ఏపీలో బీటెక్ నిరుద్యోగులకు శుభవార్త..
Ens Balu
0
Tadepalle
2021-03-01 09:15:35
ఆంధ్రప్రదేశ్ లో వేల కోట్ల రూపాయల విలువైన భూములు తీసుకుంటూ స్థానికులకు ఉద్యోగాలిచ్చే విషయంలో టెక్నాలజీ సాకు చూపి తప్పించుకునే సాఫ్ట్ వేర్ కంపెనీల ఆగడాలకు కాలం చెల్లింది. ఏపీలో సాఫ్ట్ వేర్ కంపెనీలు పెట్టేవారు 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే నిబంధనను ప్రభుత్వం ఇకపై పూర్తిస్థాయిలో అమలు చేయాలని సంకల్పించింది. దీనికోసం రాష్ట్ర ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్రుష్టికి ఒక ప్రత్యేక ప్రతిపాదన తీసుకెళ్లినట్టు సమాచారం. ఆ ప్రతిపాదన ప్రకారం సాఫ్ట్ వేర్ కంపెనీల్లో వినియోగించే టెక్నాలజీలు ప్రభుత్వానికి ముందుగానే కంపెనీ స్థాపనకు ముందుగానే తెలియజేస్తాయి. లేదంటే ప్రభుత్వంలోని ఐటీశాఖ రాష్ట్రంలోని అన్ని సాఫ్ట్ వేర్ కంపెనీల నుంచి టెక్నాలజీ వినియోగంపై డాటాను సేకరింస్తుంది. తద్వారా నైపుణ్యాభివ్రుద్ధి కేంద్రాలు, వ్రుత్తి నైపుణ్య విద్యాలయాల ద్వారా విద్యార్ధులకు చదువుకునే సమయంలోనే ప్రత్యేకంగా సదరు సాఫ్ట్ వేర్ టెక్నాలజీలపైనా, ఇంగ్లీష్ నైపుణ్యం పెంపు పై పూర్తిస్థాయి శిక్షణ ఇస్తారు. విద్యార్ధుల డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువతున్న సమయంలోనే రాష్ట్రంలో కంపెనీలకు స్థలాలు తీసుకున్న యాజమాన్యాలు ఆయా వ్రుత్తి నైపుణ్య విద్యాలయాల్లో కేంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. తద్వారా విద్యార్ధులకు డిగ్రీ పూర్తయ్యేనాటికే సాఫ్ట్ వేర్ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఇలా చేయడం ద్వారా రాష్ట్రంలోని ఐటీ పరిశ్రమను అభివ్రుద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. అన్ని ఐటీ కంపెనీలకు ఈ నిబంధన వర్తింపజేసి రాష్ట్రంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతకు కల్పించాలనేది ప్రభుత్వ ఆలోచన. కొత్తగా పెట్టబోయే కంపెనీలు స్థానికులకు ఉద్యోగ అశకాశాలు కల్పించకపోతే వారికి నిబంధనల ప్రకారం ఏపీఐఐసి ద్వారా స్థలాల కేటాయింపు జరగదని తెలుస్తుంది. ఇంత వరకూ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఏర్పాటుకి స్థలాలు తీసుకున్న కంపెనీలన్నీ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే వారు మా కంపెనీలు వినియోగించే టెక్నాలజీలు నేర్చుకోలేదని, వారు నేర్చుకుంటే తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు కేటాయిస్తామ చెప్పి తప్పించుకుంటూ వస్తున్నాయి. అదే సమయంలో కొన్ని కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించినా అవి రెండు లేదా మూడేళ్లు మాత్రమే ఉంచి తీసేస్తున్నాయి. ఇకపై అలా ఉద్యోగాలిచ్చి తీసేయడానికి వీలుపడదు. కంపెనీలో చేరిన ఉద్యోగి ఆ ఉద్యోగానికి పనికారడని సాంకేతికంగా రుజువు అయినపుడు మాత్రమే ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించాలి. అలాకాకుండా ఎడాపెడా తీసుకున్న ఉద్యోగులను తీసేస్తామన్నా ఆ పనిజరగకుండా ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను అమలుచేయబోతుందట. అలాకాకుండా ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగికి కావాల్సిన టెక్నాలజీ, ఇంగ్లీష్ లాంగ్వేజి డెవలెప్ మెంట్ అన్నీ ప్రభుత్వం నిర్మించే నైపుణ్యాభివ్రుద్ధి కేంద్రాలు, వ్రుత్తి నైపుణ్య విద్యాలయాల ద్వారా శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా శిక్షకులను భారీ జీతాలతోనే నియమించనుంది. వీరికి టార్గెట్లు కూడా పెట్టి ఎంత ఎక్కువ మంది నిరుద్యోగులకు ప్రభుత్వం ఐటి ఉద్యోగాలిప్పించే స్థాయికి శిక్షణ ఇచ్చారనే కోణంలో వారిని పరిశీలిస్తుందని సమాచారం. ఇదే జరిగితే సాఫ్ట్ వేర్ కంపెనీల ఆగడాలకు కాలం చెల్లడంతోపాటు, బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉన్నవారికి సైతం సాఫ్ట్ వేర్ ఉద్యోగ అవకాశాలు మెండుగా దొరికే చాన్సు వుంది. సాఫ్ట్ వేర్ పార్కులు ఏర్పాటు చేసే జిల్లాల వారీగా ఈ నైపుణ్యశిక్షణ కేంద్రాలు, వ్రుత్తి నైపుణ్య విద్యాలయాలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలుస్తుంది. ఐటీలో శిక్షణ తీసుకోవాలంటే ఇంజనీరింగ్ చదివిన వారికి ఆరునెలల సమయం పడుతుంది. అలాకాకుండా ప్రభుత్వం శిక్షణ ఇచ్చే కేంద్రాల్లో అయితే చదువుతోపాటు శిక్షణ తీసుకుంటారు కనుక ప్రత్యేకంగా వారికి శిక్షణ ఇచ్చే పనుండదు. ఇటీవల ఐటీశాఖ మంత్రి సాఫ్ట్ వేర్ కంపెనీలతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించి దానిపై నివేదికను ముఖ్యమంత్రికి అందించినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేంతగా సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ లో భారీ ఉద్యోగాలతోపాటు, మంచి ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువవుతాయి..!