జర్నలిస్టులకు చేరువుగా ప్రెస్ అకాడమి..


Ens Balu
1
Vijayawada
2021-03-09 15:32:37

గ్రామీణ జర్నలిస్ట్ లతో పాటు ఫోటో, వీడియో జర్నలిస్ట్ ల్లో వృత్తి నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రెస్ అకాడమీ క్రుషి చేస్తుందని ఛైర్మన్ శ్రీనాథ్ అన్నారు.  ఒక ప్రభుత్వ సంస్థగా కాకుండా ప్రెస్ అకాడమీ రాజ్యాంగ బద్ధమైన  విధులతో  నైతికత  కూడిన జర్నలిస్ట్ ల కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. ప్రెస్ అకాడమీ కార్యాలయంలో అకాడమీ ఏపీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ మంగళవారం ఉదయం పాత్రికేయుల సమావేశంలో అకాడమీ కార్యదర్శి ఎం. బాల గంగాధర్ తిలక్ తో కలిసి పాల్గొన్నారు.  చైర్మన్ పదవి చేపట్టినప్పటి నుండి వినూత్న పంధాలో కార్యక్రమాలను నిర్వహిస్తూ జర్నలిస్టులకు, ప్రజలకు మరింత  చేరువయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నామని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ అన్నారు. కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితిల్లో కూడ రాష్ట్రంలోని 13 జిల్లాలలో పర్యటించి స్వయంగా జర్నలిస్టులను కలుసుకుని, వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు.  ప్రెస్ అకాడమీ విడతల వారీగా పాత్రికేయులకు  ఆన్ లైన్ శిక్షణ తరగతులను నిర్వహిస్తోందన్నారు. తద్వారా వారిలో జర్నలిజం లోని నైతికత విలువలపై అవగాహన పెంపొందించే దిశలో అకాడమీ కృషి చేయాలన్నా ధ్యేయం తో అడుగులు వేస్తున్నామన్నారు. తొలివిడత పునశ్చరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల జర్నలిస్టులకు శిక్షణ తరగతులు పూర్తయ్యాయి.                 తొలివిడత శిక్షణలో దాదాపు 4 వేల మంది జర్నలిస్టులు పాల్గొన్నారని, వారిని అభినందించడంతో పాటు కృతజ్ఞత వ్యక్తం చేస్తాన్నామని తెలిపారు.  30 మంది నిష్ణాతులైన సీనియర్ పాత్రికేయులు, జర్నలిజం అధ్యాపకులచే, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తో కూడి శిక్షణ తరగతుల నిర్వహించామని తెలిపారు. 15 విలక్షణ అంశాలపైన శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా యువత జర్నలిజం పై ఆసక్తి చూపుతున్నారని,  ఔత్సాహిక జర్నలిస్ట్ లను అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు. జర్నలిజం కోర్సుల్లో ప్రావీణ్యం పెంపొందించే దిశగా ప్రెస్ అకాడమీ అడుగులు వేస్తోందని శ్రీనాథ్ తెలిపారు. పాత్రికేయుల నైపుణ్యాన్ని పెంచేలా రూపకల్పన చేసిన ఈ- పుస్తకాలను ఆన్ లైన్ లో 7 వేలకు పైగా జర్నలిస్టులు డౌన్ లోడ్ చేసుకున్నారని, ఇది వారిలోని జిజ్ఞాసకు ఉదాహరణ గా పేర్కొన్నారు.                జర్నలిజం కోర్సులను విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, యోగి వేమన విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలతో ప్రెస్ అకాడమీ ఒప్పందం చేసుకున్నామన్నారు.  జర్నలిజం కోర్సుల ఫీజుల రాయితీ విషయంలో ఫీజులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.  యూనివర్సిటీ లు నిర్ధారించిన ఫీజుల్లో 40 నుంచి 50 శాతం అకాడమీ ద్వారా జర్నలిస్ట్ ల తరపున చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మరిన్ని యూనివర్సిటీలతో ఒప్పందాన్ని చేసుకునేందుకు ప్రెస్ అకాడమీ సిద్ధంగా వుందన్నారు.  ఇప్పటికే  వర్కింగ్ జర్నలిస్టులు ఒప్పందం చేసుకున్న యూనివర్సిటీల్లో జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలు తీసుకున్నామన్నారు. విక్రమ సింహాపురి విశ్వవిద్యాలయం ద్వారా ఆన్ లైన్ లో సర్టిఫికేషన్ డిప్లామో కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు.                 మలిదశ శిక్షణలో  గ్రామీణ విలేకరులు, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులతో పాటు ఆయా బీట్ లు , అంశాల వారీగా అవసరమయ్యే  మెళకువలపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం ఆలోచన చేస్తోందని ఆయన అన్నారు.  కోవిడ్ సమయంలో మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకునే దిశలో రూ.5 లక్షల పరిహారం అందచేసే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా స్పందించింది అని తెలిపారు. అదేవిధంగా కోవిడ్ బారిని పడి, చికిత్స పొందిన వారిని కూడా ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు.   జర్నలిస్టులు సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్యులు సానూకూలంగా వున్నారని ఛైర్మన్ తెలిపారు.