13మంది దుర్గగుడి ఉద్యోగులపై వేటు..


Ens Balu
1
Vijayawada
2021-02-23 15:09:16

విజయవాడలో వేంచేసియున్న శ్రీ కనక దుర్గమ్మ వారి ఆలయంలో అవినీతి ,కుంభకోణాలపై విజయవాడ దుర్గ గుడిలో పనిచేసే ఐదుగురు సూపరింటెండెంట్‌ స్థాయి సిబ్బందితో సహా మొత్తం 13 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్‌ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలంగా నిరవధికంగా వస్తున్న ఆరోపణలపై  సకాలంలో అవినీతికి తావియ్యకుండా,అవినీతిపరుల అక్రమాలు అరికట్టేంచుదుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఆలయ  భూములు, షాపుల లీజు వ్యవహారాలతో పాటు అన్నదానం, దర్శనాల టికెట్ల అమ్మకం, అమ్మవారి చీరల వ్యవహారాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అందించిన ప్రాథమిక సమాచారం మేరకు ఏడు రకాల విభాగాల్లో పనిచేసే సిబ్బందిని  తక్షణమే సస్పెండ్‌ చేయాల్సిందిగా ఆలయ ఈవో సురేష్‌బాబును ఆదేశిస్తూ దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావు సోమవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు. అయితే అంతా అనుకున్నట్టుగానే ఈఓపై మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీనిపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల సంతోషం,హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ,పుణ్యక్షేత్రాన్ని అక్రమాల అడ్డాగా మార్చుకున్న అవినీతి,అసాంఘిక శక్తుల కబంధ హస్తముల నుండి విడుదల అయ్యేలా చూడాలని ప్రజలు,అమ్మవారి భక్తులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కోరుతున్నారు. మరోవైపు ఈఓ కూడా తనను వేరోచోటుకి బదిలీ చేయాలని, లేదంటే లాంగ్ లీవ్ పై వెళ్లిపోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టుగా ప్రచారం జరుగుతోంది.