విశాఖజిల్లా పరువుని చాకచక్యంగా కాపాడిన రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి..
Ens Balu
3
Tadepalle
2021-03-07 15:02:00
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అవినీతికి తావుండదు..అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదు..పనిచేసే అధికారులకే పట్టం కడతాం..ప్రజాసేవే పరమావధి.. ప్రజల కోసం మంచి అధికారుల సేవలే ప్రామాణికం..తేడా వస్తే ఎంతటివారైనా, ఎలాంటి అధికారులపైనైనా కఠిన చర్యలు తీసుకుంటాం అనే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మాటలను, ఆదేశాలను రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరవు అక్షరాలా నిజంచేసి చూపించారు. కోట్ల రూపాయల అవినీతి, ఆరోపణలు, విజిలెన్సు విచారణలు ఎదుర్కొంటున్న అవినీతి ఎంపీడీఓ సుభాషిణి ని విశాఖజిల్లా పంచాయతీ అధికారిణి(ఎఫ్ఏసీ)గా రానీయకుండా చేసి పెర్ ఫెక్ట్ అండ్ డైనమిక్ స్టేట్ మినిస్టర్ గా వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ ముక్కుసూటిగా వ్యవహరించే జిల్లా మంత్రి ఒక అవినీతి అధికారిణిని జాల్లాలోకి రానీయకుండా చేసి జిల్లాయంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా చరిత్రలోనే అత్యధిక అవినీతి ఆరోపణలు, విజిలెన్సు విచారణలు(Govt of ap vigilance and enforcement department case number 04/RVEO/Estt./RJVM/2020, Dt.21.07.2020 వీటితో పాటు క్రిమినల్ కేసులు మరికొన్ని) ఎదుర్కొన్న విషయాలను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ఆధారాలతో సహా వచ్చిన ప్రత్యేక వార్తాకధనాల ద్వారా తెలుసుకొని ఆమెను జిల్లాలోకి రానీయకుండా అడ్డుకొని ఎంతో చాకచక్యంగా జిల్లా పరువుని కాపాడాగలిగారు. అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో ఆమె పనిచేసిన కాలంలో జరిగిన అవినీతికి సంబంధించిన వ్యవహారాలు కూడా రాష్ట్రమంతా వైరల్ కావడం కూడా చర్చనీయాంశం అయ్యి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వరకూ ఈ విషయం వెళ్లింది. దీనితో సదరు అధికారిణిపై ఇచ్చిన జీఓని రద్దు చేసే యోచనలో సెక్రటేరియట్ అధికారులు అడుగులు వేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో తూర్పుగోదావరి జిల్లాలోని వీఆర్ పురం జిల్లా అధికారుల పనిష్మెంట్ పై బదిలీగా వెళ్లి అక్కడ విధుల్లోకి చేరకుండా కేవలం, విశాఖపట్నం జిల్లా పంచాయతీ అధికారిణిగా జీఓ రావడం కోసమే రెండు రోజులు ముందుగా విధుల్లో చేరి, ఆపై విశాఖ వచ్చిన అంశాన్ని కూడా ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ను అందిస్తూ వచ్చింది. ఆ కధనాలన్నీ రాష్ట్రంలో వైరల్ అయ్యి మంత్రి వరకూ చేరడంతో అప్పటికే ఈయొక్క అధికారిణి మంత్రికి తెలియకుండానే ఈ జీవో తెప్పించుకోవడం లో సఫలీక్రుతురాలైంది. ఈ అవినీతి అధికారిణి విషయం తనకు తెలియకుండా జరగడం కూడా ఇపుడు జిల్లా మంత్రిపై మచ్చపడకుండా చేయడంలో కీలక భూమిక వహించిందనే చెప్పాలి.. లేదంటే ఆ అవినీతి అధికారి మంత్రి ప్రోద్భలంతోనే విశాఖ వచ్చిందనే మచ్చ పడే అవకాశాలు చాలా అధికంగా ఉండేవని జనాల్లోకి, అధికారుల్లోకి నెగిటివ్ ప్రచారం జరిగేది. సదరు అధికారిణి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇక్కడకు రావడానికి చాలా నిబంధనలను పక్కనపెట్టి జీఓ రప్పించుకోవడంలో అటు సెక్రటేరియట్ సిబ్బంది, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యాలయ అధికారులు కీలక భూమిక వహించినట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఓ పక్క రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, ఒక రెగ్యులర్ డీపీఓ ఉన్న జిల్లా స్థానానంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఎంపీడీఓగా వున్న అధికారిణి పంపే ఏర్పాటు చేయడం, ప్రస్తుతం ఉన్న డీపీఓ ఎన్నికల అధికారిగా ఉన్న అధికారిణిని బదిలీ చేసి, ఆమెకు ఎలాంటి జిల్లాలోనూ పోస్టింగ్ ఇవ్వకుండా జిఏడీకి రిపోర్టు చేయాలని చెప్పడం, అన్నింటికంటే ముఖ్యంగా విశాఖజిల్లా డిపీఓకి సర్వీసు కూడా ఒక ఏడాది మాత్రమే ఉండటం.. తదితర అంశాలు అధికారులను ఇరుకునపెట్టేవిగా కనిస్తున్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఏ డీపీఓ నైతే బదిలీ చేశారో సదరు అధికారిణికి బదిలీ స్థానం చూపకుండానే బదిలీకి ఉత్తర్వులు జారీచేయడం.. తదితర అంశాలన్నీ ఆ ఎంపీడీఓను విశాఖజిల్లా డిపీఓ(ఎఫ్ఏసీ)గా బదిలీచేయడానికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయ అధికారులు జీఓ ఇచ్చిన తీరు మొత్తం అవినీతికి పరాకాష్టగా నిలిచినట్టుగా విశాఖజిల్లాలో కోడైకూస్తుంది. అయితే ఇక్కడ ప్రిన్సిపల్ కార్యదర్శి కార్యాలయం సదరు ఎంపీడీఓపై వచ్చినవన్నీ అభియోగాలేనని, ఏ ఒక్కటీ రుజువుకాలేదని ఆ కారణంతోనే తాము ఆమె పనిష్మెంట్ ప్రాంతానికి వెళ్లినా విశాఖ జిల్లా డీపీఓగా పంపడానికి జీఓ ఇచ్చామని సమర్ధించుకున్నా ఇక్కడ పొంతన కుదరడం లేదు. డీపీఓగా పంపాలనుకుంటే రాష్ట్రంలో చాలా జిల్లాల్లో డీపీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని జాల్లాలను వదిలేసి ఒక్క విశాఖజిల్లాకే ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిణికి ప్రత్యేక జీఓ ద్వారా పంపడంలో, ఇక్కడ ప్రజాప్రతినిధులపైనా అవినీతి బురద మరక అంటించాలనే ఆలోచన ఉన్నట్టు ఈ బదిలీ జీఓ ద్వారా స్పష్టంగా తెలియజేస్తుందని జిల్లాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఈ జీఓ రావడంలో జిల్లా యంత్రాంగానికి, జిల్లా మంత్రికి తెలియకుండా జరగడంతో వీరు తొలుత ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకొని నియామకాన్ని ఎన్నికల తరువాత చూద్దామని చెప్పి పంపినా, తరువాత వాస్తవాలను తెలుసుకొని ఒక్కసారిగా కంగారుపడి ఆపై తేరుకొని జిల్లాపై అవినీతి మరక పడకుండా మంత్రి కాపాడగలిగారు.. సదరు అధికారిణిపై నేరుగా మీడియాలో వరసు కధనాలు వాస్తవాలు, విచారణ నివేదికలు( Efile no DI/ZPP/296618/2020, dated 27.08.2020, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డీపీఓ కార్యాలయం, కాకినాడ/ efile number 340677/2020a3, 