ఆ పోస్టుకోసం ఆగమేఘాలపై రిలీవ్ అయిపోయారు..
Ens Balu
2
Tadepalle
2021-03-04 21:04:53
తూర్పుగోదావరి జిల్లా చరిత్రలోనే అత్యధిక మొత్తంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ పనిష్మెంట్ పై రాజమండ్రి రూరల్ నుంచి వీర్ పురం బదిలీపై వెళ్లిన ఎంపీడీఓ సుభాషిణి ఆరు నెలలు విధుల్లో చేరకపోయినా విశాఖజిల్లాలో డిపీఓ(ఎఫ్ఏసి)గా చేరిపోవడానికి మాత్రం ఆగమేఘాలపై గురువారం రిలీవ్ అయిపోయారు. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రకారం ఆమె శుక్రవారం విశాఖ జిల్లా కలెక్టర్ ను కలిసి డిపీఓగా ఆమె విధుల్లోకి చేరిపోవడానికి వచ్చేస్తున్నారు. ఈ అవినీతి ఆరోపణలు, మినిస్టీరియల్, విజిలెన్స్ విచారణలు ఎదుర్కొంటూ రిపోర్టులు పెండింగ్ లోవున్న ఈ అధికారి నియామకాన్ని ఎలాగైనా ఆపాలని జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తున్నప్పటికీ తన నెట్వర్క్ మొత్తం స్టేట్ లెవల్ లో వినియోగించి, జిల్లా మంత్రికి ఆమె పోస్టింగ్ విషయం తెలియజేయకుండానే
ఆమె విశాఖ వస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో జీవిఎంసీ ఎన్నికల విధినిర్వహణలో ఉన్న ప్రస్తుతం డిపీఓ క్రిష్ణకుమారిని కదిపే పరిస్థితిలేదు. కొత్తగా అధికారి వచ్చి చేరడానికి కూడా ఇక్కడ అధికారులు సముఖంగా లేరని సమాచారం. అయినప్పటికీ పంచాయతీరాజ్ శాఖలోని ముఖ్య అధికారులు జారీ చేసి జీఓ ప్రకారం విశాఖలో ఎఫ్ఏసీ డిపిఓగా విధుల్లో చేరిపోవడానికి మాత్రం వచ్చేస్తున్నారు. ఈమె అవినీతి విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ఆధారాలతో సహా న్యూస్ కార్డ్స్ ప్రచురిస్తూ వస్తోంది. ఆపై తూర్పుగోదావరి జిల్లా మీడియా ఇచ్చిన సమాచారంతో విశాఖజిల్లాలోని మీడియా కూడా ప్రత్యేక కధనాలు అందిస్తోంది కూడా. అవి విశాఖ పట్నం నుంచి రాజధాని అమరావతి వరకూ గత నాలుగు రోజులుగా వైరల్ అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఒక్కపూటలో జీఓ రప్పించుకోవడమే కాకుండా అధికారులు ఉత్తర్వుల ప్రకారం తన నియామకాన్ని ఏఒక్కరూ నిలుపుదల చేయలేరని భావించిన ఆ అధికారిణి శుక్రవారం విధుల్లో చేరడానికి సిద్దమయ్యారు. ఈ అధికారిణి పట్టుబట్టిన స్థానం కోసం విశాఖ జిల్లా అధికారులు సముఖంగా లేకపోయినా, పంచాయతీరాజ్ శాఖ నుంచి రాష్ట్ర అధికారులు ఆదేశిస్తే ఆ అధికారిణి విశాఖజిల్లా డిపీఓగా చేరడానికి ఆస్కారం వుంటుంది. లేదంటే ప్రస్తుతం వున్న డిపీఓ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక, ప్రభుత్వ నిబంధనలు, అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ ను ఇటు విశాఖజిల్లా అధికారులు కూడా అమలు చేస్తే ఆ అధికారిణి విశాఖజిల్లాలో చేరడానికి మాత్రం ఆస్కారం వుండదు. ఒక వేళ అప్పటికీ రాష్ట్ర అధికారులు ఒత్తిడితో విధుల్లోకి చేరినా, ఆపై న్యాయపరమైన ఇబ్బందులు సదరు అధికారిణి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, విచారణలు మధ్యలో వున్న సమయంలో పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చినందుకు రాష్ట్ర అధికారులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తుంది. శుక్రవారం పదిగంటలు దాటితే ఏం జరుగుతుందనేది తేలిపోనుంది. ఉత్కంఠగా సాగుతున్న ఎ ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఈఎన్ఎస్ లైవ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాం..!