఖకు చెందిన జెసిలుకి ఖాళీ ఏర్పడటంతో ఇక గ్రామసచివాలయాల సిబ్బంది, అధికారులపైనే పూర్తిస్థాయిలో ద్రుష్టి సారించి తేడా సిబ్బందిని తప్పించే పనికి ఉపక్రమిస్తుందని విశ్వసనీయవర్గాల సమాచారం. దానికి కారణం కూడా లేకపోలేదు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు అయి సుమారు 18నెలలు కావస్తున్నా చాలా మంది సిబ్బందికి ప్రభుత్వం నిర్ధేశించిన ఆయా శాఖల డ్యూటీ చార్టు ప్రకారం విధులు నిర్వహించడం లేదు. సమస్యల పరిష్కారంలో కూడా చొరవ చూపకపోవడంతో ఈ శాఖను పూర్తిగా గాడిలో పెట్టాలంటే జెసి స్థాయి అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా సచివాలయాల్లోని తేడాలను గుర్తించడం ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుందని భావించిన ప్రభుత్వం ఆదిశగా చర్యలు చేపట్టనుంది. అదే జరిగితే ఆడుతూ, పాడుతూ పనిచేసే గ్రామ సచివాలయ ఉద్యోగుల తేడా విధులకు కాలం చెల్లినట్టే. ప్రజల ఇంటి ముంగిట సేవలు అందించాలని భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఈ గ్రామసచివాలయ వ్యవస్థకు సిబ్బందే నీరు గార్చుతున్న విషయాన్ని ప్రభుత్వం కాస్త సీరియఎస్ గానే తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నిల తరువాత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో వేచి చూడాలి మరి..!