సర్పంచ్ లు రెడీ సచివాలయాలు అన్ రెడీ..
Ens Balu
2
Tadepalle
2021-03-01 10:46:02
ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ప్రాంతాల్లో పదేళ్ల తరువాత పరిపాలన అందించేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్ లు రెడీ అయిపోయారు.. కానీ వారు పరిపాలన అందించేందుకు గ్రామసచివాలయాలే ఇంకా నిర్మాణ దశలోనే ఉండిపోయాయి. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తయ్యేనాటికి గ్రామసచివాలయాల్లోని భవనాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఎంత యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించినప్పటికీ చాలా చోట్ల కొత్త భవనాల నిర్మాణాలు పూర్తికాలేదు. దీనితో పాత భవనాల్లోనే నూతన సర్పంచ్ లు ప్రమాణ స్వీకారాలు చేశారు. కొన్ని చోట్ల మాత్రం నూతన సచివాలయాలు పూర్తయ్యాయి. పూర్తయిన చోట సర్పంచ్ లు తమ కార్యదర్శిలతో నూతన భవనాల్లోనే తమ కార్యకలాపాలు ప్రారంభించగా, మిగిలిన నేటికీ అద్దెకు తీసుకున్న భవానాల్లోనూ, పాత భవనాల్లోనే తమ పాలనకు శ్రీకారం చుట్టారు. పంచాయతీ ఎన్నికల ముందు వరకూ గ్రామసచివాలయాల్లో సర్పంచ్ కు గదులనే సిద్ధం చేయలేదు. ప్రభుత్వం ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత గ్రామ సర్పంచ్ కి ప్రత్యేక గదులను తయారు చేశారు. అప్పటి వరకూ ఆ గదలను చాలా చోట్ల స్టోర్ రూమ్ లుగా నినియోగించాల్సి వచ్చింది. పదేళ్లుగా గ్రామపంచాయతీలకు సర్పంచ్ లు లేరేమో కార్యదర్శిల రాజ్యమే చెల్లింది. చాలా చోట్ల ప్రభుత్వ రికార్డులకు లెక్కా పత్రం లేదు. ప్రభుత్వం షడెన్ గా పంచాయతీలకు ఎన్నికలు పెట్టేసి సర్పంచ్ లను నియమించేయడంతో తేడా కార్యదర్శిల గొంతులో పచ్చివెలక్కాయ్ పడినట్టు అయ్యింది. ఈసారి చాలా వరకూ గ్రామపంచాయతీలకు చదువుతున్న యువత సర్పంచ్ లు గా ఎన్నిక కావడంతో అపుడే వారి ద్రుష్టి తేడాగా వ్యవహరించే పంచాయతీ కార్యదర్శి నిర్వహించే రికార్డులుపై పడింది. చాలా చోట్ల పంచాయతీల్లో అపుడే తేడా కార్యదర్శిల్లో ఆందోళన మొదలైంది. పదేళ్ల తరువాత మళ్లీ సర్పంచ్ ల పాలన రాష్ట్రంలో అమలులోకి రావడంతో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే పనిలో పడ్డారు కొత్త సర్పంచ్ లు. ఈసారి సర్పంచ్ లకు ప్రభుత్వ శాఖల వారీగా సిబ్బంది, గ్రామ వాలంటీర్లు కూడా తోడయ్యారేమో వారి లక్ష్యాలు చేరుకోవడానికి మార్గం సుగమం అయ్యింది. ఇదే సమయంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ గ్రామ సచివాలయ భవనాలు పూర్తయితే ప్రజలకు కొత్త భవనాల నుంచే సచివాలయ సేవలు పూర్తిస్థాయిలో అందనున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ సచివాలయ భవన నిర్మాణ పనులు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నిలకలు, ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికలు కూడా పూర్తయిపోతే గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయి సచివాలయ పాలన అందుబాటులోకి వస్తుంది. గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ లు, వెటర్నరీ కేంద్రాలు, మల్టీపర్పస్ కేంద్రాల నిర్మాణాలు కూడా ప్రారంభమైపోతే సర్పంచ్ లకు, సిబ్బందికి చేతి నిండా పనిదొరుకుంది. ఈలోగా సచివాలయ సిబ్బంది ఉద్యోగాలు కూడా రెగ్యులర్ అవుతాయేమో గ్రామ స్వరాజ్య పాలను అంతా ఒకేసారి సిద్ధమవుతారు.