విశాఖలో రసవత్తర సన్నివేశం..కలెక్టర్ కార్యాలయం చుట్టు ఎంపీడీఓ చక్కెర్లు..


Ens Balu
2
Tadepalle
2021-03-05 11:46:55

విశాఖజిల్లా పంచాయతీ అధికారి పోస్టు భర్తీ విషయంలో ఆశక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అవినీతి ఆరోపణలు, విజిలెన్సు విచారణలు పెండింగింగ్ లో ఉన్న తూర్పుగోదావరి జిల్లా విఆర్ పురం ఎంపీడీఓ సుభాషిణికి పంచాయతీరాజ్ శాఖ విశాఖజిల్లా డిపిఓ(ఎఫ్ఏసి)గా బదిలీచేసింది. దీనితో ఆమె శుక్రవారం విధుల్లో చేరిపోవడానికి విశాఖ వచ్చారు. జిల్లా కలెక్టర్ కలవడానికి కార్యాలయానికి వెళితే అక్కడ కలెక్టర్ లేరు. విశాఖజిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వున్న కలెక్టర్ విధినిర్వహణపై క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు. అయితే ఎలాగైనా కలెక్టర్ ను కలిసి తాను విధుల్లోకి చేరిపోవాలన్నట్టుగా సదరు అధికారిణి కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు చుక్కెదురైంది. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఆమెను మున్సిపల్ ఎన్నికలు తరువాత రావాలని చెప్పేశారు. అయినప్పటికీ ఆమె అక్కడి వుంటే తన నెట్వర్క్ మొత్తాన్ని యాక్టివేట్ చేస్తూ...కలెక్టర్   చక్కెర్లు కొడుతున్నట్టు సమాచారం అందుతుంది. విశాఖజిల్లా డిపీఓగా చేరాలని ప్రభుత్వం జీఓ జారీచేసిన తరుణంలో సదరు అధికారిణి సుభాషిణి ఆరు నెలలుగా విధుల్లోకి చేరకుండా, కేవలం డీపీఓగా చేరిపోవడానికి ఐదురోజుల క్రితం విధుల్లోకి చేరారు. అదీ తన ట్రాన్సఫర్ కమ్ ఇన్చార్జి డిపీఓ పోస్టు కి జీవో వస్తుందని కన్ఫార్మ్ అయిన తరువాత. అంత పెద్ద భారీ నెట్వర్క్ నడిపిన తరువాత జీఓ రావడంతో ఆఘమేఘాలపై ఆమె తన పోస్టు నుంచి రిలీవ్ అయిపోయారు. ఆమె రిలీవ్ అవుతున్నవిషయం తెలుసుకున్న తూర్పుగోదావరి జిల్లా మీడియా ఎంపీడీఓపై అవినీతి ఆరోపణలు, జరుగుతున్న విచారణలు, పెండింగ్ లోవున్న విచారణలు, ప్రభుత్వం ఇచ్చిన మెమో కాపీలను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక యాప్ ఈఎన్ఎస్ లైవ్ కి సకాలంలో అందించారు. దీనితో ఈఎన్ఎస్ లైవ్ యాప్  వాస్తవాలను న్యూస్ కార్డ్ గా తీసుకురావడంతో, ఎలాగైనా అడ్డంకులు పెరిగిపోతున్నాయని, తక్షణమే విధుల్లోకి చేరిపోతే అన్నింటికి పులుస్టాఫ్ పెట్టాలని భావించిన అధికారిణి విశాఖ వచ్చేశారు. తీరా విశాఖ వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్ ని కలవడం కుదరలేదు. పైగా ఈరోజు ప్రభుత్వం అధికారికంగా బంద్ నిర్వహించమని చెప్పడంతో అధికారులంతా నల్ల బ్యాడ్జిలు తగిలించుకొని విధుల్లో ఉన్నారు. అయినప్పటికీ తనకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి నుంచి జీఓ రావడంతో దానినైనా అధికారులు పాటిస్తారని, తనపై అవినీతి ఆరోపణలు, విచారణలు ఉన్నప్పటికీ జీఓ ప్రకారం విధుల్లోకి చేర్చుకుంటారని విశాఖ వచ్చేసినా ఫలితం లేకపోయింది. దీనితో ఆమె కలెక్టర్ క్యాంపు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, ఇటు రాజకీయంగా, అటు అధికారింగా పైరవీలు మొదులు పెట్టినట్టు సమాచారం అందుతుంది. కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఎంపీడీఓకి చెప్పినప్పటికీ ఎలాగైనా కలెక్టర్ ను కలిసి, విశాఖజిల్లా డిపీఓగా చేరిపోవాలని పట్టుదలతోనే అక్కడే వుండిపోయినట్టు చెతున్నారు. దానికితోడూ, ఒక ప్రజాప్రతినిధికి తెలియకుండా లేఖలు తీసుకొని వెళ్లి, చాలా పెద్ద నెట్వర్క్ వినియోగించి జీఓ తెచ్చుకున్నతరువాత, ఈమె అవినీతి ఆరోపణలు తెరమీదకు రావడం, ఆపై తూర్పుగోదావరి జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైరల్ కావడమూ జరిగిపోయాయి. ఇంతజరిగిన్పటికీ తమ శాఖ జారీ చేసిన జీఓ పై ఉన్న నమ్మకంతో విశాఖ వచ్చి ప్రస్తుతం గాల్లో ఉన్నారు ఎంపీడీఓ సుభాషిణి. ఈ ఆశక్తికర ఎపిసోడ్ లో తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధిక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ వార్తల్లో నిలిచిన ఈ ఎంపీడీఓ విశాఖజిల్లా డిపీఓగా(ఎఫ్ఏసీ)గా బాధ్యతలు స్వీకరిస్తారా, లేదంటే ఎన్నికల తరువాత ఈ తతంగానికి శుభం కార్డు పడుతుందా, ఈ లోగా ఈమెపై వున్న అవినీతి ఆరోపణ ఫైల్స్ ను ప్రభుత్వంలోని అధికారులు మళ్లీ తెరపైకి తెస్తారా, తెచ్చినా, తేకపోయినా ఆమెకి పోస్టింగ్ విశాఖలోనే ఇచ్చేస్తారా, ఇచ్చిన తరువాత న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటారా అనే విషయమై ఆశక్తికర చర్చ నడుస్తుంది. వాటిటి ఎప్పటికప్పుడు ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ మీకు అందజేస్తుందని తెలియజేస్తున్నాం.