ఉన్నత ప్రమాణాలే లక్ష్యంగా మండలి..


Ens Balu
1
Tirupati
2021-02-27 20:11:21

రాష్ట్రంలో ఉత్తమ విద్యా ప్రమాణాలు పెంపు, విద్యా విధానంలో దేశంలోనే  రాష్ట్రం ఆగ్ర స్థానంలో నిలవాలన్న రాష్ట్ర  ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి  ఆశయం మేరకు ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రూపు దిద్దుకున్నదని  రాష్ట్ర విద్యా  శాఖా మంత్రి  ఆదిమూలపు  సురేష్ అన్నారు.  శనివారం ఉన్నత విద్యా  మండలి  మొదటి  సమావేశం ఏర్పేడు వద్ద గల ఐ ఐ టి ఆతిధ్యంతో   విద్యా మండలి అధ్యక్షులు  ప్రొ. హేమచంద్రా రెడ్డి , విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి  సతీష్ చంద్ర ల తో కలసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలోని అన్ని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యాలయాలు,  విశ్వ విద్యాలయాల విసి లతో, ప్రొఫెసర్లతో  నిర్వహించారు.  రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మీడియా తో మాట్లాడుతూ,   రాష్ట్ర ముఖ్యమంత్రి  ప్రణాళిక బోర్డు  ఏర్పాటు  తో విద్యావిధానంలో సమూల సంస్కరణలు చేపట్టడానికి,  దేశంలోనే  రాష్ట్ర విద్య విధానం   ఉన్నత  స్థాయిలో    నిలపాలన్న కృత నిశ్చయంతో వున్నారని అన్నారు.  విద్యా మండలి ఏర్పాటుతో కేంద్ర విశ్వ విద్యాలయాలు,  విద్యాలయాలు  రాష్ట్ర విశ్వ  విద్యాలయాలతో అనుసంధానం చేసి సమన్వయంతో  చర్చలు జరిపి,  రీసర్చ్,  ఫాకల్టీ, సాంకేతిక  అనుసంధానం, అవసరాలు వంటివి గుర్తించి  రాష్ట్ర విద్యా శాఖలో  సమూల మార్పులు చేయనున్నామని అన్నారు. అందులో భాగంగా  రాష్ట్ర  ఉన్నత విద్యా మండలి  పలు కేంద్ర, రాష్ట్ర  విశ్వ విద్యాలయాలతో   చర్యలు జరిపి  నాలెడ్జ్  ఎక్స్ ఛేంజ్ , సాంకేతిక అనుసంధానం, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వంటి అవసరాలు   గుర్తించడం జరుగుతుందని అన్నారు.  ఇప్పటికే విద్యాశాఖ లో  సంక్షేమ పథకాలు అమ్మ ఒడి, నాడు-నేడు వసతుల కల్పన,  వై ఎస్సార్ ప్రైమరీ  పాఠశాలలు ఏర్పాటు, విద్యాదీవెన,  వసతి  దీవెన వంటివి అమలు  చేస్తున్నారని అన్నారు.  ఉన్నత విద్యకు సంబంధించి  కోవిడ్ -19  కారణంగా ఈసారి   అడ్మిషన్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్ మేరకు  డిగ్రీ  కళాశాలలో ఇబ్బందులు లేకుండా జరిపామని, రాబోవు సంవత్సరమునకు ఇంటర్ మీడియట్ కు వర్తింప చేస్తామని తెలిపారు.  బి ఏ,  బి కామ్, , బి టెక్  కోర్సులకు 10 నెలల  ఇంటర్న్ షిప్ అమలు చేయబోతున్నామని  తెలిపారు.  కోవిడ్ కారణం  గా ఆలస్యం ప్రారంభమయిన ఈ విద్యా సవత్సరం  విద్యా సంస్థల ను గాడి పెట్టి  సిలబస్ పూర్తి చేయనున్నామని తెలిపారు.  పరిశోధనలకు ప్రాధాన్యత నిస్తూ, స్మూల మార్పులు తీసుకువచ్చి   విద్యా సంస్థలను సెంటర్ ఆఫ్  ఎక్సలెన్స్ గా తీర్చి దిద్దనున్నామని  అన్నారు.ప్రతి పార్లమెంటు పరిధిలో స్కిల్ డెవెలప్ మెంట్ సెంటర్లు, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ రూపుదిద్దుకొనున్నదని తెలిపారు. బి.ఎడ్.  కోర్సు కు సంబంధించి ప్రత్యేక స్పెషలైజేషన్ అమలు చేస్తూ 4 సంవత్సరాలకు పెంచనున్నామని అన్నారు.    ఆన్ లైన్ క్లాసులకు  వంద శాతం హాజరు కోసం పేద, బలహీన వర్గాల వారు   అమ్మ ఒడి   లబ్దిదారులు తమ సమ్మతి  తెలియజేస్తే బదులుగా లాప్  టాప్  అందించే యోచనలో గౌరవ ముఖ్యమంత్రి   వున్నారని వివరించారు.  ఈ సమావేశం లో  రాష్ట్ర ఉన్నత   విద్యా మండలి అధ్యక్షులు ప్రొ. హేమ చంద్రా రెడ్డి, ఐ. ఐ. టి. డైరెక్టర్  సత్యనారాయణ తదితరులు  పాల్గొన్నారు.