పంచాయతీల్లో వైఎస్సార్సీపీ రెపరెపలు..


Ens Balu
3
Tadepalle
2021-02-23 14:08:17

ఆంధ్రప్రదేశ్ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ విజయ ఢంకా మోగించింది. గ్రామీణ ప్రజానీకం మొత్తం సానుకూలంగా స్పందించి బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రంలో మొత్తంగా 13,081 గ్రామ పంచాయతీలు ఉండగా, 10,536 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయ దుందుభి మోగించారు. దీంతో పార్టీ గుర్తింపు ప్రజల్లోకి మరింగి వెళ్లినట్టు అయ్యింది. ఇదే ఉత్సాహంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్ధులు పురపాలికపై పార్టీ జెండా ఎగురవేస్తారనే ధీమాతో వుంది వైఎస్సార్సీపీ అధిష్టానం. చంద్రుడికో నూలు పోగు అన్నట్టు అక్కడక్కడా పార్టీపై చిన్నా చితకా టిడిపి అసంత్రుప్తి ఉన్నా దాని ప్రభావం ఎన్నికల్లో కనిపించలేదు. అంతేకాకుండా గెలుపొందిన సర్పంచులంతా చాలా వరకూ యువకులు, కొత్తవారే కావడం కూడా గ్రామాభివ్రుద్ధికి మార్గం సుగమం అవుతుందని పార్టీ భావిస్తుంది. పదేళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని వున్నచాలా మందికి ఈ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఓ మంచి స్థానం కల్పించి ప్రజలకు మరింతగా సేవలు అందిచాలని చూస్తుంది ప్రభుత్వం. గ్రామ పంచాయతీల్లో ఎగిరిన పార్టీ జెండా మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోకూడా ఎగురవేస్తామే ధీమాతో వుంది అధికార పార్టీ. దానికి తగ్గట్టుగా అభ్యర్ధులు కూడా వారి వారి ప్రచారాల్లో నిమగ్నమై వున్నారు. మార్చి 14న ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయో తేలనుంది..