ఈఎన్ఎస్ కధనంపై స్పందించిన ప్రభుత్వం..బయో మెట్రిక్ లేకపోతే జీతం నిల్..
Ens Balu
1
తాడేపల్లి
2021-02-28 22:23:12
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామసచివాలయ వ్యవస్థలో సిబ్బందిలోపాలపై ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ న్యూస్ యాప్ లో ప్రచురితమైన న్యూస్ కార్డ్ పై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలోని సుమారు 15వేల వార్డు, గ్రామసచివాలయ సిబ్బంది టైమ్ కి బయోమెట్రిట్ వేస్తేనే జీతం ఇస్తామని లేదంటే ఆరోజు జీతం కట్ చేస్తామని ప్రకటించింది. గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి కొందరు సచివాలయ సిబ్బంది ఆడుతూ పాడుతూ విధులు నిర్వహిస్తూ వచ్చారు. వారికి కొందరు తేడా గ్రామకార్యదర్శిలు వంతపాడుతూ, వారి లోపాలను కప్పిపుచ్చుకుంటూ వచ్చారు. అయితే దేశానికే దిక్సూచిగా నిలిచిన గ్రామసచివాలయ వ్యవస్థలో సిబ్బంది, అధికారులు చేస్తున్న తేడా విధులపై ఈఎన్ఎస్ లైవ్ యాప్ వరుస కధనాలు ప్రచురిస్తూ వస్తోంది. ఇటీవల ప్రచురించిన న్యూస్ కార్డ్...తేడా సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం ద్రుష్టి అనే వార్తకు స్పందించిన ప్రభుత్వం బయోమెట్రిక్ అటెండెన్సు, టూర్ డైరీ, విధినిర్వహణలో చేరినపుడు ఇచ్చిన డ్యూటీ చార్టు ఖచ్చితంగా అమలు చేస్తేనే జీతాలు ఇస్తామని లేదంటే జీతం ఇచ్చే పరిస్థితి లేదని తెగేసి చెప్పింది. దీనితో గ్రామసచివాలయ వ్యవస్థ విషయంలో ఈఎన్ఎస్ లైవ్ యాప్ ప్రచురిచిన న్యూస్ కార్డ్ లోని వాస్తవాలను గుర్తించిన ప్రభుత్వం తనదైన స్టైల్ లో విధినిర్వహణ ప్రతీ ఒక్క ఉద్యోగి సక్రమంగా చేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు ప్రజల గుండె చప్పుడు ట్యాగ్ లైన్ తో ప్రజల్లోకి వచ్చిన ఈఎన్ఎస్ లైవ్ యాప్ కధనాలన్నీ అక్షర సత్యాలని మరోసారి రుజువైంది. అంతేకాదు ప్రభుత్వంలో చాలా మంది ఉన్నతాధికారులు ఈఎన్ఎస్ లైవ్ యాప్, www.enslive.net న్యూస్ వెబ్ సైట్ ని ఫాలో అవుతున్నారని తాజా సంఘటనలు రుజువుచేస్తున్నాయి. దీనితో బాగా పనిచేసు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ఈఎన్ఎస్ లైవ్ యాప్ కార్యాలయానికి అభినందనలు తెలియజేయడానికి ఉదయం నుంచి కాల్స్ చేస్తునే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు స్థితిగతులు, మంచి, చెడులపై ఎప్పటికప్పుడు విశ్లేషనాత్మక కధనాలను న్యూస్ కార్డ్ గా అందిస్తున్న ఈఎన్ఎస్ లైవ్ యాప్ మరిన్ని వార్తలతో ప్రభుత్వం అన్నిశాఖలపై ద్రుష్టిపెట్టేలా చేయాలని సూచిస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. అదేవిధంగా ప్రజలకు గ్రామసచివాలయ సేవలు మరింతగా ఏ విధంగా అందాలోకూడా ప్రజలను చైతన్యం చేస్తూ కధనాలు అందించాలని కోరారు. అశేష పాఠక లోకానికి తాజావార్తలు అందించే ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ప్రజల పక్షాన నిలవడమే కాకుండా ప్రభుత్వ వ్యవస్థల పనితీరుకు, వారి మంచి విధులను ప్రజలకు తెలియజేస్తూ, అదే స్థాయిలోని తేడా విధులను ఎండగడుతూ ముందుకి సాగుతుందని తెలియజేస్తుంది ఈఎన్ఎస్ లైవ్ యాప్ టీమ్..