కలెక్టర్ లేదన్నారు..మంత్రి కుదరదన్నారు..ఇక తదుపరి సెక్రటేరియటే..


Ens Balu
1
Tadepalle
2021-03-06 17:33:13

విశాఖజిల్లా పంచాయతీ అధికారి పోస్టు, బదిలీ విషయంలో అవినీతి అధికారిణి సుభాషిణికి జిల్లాలో చుక్కెదురైంది..మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ విధినిర్వహణలో వున్న డిపీఓ క్రిష్ణకుమారిని బదిలీచేస్తూ, ఆ స్థానంలో ఇన్చార్జి డిపీఓగా తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం ఎంపీడీఓ పేరు ప్రతిపాదిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఆరురోజుల క్రితం జీఓ జారీచేసింది. ఈ తంతు మొత్తం విశాఖజిల్లాలోని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రికి తెలియకుండా జరిగిపోయింది. దీనితో ఆగమేఘాలపై జిల్లా పంచాయతీ అధికారిగా పోస్టులో చేరిపోవడానికి వచ్చిన సదరు అధికారిణికి వ్యతిరేక పవనాలు ఎదురయ్యాయి. నేరుగా కలెక్టర్ ను కలవడానికి ప్రతయత్నిస్తే..ప్రస్తుతం విశాఖలోని మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నందున, ఆవిధుల్లో డిపీఓ క్రిష్ణకుమారి పనిచేయడంతో ప్రస్తుతం మార్పులు చేర్పులు కుదరవని, ఎన్నికల నిర్వహణ తరువాత చూద్దామని చెప్పడంతో అక్కడి నుంచి ఏ మంత్రికైతే తెలియకుండా జీఓతో విధుల్లో చేరడానికి వచ్చారో ఆమంత్రిని ప్రసన్నం చేసుకోవాలని వచ్చినా అక్కడా వీలు పడలేదు. అయినప్పటికీ తన నెట్వర్క్ మొత్తాన్ని వినియోగించినా ఇద్దరు ప్రజాప్రతినిధులతో విశ్వప్రయాత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీనితో వెనుతిరిగిన ఆ అధికారిణి నేరుగా విశాఖ నుంచి రాజధానిలోని పంచాయతీరాజ్ శాఖ సెక్రటేరియట్ ద్వారా కధనడిపించాలని వెళ్లినట్టు సమాచారం అందుతుంది. శుక్రవారం ఉదయం పదిగంటల నుంచి శనివారం మధ్యాహ్నాం వరకూ ఎంత ప్రయత్నించినా పరిస్థితులు అనుకూలించలేదు సదరు అధికారిణికి. ఈమె విశాఖజిల్లాలో డీపీఓ ఇన్చార్జిగా చేరడానికి సహకారం అందించిన ప్రజాప్రతినిధులు కూడా ఆమె యొక్క అవినీతి వ్యవహారాలు మీడియా ద్వారా వెలుగు చూడటంతో చేతులెత్తేయడంతో ఇక పనిజరగదని భావించిన సదరు అధికారిణి రాజధానికి ఇటు నుంచి ఇటే పయనమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో లక్షల రూపాయల అవినీతి, క్రిమినెల్ కేసులు ఎదుర్కుంటూ, విజిలెన్సు విచారణలు, పరిపాలనాపరమైన విచారణలు ఎదుర్కొంటున్న పెండింగ్ యాక్సన్ కోసం వేచి వున్న ఇలాంటి అధికారిణిని చేర్చుకోవడానికి విశాఖజిల్లాలో ప్రజాప్రతినిధులు సముఖత చూపకపోవడం కూడా చర్చనీయాంశం అయ్యింది. అసలు ఇన్ని కేసులు, విచారణలున్న అధికారిణికి ఎలా బదిలీచేశారు, ఏవిరి ప్రోద్భలంతో జీఓ వచ్చిందనే విషయంలోనూ చాలా పెద్ద ప్రచారమే జరిగింది. ఈ అధికారిణికి విశాఖజిల్లా పంచాయతీ అధికారిగా బదిలీచేస్తూ జీఓ వచ్చిన దగ్గర నుంచి ఆమె యొక్క అవినీతి వ్యవహారాలను తొలుత ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా ప్రత్యేక న్యూస్ కార్డ్ కవరేజీ ఇస్తూ వచ్చింది. అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ లో పనిచేస్తున్న సమయంలో ఈమె చేసిన అవినీతికి సంబంధించిన అంశాలను కూడా అటు ఆ జిల్లా నుంచి మీడియా కూడా పేపర్ క్లిప్పింగులను, టీవీ ఛానల్స్ కధనాలను ఈఎన్ఎస్ లైవ్ యాప్ కధనాలతో పాటు వైరల్ అయ్యాయి. దీనితో ఈ విషయం కాస్తా ఆమె విశాఖజిల్లా పంచాయతీ అధికారిణిగా రావడానికి సహకరించిన నేతలందరూ ఈమెయొక్క అవినీతిని స్వయంగా తెలుసుకొని చేతులెత్తేశారు. అయినప్పటికీ సదరు అధికారిణి, ఎలాగూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి తనపేరుతో జీఓ ఇచ్చారని, దానిపై న్యాయనిపుణుల సలహామేరకు ముందుకి వెళతానని, ఎందుకు ఆ జీఓని అమలు చేయరో చూస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేసిమరీ వెనుతిరిగినట్టు విశాఖజిల్లాలో తీవ్ర ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో మంచి అధికారిణిగా పనిచేస్తూ, ఇటు ప్రజాప్రతినిధుల దగ్గర మంచి పేరు తెచ్చుకున్న డిపీఓ క్రిష్ణకుమారి కూడా తన ఉద్యోగ విరమణకు కేవలం ఒక్క ఏడాది మాత్రమే సమయం వుందనే విషయాన్ని ఇక్కడి ప్రజా ప్రతినిధులకు చెప్పడం, అన్ని వర్గాలకు సేవలు అందిస్తూ, ఎన్నికల అధికారిగా కూడా చురుకుగా పనిచేసుకుంటూ వస్తున్నారు. ఈ తరుణంలో అటు జిల్లా యాంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ అవినీతి అధికారులను జిల్లాలోకి తీసుకువస్తే ప్రజాప్రతినిధులపై మచ్చ ఏర్పడుతుందని భావించి ఆమెను వెనుతిరిగివెళ్లిపోయేలా చేయడంలో సఫలీక్రుతలయ్యారు.. అన్నిదారులూ మూసుకుపోయినా, చివారఖరి దారి కేవలం రాష్ట్ర కార్యాలయం మాత్రమే అనుకున్న ఆమె రాష్ట్ర కార్యాలయంలోని ముఖ్య కార్యదర్శిని కలవడానికి వెళ్లి అక్కడి నుంచి తన నెట్వర్క్ యాక్టివేట్ చేయాలని భావిస్తున్నారట. ఈ ఆశక్తికర ఎపిసోడ్ లో అనునిత్యం వాస్తవాలను ఎప్పటికప్పుడు మీ ముందుంచే ఈఎన్ఎస్ లైవ్ యాప్ మరింత తాజా సమాచారాన్నికూడా ఆధారాలతోనే తెలియజేస్తుందని ప్రకటిస్తుంది. ఇంత జరిగిన తరుణంలో అధికార, ప్రజాప్రతినిధులు ఎలాంటి మంచి నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని కూడా లైవ్ అప్డేట్స్ ఈఎన్ఎస్ లైవ్ యాప్ అందిస్తుందని కూడా మరోసారి తెలియజేస్తున్నాం..!