విశాఖ డీపీఓ పోస్టు బదిలీ జీఓకి తాక్కాలిక తెర..


Ens Balu
2
Visakhapatnam
2021-03-10 14:41:44

విశాఖజిల్లా పంచాయతీ అధికారిణి క్రిష్ణకుమారి బదిలీ జీఓ అంశానికి తాత్కాలికంగా తెరపడినట్టు అయ్యింది.. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి విశాఖ డీపీఓను బదిలీ చేసిన జీఓని హైకోర్టు  నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది. కోర్టు ఉత్తర్వులు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికార మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ కి అందాయి.  విశాఖజిల్లాలో రెగ్యులర్ డీపీఓ  పనిచేస్తుండగా పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి పనిష్మెంట్ పై తూర్పుగోదావరి జిల్లా విఆర్ పురం ఎంపీడీఓగా పనిచేస్తున్న సుభాషిణిని విశాఖజిల్లా డిపీఓ(ఎఫ్ఏసీ)గా బదిలీ చేస్తూ పదిరోజుల క్రితం జీఓ జారీ చేశారు. అదే సమయంలో ఇక్కడ పనిచేస్తున్న డీపీఓని జిఏడీకి రిపోర్టు చేయాల్సిందిగా అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని హైకోర్టులో విశాఖజిల్లా డిపీఓ హైకోర్టులో సవాల్ చేశారు. దీనితో హైకోర్టు ఆ జీఓని  నాలుగు వారాల వరకూ ఆ జీఓని సస్పెండ్ చేసింది. వాస్తవానికి పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న అధికారులుగానీ, ఎంపీడీఓలు గానీ, డీపీఓలపై అవినీతి ఆరోపణలు, విజిలెన్సు విచారణలు, అధికారిక పనిష్మెంట్ వ్యవహారాలు జరుగుతున్న సమయంలో అలాంటి అధికారులను రెగ్యులర్ డిస్ట్రిక్ట్ కేడర్ పోస్టు లైవ్ లో ఉన్నచోటుకి బదిలీ చేయకూడదు. కానీ ఎంపీడీఓ సుభాషిణి విషయంలో ఆ నిబంధనలు ఏమీ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులకు అడ్డు రాలేదు, సదరు అధికారిణిపై అవినీతి ఆరోపణలు, అభియోగాలు ఏమీ రుజువుకాకపోవడంతో ఆమెను అక్కడి నుంచి విశాఖకు బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జీఓ జారీచేశారు. విశాఖలో జివీఎంసీ ఎన్నికలు జరగడానికి ఎన్నికల కోడ్ అమలులో ఉండి.. అక్కడ డీపీఓ ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ కనీసం ఎన్నికల సంఘం ద్రుష్టికి బదిలీ వ్యవహారం తీసుకెళ్లకుండానే పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ జీఓని జారీచేయడం కూడా చర్చనీయాంశం అయ్యింది. అంతేకాకుండా ఈ జీఓ  వ్యవహారం మొత్తం జిల్లా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావుకి తెలియకుండా కూడా ఆగమేఘాలపై జరిగిపోవడం కూడా జిల్లా యంత్రాంగానికి తెలియడంతో ఆమెను జాయిన్ చేసుకునే విషయంలో చుక్కెదురైంది. దానికి ప్రత్యక్ష కారణం జీవిఎంసీ మున్సిపల్ ఎన్నికలైతే రెండో కారణంగా ఆమె అవినీతి తారాస్థాయికి చేరుకోవడం మరొక కారణం. అదే సమయంలో ఇవన్నీ ఆరోపణలు, అభియోగాలు, విచారణలు పెండింగ్ లోనే ఉన్న విషయం కావడంతోనే తాము సుభాషిణి విషయంలో బదిలీతో కూడిన డిపీఓ(ఎఫ్ఏసీ)గా జీఓ జారీ చేశామని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యాలయ అధికారులు సమర్ధించుకున్న తరుణంలోనే ఈ కోర్టు ఉత్తర్వు విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతస్థాయిలో నెట్వర్క్ నడిపినా, కొందరు ప్రజాప్రతినిధులు సపోర్టింగ్ లెటర్స్ ఇచ్చినా, సదరు అధికారిణిపై అవినీతి ఆరోపణలు, ప్రస్తుతం పెండింగ్ లో వున్న విజిలెన్స్ నివేదికలు, ఇతన ఫిర్యాదులన్నీ బటకు వచ్చి మీడియా హడావిడీ చేయడంతో విశాఖలో  సదరు ఎంపీడీఓ డీపీఓ(ఎఫ్ఏసీ)గా జాయిన్ కావడానికి అవకాశం లేకుండా పోయింది. ఇదే తరుణంలో అటు నాలుగు వారాల వరకూ కోర్టు జీఓను సస్పెండ్ చేయడంతో సదరు అధికారిణి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నాలుగువారాల పాటు కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా జీఓని సస్పెండ్ చేసినా, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇచ్చిన జీఓని రద్దు చేసినా, సదరు అధికారిణికి తిరిగి ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చారో ఆప్రాంతానికి తిరిగి పంపినా విషయం సద్దు మనుగుతుంది. అలాకాకుండా అటు ప్రభుత్వం కూడా డిపీఓ క్రిష్ణకుమారి కోర్టుని ఆశ్రయించినట్టుగా ప్రభుత్వంగానీ, సదరు ఎంపీడీఓ గానీ కోర్టువెళ్లినా తిరిగి ఈ విషయం మొదటికొస్తుంది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యాలయ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలోనే ఈ బదిలీ జీఓ రద్దు అవుతుందా, లేదంటే 4 నాలుగు వారాల తరువాత తిరిగి పునరుద్దరిస్తారానే అనేది కూడా ఇపుడు ఉత్కంఠగా మారింది. ఈలోగా ఇదే కేసుపై డిపీఓ క్రిష్ణకుమారి కోర్టు కేసుపై కెవియట్ కి వెళ్లినా మళ్లీ కోర్టులో వాదోపవాదాలు జరిగి అటు పంచాయతీరాజ్ శాఖకు, ఇటు విశాఖజిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులకు కాస్త గట్టిగానే పనికల్పించే అవకాశం ఏర్పడినా ఏర్పడవచ్చు.. ఎంతో ఆశక్తిని రేకెత్తించి, ప్రస్తుతానికి కోర్టు ఉత్తర్వులతో తాత్కాలికంగా తెరపడిన విశాఖజిల్లా డీపీఓ బదిలీ జీఓ విషయంలో ఏంజరుగుతుందనేది వేచి చూడాలి. కానీ డిపీఓ బదిలీ, అటు డీపీఓ(ఎఫ్ఏసీ) జాయినింగ్ విషయంలో ఏం జరిగినా వాటి వివరాలు లైవ్ అప్డేడ్స్ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ద్వారా అందరికంటే ముందుగా అందిస్తామని ప్రకటిస్తున్నాం..!