సచివాలయాల్లో స్పందన సరే సేవల మాటేమిటి..
Ens Balu
2
Tadepalle
2021-03-10 11:16:02
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్రామసచివాలయ వ్యవస్థ ప్రజలకు అందుబాటులోలకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా..ఇక్కడ ఏ తరహా సేవలు అందుతున్నాయనే విషయం నేటికీ చాలా గ్రామాల్లోని ప్రజలకి తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినపుడే ఇక్కడ పనిచేసే సుమారు 14శాఖల సిబ్బందికి వారి డ్యూటీలు ఏమీటో ఒక చార్టు ప్రకారం తెలియజేసింది. అయితే వారు ఆ విధంగా డ్యూటీలు చేస్తున్నారా అంటే లేదనే సమాధానం చెప్పాలి. ఇదేదో కావాలని చెబుతున్న మాటకాదు గ్రామస్థాయిలో తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేసేందుకు చేస్తున్న ప్రయత్నం. ప్రభుత్వ లెక్కట ప్రకారం ఏ గ్రామసచివాలయంలో ఎన్నిశాఖ సిబ్బంది ఇప్పటి వరకూ విధుల్లో చేరారో..ఆయా గ్రామాల్లో ప్రజలకు తెలియాలి. ఆపై వారు ఏరకమైన సేవలు అందిస్తారో కూడా తెలియాలి. అలా ఇప్పటి వరకూ ఎన్ని గ్రామసచివాలయాల కార్యదర్శిలు ప్రజలకు అవగాహన కలించారు అంటే సిబ్బందే నీళ్లు నములుతున్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సిబ్బంది, పంచాయతీ కార్యదర్శిలు తప్పా మిగిలిన ఏఏ శాఖల సిబ్బంది సచివాలయాల్లో ఉన్నారో నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తెలియలేదంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం గ్రామాల్లో ప్రజలకు ఇంటిముంగిటే సేవలు అందాలని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినటప్పటికీ ఆ విధంగా సేవలు అందటం లేదు. ప్రభుత్వం వాస్తవాలు నేరుగా నమోదు చేస్తే ఆ విషయం తేటతెల్లమవుతుంది. దానికి ప్రత్యక్ష కారణం కూడా లేకపోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు లక్షా 26వేల మందికి పైగా గ్రామ, వార్డు సచివాయాలకు సిబ్బందిని నియమించినా..నేటికీ జిల్లా కలెక్టర్ కార్యాలయం, పట్టణాల్లో నగరాపలక సంస్థ కార్యాలయాలకు నేటికీ స్పందన అర్జీలు వస్తూనే ఉన్నాయి. అంటే దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. గ్రామాల్లో ప్రజలకు సేవలు అందంటం లేదనేది తేటతెల్లమవుతుంది. ఈ తరుణంలో ప్రభుత్వం గ్రామసచివాలయాల్లో ప్రతినిత్యం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటిచించింది. అయినప్పటికీ ప్రజల్లో చైతన్యం రావడం లేదు. ఒక వేళ గ్రామసచివాలయాల్లో స్పందన కార్యక్రమం పెడితే మనం ఏ సమస్యపై అక్కడ అర్జీ పెట్టాలని తెల్ల మొహం వేస్తున్నారు. దీనికి కూడా కారణం లేకపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలాయాల్లో ఇప్పటి వరకూ చాలా శాఖల్లో ఖాళీలు భర్తీ కాలేదు. భర్తఅయిన ప్రభుత్వ శాఖలేంటో, వారు ఎలాంటి సేవలు అందిస్తారో ప్రజలు తెలియపోవడం వలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. ఈ విషయంలో జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు జోక్యం చేసుకొని గ్రామ సచివాలయాల పరిధిలో ప్రజలకు ఏ తరహా సేవలు అందుతాయనే విషయంపై చైతన్యం కల్పిస్తే తప్పా రాష్ట్రప్రభుత్వం అనుకున్నట్టుగా సచివాలయాల్లో స్పందనకు దరఖాస్తుల సంఖ్య పెరిగి జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు స్పందన దరఖాస్తులు తగ్గుతాయి. అలాకాకుండా జిల్లా అధికారులు, మండల అధికారలు తాము బాగా పనిచేసేస్తున్నామని ప్రకటనలు ఇచ్చి ప్రభుత్వాన్ని మభ్య పెట్టాలని చూస్తే మాత్రం గ్రామ, వార్డు సచివాలయాల్లో చాలాశాఖల సిబ్బందికి కూర్చోబెట్టి జీతాలు ఇచ్చినట్టే అవుతుంది. పైగా గ్రామస్వరాజ్యం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామసచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందకుండా పోతాయి. ఈవిషయంలో ప్రభుత్వం వాస్తవాలను గుర్తిస్తే తప్పా ప్రభుత్వ సేవలు, ఖర్చు, విలువైన సమయం వ్రుధాకాకుండా ఉంటాయి.