విశాఖ డిపీఓ బదిలీ జీఓని సస్పెండ్ చేసిన కోర్టు..
Ens Balu
2
Tadepalle
2021-03-08 14:53:03
బ్రేకింగ్ న్యూస్ అందుతోంది..విశాఖజిల్లా పంచాయతీ అధికారి క్రిష్ణకుమారిని కదపకూడదని హైకోర్టు స్టే విధించింది. గద ఏడు రోజుల క్రితం విఖజిల్లా డిపీఓను బాదిలీ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా రాష్ట్రంలో చాలా జిల్లాల్లో డీపీఓ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఈమెకు ఏ జిల్లాలోనూ పోస్టింగ్ ఇవ్వకుండా జిఏడి కి రిపోర్టు చేయాలని ఆ జీఓలో పేర్కొన్నారు. దీనితో తనకు అన్యాయం జరిగిందని భావించిన డిపిఓ క్రిష్ణకుమారి ప్రభుత్వ జీఓను సవాల్ చేస్తూ హై కోర్టు ఆశ్రయించారు. ఆమె వినతపై సోమవారం కోర్టు సదరు జీఓని సస్పెండ్ చేస్తూ స్టే విధించింది. దీనితో ప్రభుత్వం ఒక ఎంపీడీఓను డిపీఓ(ఎఫ్ఏసీ)గా బదిలీ చేస్తూ విడుదల చేసిన జీఓ నిలిచిపోయినట్టు అయ్యింది. భారీ స్థాయిలో అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న తూర్పుగోదావరి జిల్లా విఆర్ పురం ఎంపీడీఓ సుభాషిణికి కూడా పోస్టింగ్ విశాఖలో ఇవ్వకుండా వీలులేకుండా పోయింది. అయితే ఈ కోర్టు ఉత్తర్వులను అనుసరించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఈ ఉత్కంఠగా మారింది. మరోపక్క విశాఖజిల్లా డిపీఓను బదిలీ చేస్తున్న విషయం జిల్లా మంత్రికి తెలియకుండా జరగడం ఒక విషయమైతే, అవినీతి ఆరోపణలు ఎదర్కొంటున్న ఎంపీడీఓ విషయంలో చాలా కేసులపై విచారణలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. అయినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో అధికారులను ప్రసన్నం చేసుకొని సదురు అధికారిణి తనపై విచారణలు అన్నీ పెండింగ్ లో ఉన్న ప్పటికీ పదోన్నతితో పాటు బదిలీకి జీఓ తెప్పించుకునే విషయంలో సఫలీక్రుతులయ్యారు. కానీ విశాఖజిల్లా డీపీఓ క్రిష్ణకుమారి కోర్టును ఆశ్రయించడంతో అదికాస్త నీరుగారిపోయినట్టు అయ్యింది. విశాఖజిల్లా డీపీఓ ను బదిలీ చేస్తూ కోర్టు సస్పెండ్ చేసిన జడ్జిమెంట్ కాపీలు సాయంత్రానికి గానీ రేపు ఉదయానికి గానీ అటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయానికి, విశాఖజిల్లా కార్యాలయానికి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది..!