9.10.2020 krrc, Thasildar, subcollector office rajamundry report, Regd number H.3153/2020 date 12.10.2020 subcollector report) ఇలా చాలా ఆధారాలతోనే ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ కూడా రంగంలోకి దిగడంతో అసలు విషయం కాస్త అటు అధికారులకు, ఇటు ఈ అధికారిణికి సపోర్టింగ్ లెటర్స్ ఇచ్చిన ప్రజాప్రతినిధులకు తెలిసి వారంతా చేతులెత్తేశారు. ఈ ట్రాన్స్ ఫర్ కమ్ డిపీఓ(ఎఫ్ఏసీ) ఎపిసోడ్ లో సదరు ఎంపీడీఓ ఉదయంతా కలెక్టర్ కార్యాలయం, మధ్యాహ్నాం అంతా మంత్రి వెనుక తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఇక విశాఖలో పనిజరగదని భావించిన అధికారిణి నేరుగా జీఓని అమలు చేయించుకోవడానికి అమరావతి బయలుదేరిన విషయాన్ని కూడా ఈఎన్ఎస్ లైవ్ యాప్ అందించింది. ఈ ఆధారాలతో ఇపుడు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయంలోని అధికారులు కూడా డైలమాలో పడ్డారు. ఇన్ని విషయాలు మీడియాకి తెలిసిన తరువాత ఈ అధికారిణి విషయంలో ఏ విధంగా ముందుకెళ్లినా ప్రతీ అధికారి, సిబ్బంది న్యాయపరమైన చిక్కులు ఎదొర్కోవాలసి వస్తుందని, ఈ జీఓని రద్దుచేసే యోచనకు ఉపక్రమించారని తెలుస్తుంది. దానికితోడు జిల్లా మంత్రి, కలెక్టర్లు కూడా మున్సిపల్ ఎన్నికల ద్రుష్ట్యా తిరస్కరించడం, ఈమె అవినీతి సంబంధించిన ఆధారాలు, ప్రభుత్వ, విజిలెన్సు నివేదికలు వీరికి కూడా చేరడం కూడా ఈ అధికారిణి విశాఖలో చేరకుండా ఉండేందుకు ముఖ్య కారణాలు అయ్యాయి. ఇంకా ఇప్పటికీ ఈ అధికారిణి చేసిన అవినీతిపై తూర్పుగోదారి జిల్లాలోని మీడియా, మరికొందరు జర్నలిస్టులు, ప్రభుత్వ సిబ్బంది, చాలా మందే ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ కార్యాలయాలనికి ఆధారాలు, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులు పంపుతూనే ఉన్నారు. దీనిని బట్టి చూసుకుంటే ఏ స్థాయిలో ఈ ఎంపీడీఓ అవినీతికి పాల్పడిందనేది అర్ధం చేసుకోవచ్చు. వాటి ఆధారంగా ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ప్రత్యేక కధనాలు లైవ్ అప్డేట్స్ ఇస్తుండటంతో జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆలోచనలో పడేలా చేశాయి. ఈ ఆశక్తి కర అడ్డగోలు డీపీఓ ట్రాన్స్ ఫర్ జీఓ విషయంలో మరిన్ని తాజా అప్డేట్స్ ని ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా అందిస్తూనే ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వంలో పెద్దలు, అధికారులు అవినీతిని నియంత్రించడానికి చేసే మంచికార్యక్రమంలో ఈఎన్ఎస్ ఎల్లప్పుడూ భాగస్వామ్యం అవుతుందని ఇప్పటికే రాష్ట్ర ప్రజలు, అధికారులకు తేలియజేశాం. అదే పందాను కొనసాగిస్తూనే ఉంటామని కూడా ప్రకటిస్తున్నాం. ఇక్కడ ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్ ఎవరికీ వ్యతిరేకం కాదు, అలాగని ఎవరి దగ్గర కూడా కాదు కేవలం న్యాయం వైపు మాత్రమే వుంటుందని తెలియజేయజేస్తున్నాం. ఎల్లప్పుడూ వాస్తవాలను సకాలంలో మీ కళ్లముందుంచే ఈఎన్ఎస్ లైవ్ యాప్ ఇది తెలుగు ప్రజల గుండెచప్పుడు..!